For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ ఓకే: నాలుగేళ్లలో 80లక్షల ఉద్యోగాలు!

|

న్యూఢిల్లీ/హైదరాబాద్: సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలు రానున్న మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో సుమారు 80 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేయడంతో వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘దేశంలో ప్రస్తుతం ఉపాధి అవకాశాల కల్పనకు ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగానికి చేయూతనివ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది' అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన తొలి సార్వత్రిక బడ్జెట్‌ను మానవ వనరుల రంగం నిపుణులు స్వాగతించారు.

Budget can help create 5-8 million jobs in next 3-4 years: Experts

ఈ బడ్జెట్‌లో జైట్లీ చేసిన ప్రతిపాదనల వల్ల మౌలిక వసతులు, రవాణా, విద్యుత్, వినియోగ వస్తువులు, ఈ-కామర్స్, పర్యాటక తదితర రంగాల్లో తక్షణమే ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహంతో రూపొందించిన ఈ బడ్జెట్ సంస్కరణలకు అనుకూలమైనదిగానూ, అభివృద్ధిపై దృష్టి సారించేదిగానూ కనిపిస్తోందని, ఉపాధి మార్కెట్‌పై ఈ బడ్జెట్ స్పష్టమైన సానుకూల ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నానని ప్రముఖ జాబ్ పోర్టల్ ‘నౌకరీ.కామ్' ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ సురేష్ తెలిపారు.

దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, అలాగే ఆర్థిక వ్యవస్థకు మళ్లీ జవసత్వాలు నింపేందుకు మౌలిక వసతులు, నిర్మాణ రంగాల్లో వృద్ధిని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా జైట్లీ ఉద్ఘాటించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఎనలేని ప్రాధాన్యతను కలిగివున్న ఉత్పత్తి రంగం వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనపై విస్తృత ప్రభావం చూపుతోందని, అందుకే ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను పెంపొందించేందుకు వివిధ ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ స్పష్టం చేశారు.

బడ్జెట్ భేష్: పారిశ్రామిక వర్గాలు

హైదరాబాద్: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పలువురు పారిశ్రామిక వేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా సమతూకంగా ఉందని ఫ్యాప్సీ అధ్యక్షుడు శివకుమార్ రుంగ్టా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను అధిగమించేలా సోలార్ విద్యుత్ రంగానికి బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు అందించడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. అలాగే మరో ప్రధాన సమస్య ద్రవ్యలోటును మూడేళ్లలో తగ్గిస్తామనడం కూడా మంచి పరిణామని చెప్పారు.

ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్ర బడ్జెట్ ఉందని కొనియాడారు. చిన్న తరహా, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహించేలా 10 వేల కోట్ల నిధులు కేటాయించడం మంచి నిర్ణయమన్నారు. అలాగే స్కిల్ ఇండియా, ఎగ్జిట్ పాలసీ, సెజ్ రివైజ్ వంటి నిర్ణయాలతో దేశ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని సంకల్పించడం చిన్న తరహా పరిశ్రమల వర్గాలకు ఊరట కలిగించే అంశమన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సముచిత ప్రాధాన్యత లభించిందని సెక్రటరీ జనరల్ భలేరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను నెరవేర్చుతామని బడ్జెట్‌లో గుర్తుచేయడం సంతోషకరమన్నారు.

నాస్కామ్ వైస్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఊహించినట్లుగా పెద్ద సంస్కరణలు లేవని, మౌలిక సదుపాయాలు, గృహ రంగానికి పెద్ద పీట వేశారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వినూత్న పరిశ్రమలు స్ధాపించేవారికి ప్రోత్సాహకరంగా ఉందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. జైట్లీ బడ్జెట్‌తో రియాల్టీ రంగానికి మంచి రోజులు వస్తాయని, ఇండ్ల నిర్మాణానికి మంచి ఊపు వస్తుందని క్రెడాయ్ జాతీయ అధ్యక్షులు సి.శేఖర్ రెడ్డి అన్నారు.

English summary

బడ్జెట్ ఓకే: నాలుగేళ్లలో 80లక్షల ఉద్యోగాలు! | Budget can help create 5-8 million jobs in next 3-4 years: Experts

With the government putting strong emphasis on job creation, experts today said measures proposed in the union budget can help create 5-8 million jobs in next 3-4 years across various sectors.
Story first published: Friday, July 11, 2014, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X