For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: కొద్ది రోజుల్లో PM Kisan నిధులు జమ, అందుకే ఆలస్యం

|

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) స్కీం నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో 145 లక్షల మందికి పైగా రైతులు వేచి చూస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ నెలాఖరు వరకు 36 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికి 22 లక్షలమంది రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ మొత్తం జమైంది. మరో 14 లక్షల మంది రైతుల్లో ఆరు లక్షలమంది పేర్లు, బ్యాంకుల అకౌంట్ వివరాల్లో తప్పులు ఉన్నందున సరి చేస్తున్నారు. కొద్ద్ి రోజుల్లో వీరి అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి.

ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తున్నారా..ఆలోచించండి, మీ డబ్బు దొంగిలించొచ్చు!: కస్టమర్లకు SBIఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తున్నారా..ఆలోచించండి, మీ డబ్బు దొంగిలించొచ్చు!: కస్టమర్లకు SBI

అందుకే అందరి అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు

అందుకే అందరి అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు

తప్పులు సవరించి కేంద్రానికి పంపించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇవి అందితే నెలాఖరులోగా మిగిలిన వారి ఖాతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు విడతలు పీఎం కిసాన్ నిధులు రైతులకు అందాయి. మొదటి విడతలో తెలంగాణలో 34 లక్షలమందికి పైగా ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన మూడు విడత్లలో అందరికీ జమ కాలేదు. పేర్లు, బ్యాంకు అకౌంట్లు తప్పుగా ఉండటం వంటి వివిధ కారణాలతో జమ కాలేదు.

36 లక్షల మందికి పైగా లబ్ధిదారులు

36 లక్షల మందికి పైగా లబ్ధిదారులు

ఈ ఏడాది జూలై నుంచి ఈ పథకం పరిధిలోకి భూయజమానులంతా రావడంతో మొత్తం అర్హుల సంఖ్య 36 లక్షలకు చేరుకుంది. ఈ పథకం కింద మోడీ ప్రభుత్వం మొత్తం రూ.6వేలు రైతులకు ఇస్తుంది. వీటిని రూ.2వేల చొప్పున మూడు విడతల్లో ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఎవరి పేరుతో ఎక్కువ భూమి ఉంటే వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.

ఏపీ, తెలంగాణల్లో లబ్ధిదారులు.. ఎంతమందికి నిధులు వచ్చాయంటే?

ఏపీ, తెలంగాణల్లో లబ్ధిదారులు.. ఎంతమందికి నిధులు వచ్చాయంటే?

పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం తెలంగాణలో లబ్ధిదారులు 34,80,677 కాగా, మొదటి విడతలో 34,61,375, రెండో విడతలో 33,50,634, మూడో విడతలో 30,83,407, నాలుగో విడతలో 22,01,068 మంది అకౌంట్లలో పెట్టుబడి సాయం క్రెడిట్ అయింది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 50,76,623 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో మొదటి విడతలో 43,61,220, రెండో విడతలో 41,30,410, మూడో విడతలో 33,60,204 అందాయి.

English summary

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: కొద్ది రోజుల్లో PM Kisan నిధులు జమ, అందుకే ఆలస్యం | 14 lakh farmers are waiting for PM Kisan funds in Telangana

Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) is a Central Sector scheme with 100% funding from Government of India. 22 lakh farmers get PM Kisan funds in fourth Installment.
Story first published: Sunday, December 15, 2019, 8:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X