For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలోచించే బాధత్యలు తీసుకున్నా: సత్య నాదెళ్ల

|

satya nadella,
న్యూయార్క్/న్యూఢిల్లీ: సత్య నాదెళ్ల.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సిఈఓగా ఎంపికైన నేపథ్యంలో ఆయన స్వదేశమైన భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా సత్య నాదెళ్ల ప్రశంసలందుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సత్య నాదెళ్లతో నిర్వహించిన ఇంటర్వ్యూని మైక్రోసాఫ్ట్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం తటపటాయించలేదని, నిండైన ఆత్మవిశ్వాసంతో సిద్ధం అంటూ చేయెత్తి ముందుకు వచ్చానని సత్య నాదెళ్ల తెలిపారు. అంతకంటే ముందు అసలు తానెందుకు సిఈఓ కావాలనుకుంటున్నారో లోతుగా ఆలోచించినట్లు చెప్పారు. తనను తాను ప్రశ్నించుకున్న తర్వాతే బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ చోదక ప్రపంచంలో తనదైన ముద్రవేయాలన్న కాంక్షనే తనను సిఈఓ పదవికి పురికొల్పుతున్న విషయాన్ని గుర్తించినట్లు సత్య నాదెళ్ల తెలిపారు.

మైక్రోసాఫ్ట్ సిఈఓ కావాలని ఎందుకు కోరుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా.. సిఈఓగాగా అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రశ్న తనకు తానే వేసుకుని చాలా లోతుగా ఆలోచించానని చెప్పారు. అసలు నేనిక్కడ ఉండటానికి మూల కారణం.. ప్రపంచంపై నాదైన ముద్ర వేయడం కోసమేనని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ మయమైన ప్రపంచంలో అలాంటి బలమైన ముద్ర వేయాలంటే మైక్రోసాఫ్ట్‌ను మించిన అవకాశం మరేం ఉంటుందని సత్య నాదెళ్ల వివరించారు.

దైనందిన జీవితాన్ని టెక్నాలజీ ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో తాను ఇన్నోవేషన్‌పైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కస్టమర్స్, పార్ట్‌నర్స్ సమావేశంలో సత్య నాదెళ్ల చెప్పారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో వస్తున్న పరిణామాలే భవిష్యత్తును నిర్ధారిస్తాయని ఆయన అన్నారు. క్లౌడ్, మొబైల్ టెక్నాలజీల ప్రభంజనంలో సాఫ్ట్‌వేరే దైనందిన జీవితాన్ని శాసిస్తుందని నాదెళ్ల చెప్పారు. కార్యాలయాల్లో నిర్వహించే ఆన్‌లైన్ సమావేశాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడం, కమ్యూనికేట్ చేయడం, కంటెంట్ వినియోగం, ఎంటర్‌టైన్‌మెంట్...ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్‌లో ఇన్నోవేషన్‌తో కొత్త పుంతలు తొక్కనున్నట్టు సత్య నాదెళ్ల వివరించారు.

రోజు రోజుకూ కొత్తదనాన్ని అన్వేషిస్తేనే సమాచార, సాంకేతిక రంగంలో పని ఉద్వేగభరితంగా ఉంటుందని నాదెళ్ల చెప్పారు. నిన్న చేసిన పని వెనక్కివెళ్లిపోతుంది. ఈ రోజు ఏం చేయాలన్నదే కొత్తగా ముందుంటుంది.. అని ఆయన అన్నారు. తనను తాను నిత్యవిద్యార్థిగా చెప్పుకున్నారు. 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నా.. సంస్థలో తనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయని అన్నారు. రానున్న కొద్ది నెలల పాటు తాను మైక్రోసాఫ్ట్ భాగస్వాములను, ఇన్వెస్టర్లను, కస్లమర్లను కలుసుకోవడంపై దృష్టి సారిస్తానని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

బిల్‌గేట్స్ వ్యాఖ్య

సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ కొత్త సిఇఒగా ఎంపికచేయడం అద్భుతంగా ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీకి సారధ్యం వహించడానికి అవసరమైన నేపథ్యం సత్య నాదెళ్లకు ఉందని ఆయన వెల్లడించారు. కంపెనీ కోసం మరింత సమయం వెచ్చించాల్సిందిగా సత్య తనను కోరారని బిల్‌గేట్స్ వెల్లడించారు. సత్య సూచనల మేరకు తాను కంపెనీలో మరింత సమయం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

టాప్ 10 కంపెనీలకు భారత సిఈఓలు

78 బిలియన్ డాలర్ల విలువైన మైక్రోసాఫ్ట్ సిఇఒగా ఆయన ఏడాదికి 7.5 కోట్ల రూపాయల (1.2 మిలియన్ డాలర్లు) వేతనాన్ని పొందుతున్నారు. ఇక ఏటా వచ్చే బోనస్‌తోపాటు సంస్థలో ఆయనకున్న షేర్ల ప్రకారం అన్నీ కలిపితే సత్య నాదేళ్ల వార్షిక ఆదాయం 112 కోట్ల రూపాయల (18 మిలియన్ డాలర్లు)ను తాకుతోంది. ఇతర అలవెన్సులు జతచేస్తే ఈ మొత్తం మరింత పెరుగుతుంది.

ఏడాదికి వేతనం 1.2 మిలియన్ డాలర్లు, బోనస్ 3.6 మిలియన్ డాలర్లు, ఇఐపి షేర్ల ద్వారా మరో 13.2 మిలియన్ డాలర్లు ఇలా మొత్తం 18 మిలియన్ డాలర్లు సత్య నాదేళ్లకు ఏటా అందనున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌తోపాటు స్టీవ్ బామర్ తర్వాత సిఇఒగా ఎన్నికయ్యారు సత్య నాదెళ్ల. ఫలితంగా 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ చరిత్రలో మూడో సిఇఒగా ఆయన నిలిచారు.

1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల.. సిఇఒ కాకముందు సర్వర్-టూల్స్ వ్యాపారం అధ్యక్షుడిగా ఉండి 2013లో 6,75,000 డాలర్ల వార్షిక వేతనాన్ని పొందారు. మొత్తం ఏటా 48 కోట్ల రూపాయల ఆదాయాన్ని నాదెళ్ల అందుకున్నారు. అలాగే గత ఏడాది 1.6 మిలియన్ డాలర్ల బోనస్‌ను పొందిన నాదెళ్ల.. ప్రస్తుతం సిఇఒ కావడంతో అదికాస్తా 3.6 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. అంతేగాక ఏటా 13.2 మిలియన్ డాలర్ల విలువైన ఇఐపి స్టాక్స్‌ను పొందేందుకు ఇప్పుడు ఆయన అర్హత సాధించారు.

ప్రస్తుతం భారత్ సిఈఓల ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. ఇండియా ప్రధాన 'ఎగుమతి' సిఈఓలేనని గతంలో టైమ్ మేగజైన్ వ్యాఖ్యానించింది. మైక్రోసాఫ్ట్ సారథిగా సత్య నాదెళ్ల నియామకంతో ఇది అక్షరాలా నిజమని తేలింది. భారత సంతతికి చెందిన టాప్-10 సిఇఒల్లో సత్య నాదేళ్ల (మైక్రోసాఫ్ట్), ఇంద్రా నూరుూ (పెప్సీ), లక్ష్మీ మిట్టల్ (ఆర్సెలార్ మిట్టల్), అన్షు జైన్ (డ్యూషే బ్యాంక్), ఇవాన్ మెనె్జస్ (డియాజియో), రాకేష్ కపూర్ (రిక్కిట్ బెన్‌స్కిసర్), అజయ్ బంగా (మాస్టర్ కార్డ్), పియూష్ గుప్తా (డిబిఎస్ గ్రూప్ హోల్డింగ్స్), సంజయ్ మెహ్రోత్రా (సాన్ డిస్క్), సంజయ్ ఝా (గ్లోబల్ ఫౌడ్రిస్), శంతను నారాయణ్ (అడోబ్) ఉన్నారు.

English summary

ఆలోచించే బాధత్యలు తీసుకున్నా: సత్య నాదెళ్ల | I raised my hand to be Microsoft CEO, says Satya Nadella

India-born Satya Nadella said he "raised his hand" to take up the top job at Microsoft as he believed his role as CEO would enable him to make an impact in an increasingly "software-powered" world and drive innovation.
Story first published: Thursday, February 6, 2014, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X