
కేంద్ర టెలికాం శాఖ అందించిన సమాచారం ప్రకారం భారతీ ఎయిర్ టెల్‌కు 13 రీజియన్లలో సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ నిబంధనను ఉల్లంఘించడం వల్ల రూ. 650 కోట్లు జరిమానా విధించగా.. వోడాఫోన్ ఇండియాకు మాత్రం ముంబై, న్యూఢిల్లీ రీజియన్లలో నిబంధనను ఉల్లంఘించడం వల్ల రీజియన్‌కు రూ. 50 కోట్లు చొప్పున మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. జూన్ 2003లోనే సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ సర్వీసుని నిలిపివేయాలని టెలికాం శాఖ ప్రస్తావించినప్పటికీ.. హాచ్ (ఇప్పుడు వోడాఫోన్) మాత్రం జాతీయ రౌటింగ్ ప్రణాళికను అతిక్రమించి 2005 వరకూ ఈ సేవలను కొనసాగించడం వల్ల ఈ జరిమానా విధించారు.
ఈ విషయంపై కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబల్ వోడాఫోన్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్‌కు షోకాజ్ నోటీసులు పంపించినప్పటికీ.. వోడాఫోన్ ఏ మాత్రం స్పందించ లేదు. ఐతే వోడాఫోన్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని కొట్టి పారేశారు. ఇది ఇలా ఉంటే వొడాఫోన్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ రెండూ కూడా వేర్వేరు కారణాల వల్ల తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. వొడాఫోన్ దాదాపు 12 వేల కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించాలని ఐటీ శాఖ గట్టిగా పట్టుపడుతోంది. దీనిపై కోర్టు బయట సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇటీవల కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications