For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా బ్యాంక్ @ Q4 నికర లాభం రూ. 345 కోట్లు

By Nageswara Rao
|

Andhra Bank
హైదారాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఆంధ్రా బ్యాంక్ మార్చి 31తో ముగిసిన నాల్గవ త్తైమాసికానికి గాను ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఆంధ్రా బ్యాంక్ నికర లాభంలో 1.5 శాతం పెరిగి రూ. 345 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్త్రైమాసికంలో గనుక చూసినట్లేతే నికర లాభం రూ. 340 కోట్లు. ఇక జనవరి - మార్చి త్త్రైమాసికంలో ఆంధ్రా బ్యాంక్ గరిష్ట ఆదాయం రూ. 3,229 కోట్లకు చేరగా.. గత ఏడాది కూడా ఇంతే గరిష్ట ఆదాయాన్ని నమోదు చేసింది. నాల్గవ త్త్రైమాసికంలో బ్యాంక్ మొండి బకాయిలు రూ. 2,409 కోట్లుగా నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఇది మూడు రెట్లకు సమానం. గత ఏడాది మొండి బకాయిలు రూ.756 కోట్లు.

ఆంధ్రా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో ఉద్యోగుల వేతనాలు నాల్గవ త్త్రైమాసికంలో రూ. 381 కోట్లు. గత ఏడాది ఉద్యోగుల వేతనాలు రూ. 319 కోట్లు. ఈ ఏడాది బ్యాంక్ నిర్వహణ ఖర్చు రూ. 213 కోట్లకు చేరగా.. గత ఏడాది నిర్వహణ ఖర్చు రూ. 164 కోట్లు. కాగా 2013తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు గరిష్ట ఆదాయం రూ.13,957 కోట్లు. గత ఏడాది 2011-12వ సంవత్సరంలో బ్యాంక్ గరిష్ట ఆదాయం రూ.12,199 కోట్లు.

వన్ఇండియా తెలుగు మనీ

English summary

ఆంధ్రా బ్యాంక్ @ Q4 నికర లాభం రూ. 345 కోట్లు | Andhra Bank net profit at Rs 345 crores for Q4 2013 | ఆంధ్రా బ్యాంక్ @ Q4 నికర లాభం రూ. 345 కోట్లు

Government owned Andhra Bank has reported a net profit of Rs 345 crores for the quarter ending March 31, 2013. The net profits in the previous quarter ending December 31, 2012 was Rs 257 crores.
Story first published: Saturday, May 4, 2013, 11:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X