For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్‌బీఐ ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షించనున్న దువ్వూరి సుబ్బారావు

By Nageswara Rao
|

D Subba Rao
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన విభాగాన్ని ఇక నుండి ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. నిన్నటి వరకూ ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్ నిన్న(సోమవారం) రిటైరయ్యారు. వడ్డీరేట్లు, ఇతర కీలక రేట్లు, తదితర అంశాలను ఈ విభాగం చూస్తుంది. మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్ష జనవరి 29న ప్రకటించనున్న నేపధ్యంలో ద్రవ్య విధాన విభాగం దువ్వూరి చూస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

సుబీర్ గోకర్ణ్ మూడేళ్ల పదవీ కాలం 2012, నవంబర్‌తో ముగిసింది. ఐతే ఈ గడువును కేంద్ర ప్రభుత్వం ఒక నెల పొడిగించింది. దీంతో 2012, డిసెంబర్ 31తో గోకర్ణ్ పదవీ కాలం ముగిసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతానికి సుబీర్ గోకర్ణ్ స్దానంలో బాధ్యతలు స్వీకరించే వ్యక్తిని ఇంకా ఖరారు చేయలేదు. గోకర్ణ్ స్థానంలో వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్(దక్షిణాసియా) కల్పనా కొచర్ వచ్చే అవకాశాలున్నాయన్నారు.

ఇక సుబీర్ గోకర్ణ్ రిజర్వ్ బ్యాంక్‌లో చేరకముందు ఆయన స్టాండర్డ్ అండ్ పూర్స్ ఆసియా-పసిఫిక్ లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. ఇక రాజస్థాన్ రీజనల్ డెరైక్టర్‌గా పనిచేస్తోన్న దీపాలి పంత్ జోషికి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పదోన్నతి లభించింది.

తెలుగు వన్ఇండియా

English summary

ఆర్‌బీఐ ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షించనున్న దువ్వూరి సుబ్బారావు | RBI shuffles portfolios as Dep Governor Gokarn retires | సుబీర్ గోకర్ణ్ రిటైర్... దువ్వూరి చేతిలోకి ద్రవ్య విధాన విభాగం

With Dr. Subir Gokarn's term as Deputy Governor having come to a close on December 31, 2012, the portfolios of Deputy Governors of the Reserve Bank of India have been reallocated.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X