For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులకు రూ.1.47 కోట్లు ఎగ్గొట్టారు, టాప్ 10 వీరే..: బాకీపడిన తెలుగు రాష్ట్రాల కంపెనీలు...

|

భారత్‌లోని 2,426 మంది/కంపెనీలు ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు 17 ప్రభుత్వరంగ బ్యాంకులకు మొత్తం రూ.1.47 లక్షల కోట్లు ఎగవేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (AIBEA) వెల్లడించింది. ఇందులోని టాప్ 33 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు ఒక్కొక్కరు రూ.500 కోట్లు అంతకుమించి ఎగవేసినట్లు తెలిపింది. వీరి నుండి బ్యాంకులకు రావాల్సింది రూ.32,737 కోట్లు అని తెలిపింది. రూ.200 కోట్లకు పైగా ఎగవేసిన కంపెనీలు 147 ఉన్నాయి. వీరు బాకీ పడిన మొత్తం రూ.67,609 కోట్లకు పైగా ఉంది. బ్యాంకులను జాతీయం చేసి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా AIBEA ఈ జాబితాను విడుదల చేసింది.

10 ఏళ్ల కనిష్టానికి రియల్ ఎస్టేట్: హైదరాబాద్‌లో పరిస్థితి ఏమిటి?10 ఏళ్ల కనిష్టానికి రియల్ ఎస్టేట్: హైదరాబాద్‌లో పరిస్థితి ఏమిటి?

టాప్ ఎగవేతదారులు..

టాప్ ఎగవేతదారులు..

టాప్ ఎగవేతదారుల్లో మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలీ జెమ్స్, జతిన్ మెహతా విన్‌సమ్ డైమెండ్స్ ఉన్నాయి. ఏబీజీ షిప్ యార్డ్స్, రీ ఆగ్రో, రుచి సోయా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.4,644 కోట్ల మొత్తంతో గీతాంజలీ జెమ్స్ ఓనర్ మెహుల్ చోక్సీ బిగ్గెస్ట్ సింగిల్ లోన్ డిఫాల్టర్‌గా నిలిచాడు. ఈ మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి తీసుకున్నాడు. జతిన్ మెహతా విన్‌సమ్ డైమెంట్స్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.1,390 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రూ.984 కోట్లు, కెనరా బ్యాంకు నుండి రూ.636 కోట్లు తీసుకుంది. ఏబీజీ షిప్ యార్డ్.. ఎస్బీఐ నుండి రూ.1,875 కోట్లు, రుచి సోయా ఇండస్ట్రీస్ ఎస్బీఐ నుండి రూ.1,618 కోట్లు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఎస్బీఐ నుండి రూ.586 కోట్లు తీసుకుంది.

టాప్ 33 మంది డిఫాల్టర్లు..

టాప్ 33 మంది డిఫాల్టర్లు..

టాప్ 10 డిఫాల్టర్స్ ఎగవేసిన మొత్తం రూ.17,005 కోట్ల వరకు ఉంది. తర్వాత 10 డిఫాల్టర్స్ ఎగవేసిన మొత్తం రూ.7,768 కోట్లు, ఆ తర్వాత 13 మంది ఎకవేసిన మొత్తం రూ.7,964 కోట్లుగా ఉంది. మొత్తం ఈ 33 మంది ఎగవేసిన మొత్తం రూ.32వేల కోట్లకు పైగా ఉంది. ఈ మేరకు AIBEA జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం శనివారం ప్రకటన విడుదల చేశారు. బ్యాంకులు బ్యాడ్ లోన్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, బ్యాంకులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏ బ్యాంకు ఎంత..

ఏ బ్యాంకు ఎంత..

ఉద్దేశ్యపూర్వక ఎగవేతల వల్ల నష్టపోయిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. ఎస్బీఐకి రూ.685 కంపెనీలు రూ.43,887 కోట్లు ఎగ్గొట్టాయి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయి.

ఏ బ్యాంకులో ఎంతమంది (కంపెనీలు) ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు.. ఎంత మొత్తం

- SBIకి 685 మంది రూ.43,887 కోట్లు

- పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌కు 325 మంది రూ.22,370 కోట్లు

- బ్యాంక్ ఆఫ్ బరోడాకు 355 మంది రూ.14,661 కోట్లు

- బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 184 మంది 11,250 కోట్లు

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 69, మంది రూ.9,663 కోట్లు

- యునైట్‌డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 128 మంది రూ.7,028 కోట్లు

- యుకో బ్యాంక్‌కు 87 మంది రూ.6,813 కోట్లు

- ఓబీసీ బ్యాంకుకు 138 మంది రూ.6,549 కోట్లు

- కెనరా బ్యాంకుకు 96 మంది రూ.5,276 కోట్లు

- ఆంధ్రా బ్యాంకుకు 84 మంది రూ.5,165 కోట్లు

- అలహాబాద్ బ్యాంకుకు 57 మంది 4,339 కోట్లు

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 49 మంది రూ.3,188 కోట్లు

- కార్పొరేషన్ బ్యాంకుకు 58 మంది రూ.2,450 కోట్లు

- ఇండియన్ బ్యాంకుకు 27 మంది రూ.1,613 కోట్లు

- సిండికేట్ బ్యాంకుకు 36 మంది రూ.1,438 కోట్లు

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు 42 మంది రూ.1,405 కోట్లు

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుకు 6గురు రూ.255 కోట్లు

టాప్ టెన్ కంపెనీలు..

టాప్ టెన్ కంపెనీలు..

బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల్లోని టాప్ 10లో వరుసగా...

- గీతాంజలి జెమ్స్ రూ.4,644 కోట్లు.

- విన్సమ్ డైమెండ్స్ అండ్ జ్యువెల్లరీ రూ.2,918 కోట్లు

- ఆర్ఈఐ ఆగ్రో రూ.2,423 కోట్లు

- ఏబీజీ షిప్ యార్డ్ రూ.1,875 కోట్లు.

- కుదోస్ కెమి రూ.1,810 కోట్లు

- రుచి సోయా రూ.1,618 కోట్లు

- జిల్లి ఇండియా రూ.1,447 కోట్లు

- నక్షత్ర బ్రాండ్స్ రూ.1,109 కోట్లు

- కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.586 కోట్లు

తెలుగు రాష్ట్రాల కంపెనీలు..

తెలుగు రాష్ట్రాల కంపెనీలు..

బ్యాంకులకు బాకీపడిన మొత్తాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కోస్టల్ ప్రాజెక్ట్స్, బీఎస్ లిమిటెడ్, ట్రాన్స్‌ట్రాయ్, ఇందు, దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, లియో మెరిడియన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స, ఎక్సెల్ ఎనర్జీ లిమిటెడ్, ఐసీఎస్ఏ, టోటెమ్ ఇన్ఫ్రా ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.58 కోట్ల నుండి రూ.984 కోట్ల వరకు వివిధ బ్యాంకులకు బాకీ పడ్డాయి.

English summary

బ్యాంకులకు రూ.1.47 కోట్లు ఎగ్గొట్టారు, టాప్ 10 వీరే..: బాకీపడిన తెలుగు రాష్ట్రాల కంపెనీలు... | 2,426 wilful defaulters owe Rs 1.47 lakh crore to public sector banks

India's biggest 2,426 wilful defaulters owe the banks an astounding Rs 1.47 lakh crore. The top 33 of these, who owe Rs 500 crore or more, have defaults adding up to Rs 32,737 crore.
Story first published: Sunday, July 19, 2020, 11:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X