For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజధానిలో 17ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్(పిక్చర్స్)

|

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, దేశీయ టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం హైదరాబాద్‌లో ‘పబ్లిక్ వైఫై'ని ప్రారంభించాయి. నగరంలోని 17 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనుండగా, ఈ ప్రాంతాల్లోని స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్స్, ఇతర వై-ఫై ఆధారిత పరికారాల వినియోగదారులు ‘పబ్లిక్ వైఫై' ద్వారా ఇంటర్నెట్‌ను పొందే అవకాశం లభించింది.

సైబర్ టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్-కొత్తగూడ జంక్షన్, -సైబర్ టవర్స్-రహేజా మైండ్ స్పేస్ పరిధిలో 8కిమీలలో వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ.. ఇతర టెలికాం రంగ సంస్థలు కూడా ఈ తరహా సేవలను అందించేలా ప్రస్తుతం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.

‘ఇది ప్రారంభం మాత్రమే. నాలుగు నెలల్లో హైదరాబాద్ నగరం మొత్తానికి వై-ఫై సేవలను అందిస్తాం. దీనికి సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. కాబట్టి త్వరలోనే 700 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన రాజధాని నగరం వై-ఫై సేవలతో అలరారనుంది' అని మంత్రి కెటిఆర్ అన్నారు.

హైదరాబాద్‌ను డిజిటల్ సిటీగా మార్చడంలో భాగంగానే ఈ తరహా సేవలపై దృష్టి సారించామని మంత్రి వివరించారు. ఒక్కో వినియోగదారుడు 750 మెగాబైట్ల వరకు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భారతీ ఎయిర్‌టెల్ సిఈఓ వెంకటేష్ విజయరాఘవన్ తెలిపారు.

కాగా, వై-ఫై సేవలకు ఆప్టిక్ ఫైబర్‌ను టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు విజయరాఘవన్ తెలిపారు. ఇంటర్నెట్ స్పీడ్ 40 ఎమ్‌బిపిఎస్‌గా ఉంటుందని, అయితే వినియోగదారుల వాడకంపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సేవల టారీఫ్‌కు సంబంధించిన ప్రక్రియ నడుస్తోందని తెలిపారు.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

తెలంగాణ ప్రభుత్వం, దేశీయ టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం హైదరాబాద్‌లో ‘పబ్లిక్ వైఫై'ని ప్రారంభించాయి.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

తెలంగాణ ప్రభుత్వం, దేశీయ టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం హైదరాబాద్‌లో ‘పబ్లిక్ వైఫై'ని ప్రారంభించాయి. నగరంలోని 17 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనుంది.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఈ ప్రాంతాల్లోని స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్స్, ఇతర వై-ఫై ఆధారిత పరికారాల వినియోగదారులు ‘పబ్లిక్ వైఫై' ద్వారా ఇంటర్నెట్‌ను పొందే అవకాశం లభించింది.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

సైబర్ టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్-కొత్తగూడ జంక్షన్, -సైబర్ టవర్స్-రహేజా మైండ్ స్పేస్ పరిధిలో 8కిమీలలో వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేశారు.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ.. ఇతర టెలికాం రంగ సంస్థలు కూడా ఈ తరహా సేవలను అందించేలా ప్రస్తుతం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.

English summary

రాజధానిలో 17ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్(పిక్చర్స్) | Hyderabad gets 17 free Wi-Fi hotspots

In a bid to develop Hyderabad as a global smart city, the Telangana State government, in association with Airtel, launched Wi-Fi hotspots across 17 locations in the city on Friday, delivering high-speed Internet to citizens free of cost.
Story first published: Saturday, October 11, 2014, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X