
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న 4జి టెలీ కమ్యూనికేషన్స్ సేవలు (రిలయన్స్ జియో బ్రాండ్ పేరిట) 2015లో ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. రిలయన్స్ జియో భారత దేశంలో ఉపాధిని కల్పించే, సంపదను సృష్టించే అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటిగా ఉంటుంది... నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు మొదట్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు 5వేల పట్టణాలు, నగరాలలో ప్రారంభమవుతాయి. చివరికి దేశంలోని మొత్తం 6 లక్షల గ్రామాల్లోని ప్రతి గ్రామానికీ ఈ నెట్‌వర్క్ విస్తరిస్తుందని ముకేష్ వివరించారు.
నిరుడు లాభాల బాటలో అడుగుపెట్టిన రిటైల్ వ్యాపారం, టెలికాం వ్యాపారాలే రాబోయే రోజుల్లో కంపెనీకి విలువను జోడించే ప్రధాన రంగాలుగా ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ‘రాబోయే మూడేళ్లలో పెట్రో కెమికల్స్ రంగంలోని ప్రతి ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటుగా తమ రిటైల్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడం, జియో బిజినెస్‌ను ప్రారంభించడంతో కార్పొరేట్ ప్రయాణంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న కంపెనీని ఫార్చ్యూన్-50 కంపెనీల్లో ఒకటిగా ఉండాలన్న తమ లక్ష్యానికి చేరువ చేస్తాయని ముకేష్ తెలిపారు.
రిలయన్స్ బోర్డులో తొలి మహిళ డైరెక్టర్‌గా నీతా అంబానీ
దేశంలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో తొలి మహిళా డైరెక్టర్‌గా ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నియమితులయ్యారు. ప్రతి కంపెనీ బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా డైరెక్టర్ ఉండాలన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనకు అనుగుణంగా ఈ నియామకం జరిగింది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీని బోర్డు డైరెక్టర్‌గా నియమించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపింది. ఇంతవరకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ముకేశ్ పెదనాన్న రమ్నిక్‌లాల్ హెచ్ అంబానీ స్థానంలో నీతా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాం
సహజవాయువు ధర పెంపుదల అంశంలో నలువైపుల నుంచి వ స్త్తున్న విమర్శలను తట్టుకొని నిజాయితీ, పారదర్శకతతో ప్రజా విశ్వాసం చూరగొంటామని ముకేశ్ అంబానీ అన్నారు. సమయానుకూల అనుమతులు, మార్కెట్ ఆధారిత గ్యాస్ ధర.. ఇంధన నిక్షేపాల అభివృద్ధిలో కీలకమని ఆయన చెప్పారు. గ్యాస్ ధర వివాదానికి సంబంధించి ప్రభుత్వంతో ఆర్బిట్రేషన్ నడుస్తోందని, అంతకు ముందు తమపై విధించిన జరిమానాలకు సంబంధించి ఒక ఆర్బిట్రేషన్ జరుగుతోందని ముకేశ్ వివరించారు. ఈ రెండు అంశాల్లో సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేజీ బేసిన్ సహజవాయువు క్షేత్రాల నుంచి ఉత్పత్తిని పెంచుతామని, మధ్యప్రదేశ్‌లోని కోల్ సీమ్స్ (కోల్ బెడ్ మీథేన్- సిబిఎం) నుంచి 2015-16 నాటికి సహజవాయువు వెలికితీతను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
సిబిఎంతో దేశీయ సాంప్రదాయేతర ఇంధన విభాగంలో అతిపెద్ద సంస్థగా అవతరిస్తామని ఆయన తెలిపారు. తమ క్షేత్రాల్లో సహజవాయువు, చమురు ఉత్పత్తులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications