For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచిన కెనరా బ్యాంక్

By Nageswara Rao
|

Canara Bank
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. మార్పులు చేసిన ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 20, 2013 నుండి అమల్లోకి రానున్నాయి. వివరాల్లోకి వెళితే కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 1.75 శాతానికి పెంచింది. దీని ప్రకారం 31-45 రోజుల మధ్య డిపాజిట్ రేటు 6.50 శాతం నుండి 8.25 శాతానికి చేరింది. 46-90 రోజుల మధ్య డిపాజిట్ రేటు 7 శాతం నుండి 8.30 శాతానికి చేరింది.

కెనరా బ్యాంకుతో పాటు మరో మూడు బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. వీటిలో యాక్సిస్, కరూర్ వైశ్యా, దేనా బ్యాంకులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న కఠిన లిక్విడీటీ పరిస్దితుల నేపథ్యంలో చాలా బ్యాంకులు ద్రవ్య లభ్యతను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇందులో భాగంగానే డిపాజిట్ రేట్లు, రుణ రేట్లను పెంచుతున్నాయి.

యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కనీస రుణ రేటును పావు శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.25 శాతానికి ఎగిసింది. ఈ తాజా రేటు ఆగస్టు 19 నుండి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. ఈ తాజా నిర్ణయంతో కనీస రేటుకు అనుసంధానమైన గృహ, ఆటో, కార్పోరేట్ రుణ రేట్లు పెరగనున్నాయి.

కరూర్ వైశ్యా బ్యాంక్: ప్రైవేటు రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ రుణ రేటును ఈరోజు పావుశాతం పెంచుతోంది. దీంతో ఈ రుణ రేటు 11 శాతానికి చేరనుంది. ప్రాధమిక వడ్డీ రేటును కూడా 15.75 శాతం నుండి 16 శాతానికి పెంచింది.

దేనా బ్యాంక్: దేనా బ్యాంక్ మూడేళ్లకు పైబడిన ఎన్ఆర్‌ఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఒక శాతానికి పెంచింది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచిన కెనరా బ్యాంక్ | Canara Bank revises interest rate on domesticNRO term deposits

Public sector lender Canara Bank on Monday announced change in interest rate on domestic/NRO term deposits with effective from August 20, 2013.
Story first published: Tuesday, August 20, 2013, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X