For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ నుండి గౌరవ డిగ్రీ పొందిన రతన్ టాటా

By Nageswara Rao
|

Ratan Tata
సిడ్నీ: ఇండియన్ బిజినెస్ ఐకాన్ రతన్ టాటాను ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ గౌరవ డిగ్రీతో సత్కరించింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ నుండి గౌరవ డిగ్రీ పొందిన సందర్బంలో రతన్ టాటా మాట్లాడుతూ రాబోయే కాలంలో రెండు దేశాలు కలిసి చేయాల్సింది చాలా ఉందని అన్నారు. కొన్ని టెక్నాలజీ ఏరియాల విషయంలో ఆస్టేలియా ఎంతో ముందుందని, భారత్ కూడా వాటిని అందుకోవాలని ఆకాంక్షించారు.

టాటా గ్రూప్ ఉత్పత్తులు ఆటోమొబైల్స్ నుండి సాప్ట్‌వేర్ రంగం వరకు సేవలను అందిస్తున్న తరుణంలో ఆస్టేలియా తన ఉత్పత్తులను ఇండియాకు ఎగుమతి చేసే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 300 మిలియన్ మధ్యతరగతి జనాభా ఇప్పుడు సుమారు 600 మిలియన్లకు పెరిగిందని తెలిపారు. గత పది సంవత్సరాల నుండి గమనిస్తే భారత్, ఆస్టేలియా దేశాల మధ్య ట్రేడ్‌లో ఎంతో సారుప్యత వచ్చిందని అన్నారు. ఆస్టేలియా కమొడిటీసైన కోల్, వూల్, కాపర్‌కు మంచి డిమాండ్ ఉందని అన్నారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు మెరుగు పరడడంతో ఎడ్యుకేషన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

భారత్‌లో ఎన్ని ప్రభుత్వాలు మారినా దృక్పథం మాత్రం అందరూ అనుకుంటున్నంత చెడ్డగా ఉండబోదని రతన్ టాటా తెలిపారు. ఐతే భారతీయ విలువలు, నైతికత క్రమంగా తగ్గుతోందని, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని అన్నారు. ఇది ఇలా ఉంటే పట్టణాభివద్ధిశాఖ మంత్రి కమల్‌నాథ్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రాలకు యూఏఈలో జరిగిన కార్యక్రమంలో ఆసియా బిజినెస్‌ లీడర్ల అవార్డుతో సన్మానించారు. ఆసియా బిజినెస్‌ లీడర్‌ షిప్‌ ఫోరమ్‌ అవార్డుల కార్యక్రమానికి యూఈఏ, ఒమాన్‌, ఇండియా, మలేషియా, సింగపూర్‌, థాయిలాండ్‌ ఇండోనేషియాకు చెందిన వ్యాపార, రాజకీయ నాయకులు హాజరయ్యారు. మౌలిక రంగంతో పాటు ఇంధనరంగంతో పాట పలు రంగంలో విజయం సాధించిన 17 మందిని మంగళవారం నాడు అబుదాబిలో సన్మానించారు. కమల్‌నాథ్‌కు ఎబీఎల్‌ఎఫ్‌ స్టేట్స్‌ మన్‌ అవార్డు, మహీంద్రాగ్రూపునకు చెందిన చెైర్మన్‌, మేనేజింగ్‌ డెైరెక్టర్‌ ఆనంద్‌ మహీంద్రాకు ఎబిఎల్‌ఎఫ్‌ బిజినెస్‌ కరేజ్‌ అవార్డు అందజేశారు.

తెలుగు వన్ఇండియా

English summary

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ నుండి గౌరవ డిగ్రీ పొందిన రతన్ టాటా | India's Ratan Tata urges closer business ties with Australia | రతన్ టాటాకు ఆస్టేలియా యూనివర్సిటీ నుండి గౌరవ డిగ్రీ

Indian business icon Ratan Tata urged stronger trade ties with Australia, particularly in technology, saying there are major growth opportunities for both countries. Receiving an honorary degree from the University of New South Wales, the chairman of India’s largest corporation also said citizens of both countries needed to become more familiar to each other.
Story first published: Thursday, November 29, 2012, 12:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X