For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగ్‌పూర్‌లో 1,000 సీట్ల సామర్థ్యంతో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌: మహీంద్రా సత్యం

By Nageswara Rao
|

Mahindra Satyam
హైదరాబాద్: భారతదేశపు ఐటీ సేవల సంస్ద మహీంద్రా సత్యం వచ్చే రెండేళ్లలో క్యాంపస్‌ల సామర్ధ్యం పెంచుకునేందుకు భారీగా నిధులను వెచ్చించనుంది. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లలో 15,000 సీట్ల సామర్ద్యం సమకూర్చునే భాగంలో సుమారు రూ. 800 కోట్లు ఖర్చుపెట్టనున్న విషయాన్ని మహీంద్రా సత్యం నిన్న ప్రకటనలో తెలిపింది. నాగ్‌పూర్‌లో కొత్తగా 1,000 సీట్ల సామర్థ్యంతో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం మిహాన్ ఎస్‌ఈజెడ్‌లో ప్రాథమికంగా రూ.80 కోట్లు వెచ్చిస్తోంది. వ్యాపారంలో వృద్ధిని అందుకొనే దిశగా హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు క్యాంపస్‌ల్లో సామర్థ్యం పెంపుదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంది.

వచ్చే 15-18 నెలల్లో నాగ్‌పూర్‌లోని మిహాన్ క్యాంపస్‌లో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఇకపోతే ఒడిశా రాజధాని భువనేశ్వర్ క్యాంపస్ విస్తరణ ప్రణాళిక కూడా ఇందులో భాగంగా ఉందని తెలిపింది. గ్లోబల్ డెలివరీ మోడల్‌ను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంలో భాగంగానే ప్రస్తుత ప్రణాళిక ఉంటుందని, ‘2015 మిషన్' కూడా ఇదేనని మహీంద్రా సత్యం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ అండ్ కార్పొరేట్ సర్వీసెస్) శివానంద రాజా పేర్కొన్నారు. తద్వారా ఆయా నగరాల్లో ఉపాధి కల్పనతో పాటు నవకల్పనల్లో వేగాన్ని పెంచగలమని ఆయన చెప్పారు. నాగ్‌పూర్‌లో 4,354 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్ (మిహాన్) ఎస్‌ఈజెడ్‌లో క్యాంపస్‌లో బాగుంటుందని కంపెనీ భావిస్తోంది.

తెలుగు వన్ఇండియా

English summary

నాగ్‌పూర్‌లో 1,000 సీట్ల సామర్థ్యంతో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌: మహీంద్రా సత్యం | Mahindra Satyam Commences Construction of IT Development Centre in MIHAN SEZ, Nagpur | 1,000 సీట్ల సామర్థ్యంతో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌

Mahindra Satyam has announced the commencement of construction of its IT Development Center during the Ground Breaking Ceremony in MIHAN SEZ, Nagpur. As part of Expansion Program, the company will setup up 1000 seat capacity IT Development Centre with an initial investment of around Rs.80cr. The Phase-I of the Campus would be operational within 15-18 months period and as per the Master Plan for expanding operations in Nagpur in a phased manner. Mahindra Satyam also announced its expansion at Bhuvaneswar (Odisha) to expand the existing Campus.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X