For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరప్‌లో రికార్డు స్దాయి నష్టాలు: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న టాటా స్టీల్

By Nageswara Rao
|

Tata Steel
Tata Steel: Quotes, News
BSE 162.10BSE Quote2.1 (1.30%)
NSE 162.10NSE Quote2.05 (1.26%)
భారత ఉక్కు రంగ దిగ్గజం టాటా స్టీల్ షేర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇందుకు కారణం టాటా స్టీల్‌కు చెందిన యూరప్ విభాగం గత మార్చి 31తో ముగిసిన ఏడాదికి 1.3 బిలియన్ పౌండ్ల నష్టాల్ని చవిచూడటమే. వివరాల్లోకి వెళితే బ్రిటన్‌లో అతి పెద్ద ఉక్కు కంపెనీ అయిన కోరస్‌ను టాటా స్టీల్ 2007లో కొనుగోలు చేసి దీని పేరును టాటా స్టీల్ యూరప్‌గా మార్చిన విషయం తెలిసిందే. అంతక ముందు సంవత్సర కాలంలో కంపెనీ నష్టాలు 846 మిలియన్ పౌండ్లు. ద్వితీయార్దంలో మార్కెట్ స్దితిగతులు దిగజారడంతో కంపెనీ ఆదాయాలు 14 శాతం తగ్గినట్లు టాటా స్టీల్ యూరప్ వెల్లడించింది.

అంతర్జాతీయంగా ఉక్కు ధరలు తగ్గడం.. గిరాకీ మందగించడం, చౌక దిగుమతులతో పోటీ పెరిగిపోవడం నష్టాలకు దారితీసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది ఇలా ఉంటే కంపెనీ నికర రుణాలు మాత్రం 3.4బిలియన్ పౌండ్ల కు పెరిగిపోయాయని.. గత ఏడాది వడ్డీలకే కంపెనీ 352 మిలియన్ పౌండ్లు చెల్లించిందని ప్రముఖ పత్రిక ద సండే టైమ్స్ వ్రాసింది. ఈరోజు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో టాటా స్టీల్ షేర్లు 52 వారాల కనిష్ట స్దాయి(రూ. 256)లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మెటల్ కౌంటర్లు బాగా బలహీన పడుతున్నాయి.

ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 31 పాయింట్ల లాభంతో 19,990 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ మాత్రం 1 పాయింటుకు పైగా నష్టపోతూ 6,007 వద్ద ట్రేడ్ అవుతుంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

యూరప్‌లో రికార్డు స్దాయి నష్టాలు: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న టాటా స్టీల్ | Tata Steel drops sharply on record losses in Europe

Shares in Tata Steel plunged by almost 3 per cent after record losses in Tata Steel Europe saw selling pressure in the counter.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X