For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా, బ్యాంకులకు ఆర్దిక శాఖ ఆదేశం

By Nageswara Rao
|

Savings Account
ముంబై, జూన్ 18: ఒక ప్రతిష్టాత్మక తరలింపు. రాబోయే ఆరు నెలల్లో ఒక కుటుంబంలో కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్దిక మంత్రిత్వ శాఖ సూచించింది. వివరాల్లోకి వెళితే 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఐదు కుటుంబాలలో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే బ్యాంకు ఎకౌంట్‌ను కలిగి ఉన్నారు. దీనిని బట్టి చూస్తే దేశంలో 40 శాతం కుటుంబాలు బ్యాంకింగ్ సిస్టమ్‌లో లేరని ఆర్దిక మంత్రిత్వ శాఖలో ఉన్న సీనియర్ అధికారి తెలిపారు.

ఈ నెల 12వ తారీఖున ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రతినిధుల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని, రాబోయే ఆరు నెలల్లో దేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక సేవల శాఖ లో ఉన్న అదనపు కార్యదర్శి, సునీల్ సోనీ తెలిపారు.

ఒక కుటుంబం బ్యాంకు ఎకౌంట్‌ను కలిగి ఉండడం వల్ల వేతనాలు, పేమెంట్స్ వంటి అంశాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలక్ట్రానికి ఫండ్ ట్రాన్సర్ చేయవచ్చు. దీని వల్ల వినియోగదారుడు ప్రయోజనం పొందుతాడు. అంతేకాకుండా ఎకౌంట్‌ను కలిగి ఉన్న అకౌంట్ హోల్డర్ కు తప్పని సరిగా ఎటిఎమ్ కార్డుని జారీ చేయాలన్నది తాజా ప్రతిపాదన.

ఇది మాత్రమే కాకుండా దేశంలో రెండు వేల పైబడి జనాభా కలిగిన మారుమూల గ్రామాలన్నింటికీ దాదాపు 73 వేల గ్రామాలు 2012 మార్చిలోగా బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే ‘ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరగా లైఫ్ ఇన్యూరెన్స్ ఛైర్మన్ డికె మల్హోత్రా మాట్లాడుతూ బ్యాంకుల సహాకారంలో 2020 కల్లా దేశంలో ఇన్యూరెన్స్‌కు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో 350 మిలియన్ పాలసీ హోల్డర్స్‌ని కలిగి ఉందన్నారు.

తెలుగు వన్ఇండియా

English summary

ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా, బ్యాంకులకు ఆర్దిక శాఖ ఆదేశం | Ensure one account per family, Finance Ministry to banks | ప్రతి కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు

In an ambitious move, the Finance Ministry has asked banks to ensure that at least one person per family across the country has a bank account in the next six months.
Story first published: Monday, June 18, 2012, 16:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X