For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిపోర్ట్: సామ్‌సంగ్‌పైనే ఇండియన్స్ నమ్మకం

|

Samsung
న్యూఢిల్లీ/హైదరాబాద్: మన దేశంలో అత్యంత విశ్వనీయమైన బ్రాండ్‌గా దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను సోనీ, టాటా సంస్థలు దక్కించుకున్నాయి. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ(టిఆర్ఏ) ఈ మేరకు ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014' నివేదికను విడుదల చేసింది. గత సంవత్సరం నిర్వహించిన సర్వేలో ఈ మూడు సంస్థలు వరుసగా రెండు, మూడు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

టిఆర్ఏ గత నాలుగు సంవత్సరాలుగా ఈ నివేదికను విడుదల చేస్తోంది. తన నివేదికలో ఈ ఏడాది 100 కంపెనీలకు ర్యాంకులను ప్రకటించింది. దక్షిణ కొరియాకు చెందిన మరో కంపెనీ ఎల్‌జి నాలుగో స్థానంలో నిలవగా.. ఫిన్‌‌లాండ్‌కు చెందిన నోకియా ఐదో స్థానంలో నిలిచినట్లు టిఆర్ఏ సిఈఓ ఎస్ చంద్రమౌళి తెలిపారు.

ఏదైనా ఒక కంపెనీ నమ్మకంపై దృష్టి సారించినట్లయితే.. నమ్మకంతోపాటు మార్కెట్ వాటాను కూడా సంపాదించుకుంటుందని పేర్కొన్నారు. ఆ కంపెనీ ప్రవేశపెట్టే కొత్త ఉత్పత్తులను వెంటనే వినియోగదారులు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతారని వెల్లడించారు.

హ్యులెట్ ప్యాకార్డ్ 14 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకున్నట్లు చెప్పారు. హీరో అనూహ్యంగా 79వ స్థానం నుంచి ఏడో స్థానాన్ని దక్కించుకుందని ఆయన తెలిపారు. హోండా, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు తొలి పది స్థానాల్లో నిలిచాయని చంద్రమౌళి పేర్కొన్నారు.

జివికె బయో చేతికి అమెరికా కంపెనీ

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన మాలిక్యూల్ కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థ జివికె బయోసైన్సెస్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ అరాజెన్ బయోసైన్స్ ఇంక్‌లో 65 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరిగింది. ఈ కంపెనీకి హై వాల్యూ బయోలాజిక్స్ సర్వీసుల్లోని ప్రీ క్లినికల్ సిఆర్ఒలో నైపుణ్యం ఉంది. కాగా ఈ కంపెనీ కొనుగోలుతో జివికె బయో తన తొలి అంతర్జాతీయ కొనుగోళ్ల పరంపరను ప్రారంభించినట్లయింది.

అయితే ఆ కంపెనీలో వాటాను ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది మాత్రం వెల్లడికాలేదు. జివికె బయో 350కి పైగా కంపెనీల కోసం కాంట్రాక్ట్ రీసెర్చ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో 2,400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తొలుత ఈ కంపెనీలో 65 శాతం వాటానే కొనుగోలు చేసినప్పటికీ రెండేళ్ల కాలంలో మొత్తం వాటాను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

English summary

రిపోర్ట్: సామ్‌సంగ్‌పైనే ఇండియన్స్ నమ్మకం | Samsung most trusted brand in India; Sony, Tata make up top 3: Report

South Korean electronics major Samsung has emerged as the most trusted brand in India followed by Sony and Tata, says a report.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X