For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IBM Layoffs: ఉద్యోగుల తొలగించనున్న 110 ఏళ్ల టెక్ కంపెనీ.. కానీ కొత్త జాబ్స్ ఉన్నాయ్..

|

IBM Layoffs: పురాతన యూఎస్ టెక్ దిగ్గజం ఐబీఎం. కంపెనీ వార్షిక నగదు లక్ష్యాలను చేరుకోవటంలో ఫెయిల్ అయ్యింది. తాజాగా నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఫలితాలు తారుమారు కావటంతో IBM కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల తొలగింపు..

ఉద్యోగుల తొలగింపు..

లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైన కంపెనీ జనవరి 25న కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్‌లలో భాగంగా 3,900 తొలగింపులను ప్రకటించింది. క్లయింట్-ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం నియామకానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ వెల్లడించారు. కంపెనీ ప్రకటన తర్వాత స్టాక్ కూడా దాదాపు 2 శాతం మేర నష్టపోయింది.

మిలియన్ డాలర్లు..

మిలియన్ డాలర్లు..

తొలగింపుల వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో సుమారు $300 మిలియన్ల అదనపు ఖర్చులు వస్తాయని కంపెనీ భావిస్తోంది. వాట్సన్ హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కిండ్రిల్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఇన్వెస్టర్లు సైతం కంపెనీ ఖర్చులను భారీగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారని మార్కెట్ నిపులు చెబుతున్నారు. బిగ్ టెక్ నుంచి వాల్ స్ట్రీట్ బ్యాంకింగ్ మేజర్ల వరకు అమెరికా కంపెనీల రథసారదులు మాంద్యంలో మెరుగ్గా ముందుకు సాగాలని చూస్తున్నారు.

డిజిటల్ సేవలు..

డిజిటల్ సేవలు..

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవలకు డిమాండ్ పెరిగినప్పటికీ, డిజిటల్ సేవలపై మరింత జాగ్రత్తగా ఖర్చు చేయడం కూడా పెరిగింది. ఇలాంటి కారణాలతో టెక్ దిగ్గజం ఐబీఎం సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ వ్యాపారంలో వృద్ధి నాలుగో త్రైమాసికంలో మందగించింది. అయితే క్లౌడ్ సర్వీసెస్ సెగ్మెంట్‌లో ఐబీఎం గతేడాది కంటే 2 రెట్లు ఎక్కువ బిజినెస్ చేస్తోంది. ముఖ్యంగా AWS, Microsoft, AZURE వంటి భాగస్వాములతో సేవలను సెటప్ చేయడం కోసం 2022లో ఒప్పందంపై సంతకాలు రెట్టింపు కావడంతో క్లౌడ్ వ్యయం ఒక ప్రకాశవంతమైన ప్రదేశం.

Read more about: ibm layoffs ibm job it news
English summary

IBM Layoffs: ఉద్యోగుల తొలగించనున్న 110 ఏళ్ల టెక్ కంపెనీ.. కానీ కొత్త జాబ్స్ ఉన్నాయ్.. | 110 years old tech jaint IBM Layoffs 3900 employees after cash target fails

110 years old tech jaint IBM Layoffs 3900 employees after cash target fails
Story first published: Thursday, January 26, 2023, 10:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X