For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చితికిపోయిన సంస్థలకు ఆర్బీఐ షాక్: ఆ నిర్ణయంపై ఎటూ తేల్చని బోర్డు!

|

కరోనా మహమ్మారి దెబ్బకు చితికిపోయిన చిన్న, మధ్య తరహా సంస్థలకు ఊరట కల్పిస్తామన్న ప్రభుత్వ మాటలు ఆచరణలోకి వచ్చేలా లేవు. కంపెనీలకు వన్ టైం రిస్ట్రుక్చరింగ్ (రుణాల పునర్వ్యవస్థీకరణ) చేసుకునే అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కానీ ఆర్బీఐ మాత్రం కేంద్ర మంత్రి ప్రకటనను ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. ఎందుకంటే... శుక్రవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో అసలు ఈ ప్రస్తావనే రాలేదని తెలుస్తోంది. అందులో చిన్న సంస్థలకు రుణాల పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసింది. దీంతో లక్షలాది సంస్థలకు ఆర్బీఐ అతిపెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. అసలే వ్యాపారం లేదు, ఆ పైన కట్టాల్సిన బకాయిలు.. వాటిపై వడ్డీ ల భారం తడిసి మోపెడు అవుతుంది.

ఉద్యోగలకు షాక్: తగ్గిన ఈపీఎఫ్ఓ ఆదాయం, పీఎఫ్ వడ్డీ తగ్గే అవకాశం

ఇప్పటికే బాగా చేశాం...

ఇప్పటికే బాగా చేశాం...

వీడియో కాన్ఫెరెన్స్ రూపంలో జరిగిన ఆర్బీఐ బోర్డు మీటింగ్ లో గవర్నర్ శక్తికాంత్ దాస్ తో పాటు డిప్యూటీ గవర్నర్లు కూడా పాల్గొన్నారు. అందులో కేవలం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు వంటి అంశాలు చర్చకు వచ్చాయని తెలిసింది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గాయని, చేయాల్సిందంతా చేశామని గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం. కాబట్టి, ఇకపై ఆర్బీఐ పై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని కుండా బద్దలు కొట్టినంత పనిచేశారు. దీంతో ఆర్బీఐ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న చితికి పోయిన సంస్థలు ఒక్క సారిగా ఉసూరు మంటున్నాయి. ఇకపై ఎలా ముందుకు వెళ్లాలా అన్న అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. దీని ప్రభావం చిన్న సంస్థలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. చాలా సంస్థలు పూర్తిగా కార్యకలాపాలు మూసివేసే పరిణామాలు కనిపిస్తున్నాయి.

ప్రయోజనమే లేదు...

ప్రయోజనమే లేదు...

ఒక్క రుణాల పునర్ వ్యవస్థీకరణ అనే కాదు... ఇప్పటి వరకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న ఏ నిర్ణయం కూడా నేరుగా కంపెనీలు, సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి మంచి ఉదాహరణే లోన్ మారటోరియం. తొలుత 3 నెలల మారటోరియం అమలు చేసి, ఆ తర్వాత 6 నెలలకు దానిని పొడిగించారు. దీంతో తాత్కాలిక వెసులుబాటు లభించింది. కానీ ఈ ఆరు నెలల కాలానికి మొత్తం రుణాలపై వడ్డీ పడుతుంది. దీంతో లాభం కన్నా నష్టమే అధికంగా కనిపిస్తోంది. ఆత్మ నిర్భర భారత పేరుతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అన్ని రకాల పథకాలు కూడా వీటికి విరుద్ధంగా ఏమీ లేవు. కాబట్టి, చిన్న సంస్థలు ఎటు పోవాలో, ఏం చేయాలో పాలుపోక, అసలు బిజినెస్ చేయకపోవటమే మేలు అనే అభిప్రాయానికి వస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నో అంటున్న బ్యాంకులు...

నో అంటున్న బ్యాంకులు...

ఒక వైపు ప్రభుత్వమేమో... బ్యాంకులకు రూ వేల కోట్ల నిధులిచాం. ఏ అవసరం ఉన్నా... బ్యాంకులను సంప్రదించి రుణాలు పొందవచ్చని, కొన్ని సార్లు బ్యాంకులే పిలిచి మరీ రుణాలు మంజూరు చేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. ఏ ఒక్క బ్యాంకు కూడా కొత్త రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు రావటం లేదని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజర్ వెల్లడించారు. కొత్తగా ఇచ్చే రుణాలకు ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వటం లేదు కాబట్టి తాము కూడా రుణాలు మంజూరు చేయటం లేదని చెప్పారు. ఒకవేళ రుణాలు మంజూరు చేస్తే అవి భవిష్యత్ లో నిరర్థక ఆస్తులుగా మారితే సిబ్బంది మెడకు చుట్టుకుంటాయని ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. కాబట్టి, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, ఆర్బీఐతో సంస్థలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకునేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిపోయి పరిస్థితులు చేయి దాటిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary

RBI board discusses economic situation but silent on loan restructuring

The central board of the Reserve Bank of (RBI) discussed the current economic situation and the evolving challenges posed by the Covid 19 pandemic in its 583rd meeting on Friday.
Story first published: Saturday, June 27, 2020, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more