For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెల్, ఫాక్స్‌కాన్, లావా: PLI స్కీం కింద 19 ఐటీ కంపెనీలు దరఖాస్తు

|

ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ నిమిత్తం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(PLI స్కీం) 19 ఐటీ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో యాపిల్ ఫోన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో తయారు చేసే ఫాక్స్ కాన్, విస్ట్రోన్‌తో పాటు డెల్, లావా, ఫ్లెక్స్‌ట్రానిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పీఎల్ఐ పథకం ద్వారా మొత్తంగా జరిగే ఉత్పత్తి వ్యాల్యూ రూ.1.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిపింది.

ఇందులో ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాయి. 14 దేశీయ కంపెనీలు రూ.25,000 కోట్లకు పైగా ఉత్పత్తుల్ని తయారు చేయనున్నాయి. ఇందులో డిక్సన్, ఇన్ఫోపవర్, భగవతి (మైక్రోమాక్స్), సిర్మా, ఆర్బిక్ తదితర కంపెనీలున్నాయి.

19 companies file their applications under PLI scheme for IT Hardware

ఐటీ హార్డ్ వేర్ సంస్థలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీం(PLI స్కీం)ను ఈ ఏడాది మార్చి 3వ తేదీన నోటిఫై చేశారు. వచ్చే నాలుగేళ్లలో ఈ స్కీం ద్వారా 1.60 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేస్తారని అంచనా. ఇందులో 37 శాతం ఎగుమతులు ఉండనున్నాయి.

English summary

డెల్, ఫాక్స్‌కాన్, లావా: PLI స్కీం కింద 19 ఐటీ కంపెనీలు దరఖాస్తు | 19 companies file their applications under PLI scheme for IT Hardware

The government on Tuesday informed that a total of 19 companies have filed their application under the Production Linked Incentive Scheme (PLI) for IT Hardware which was notified on March 3, 2021. The scheme was open for filing applications till April 30, 2021. Incentives are applicable under the scheme from April 1, 2021.
Story first published: Wednesday, May 5, 2021, 7:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X