For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేతనాలు చెల్లించలేక కంపెనీల ఇబ్బందులు, ఉద్యోగుల ఆందోళన!: EPFO విజ్ఞప్తి

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాజీవనం స్తంభించింది. ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. వృద్ధి రేటు భారీగా పడిపోనుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీల నుండి చిన్న వ్యాపారుల వరకు నష్టపోతున్నారు. వారు తమ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేవు. లక్షలాదిమంది చిన్న వ్యాపారులు, పరిశ్రమలు వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారట.

ఐటీ కంపెనీల గుడ్‌న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!ఐటీ కంపెనీల గుడ్‌న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!

వేతనాలు వాయిదా లేక తగ్గించి ఇవ్వడం

వేతనాలు వాయిదా లేక తగ్గించి ఇవ్వడం

హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా చిన్న చిన్న కంపెనీలు, వ్యాపారులు తమ వద్ద పని చేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. చాలా చిన్న కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేయడం లేక కోత పెట్టడమో చేశాయట. దేశం 21 రోజుల లాక్ డౌన్‍‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వ్యాపారాలు లేవు. అత్యవసర సర్వీసులు తప్ప మిగతా వ్యాపారాలు, ఉత్పత్తులు నిలిచిపోయాయి.

లాక్ డౌన్ పొడిగిస్తే మరింత ఆందోళనకరమే

లాక్ డౌన్ పొడిగిస్తే మరింత ఆందోళనకరమే

చాలా కంపెనీలు మొదటి వారం రోజుల్లోనే ఎక్కువగా వేతనాలు ఇస్తుంటాయి. కానీ ఈసారి వాయిదా వేయడమో లేదా వేతనం కట్ చేసి ఇవ్వడమో జరిగిందని తెలుస్తోంది. చాలా వ్యాపారాలు, కంపెనీలు మార్చి 1 నుండి మార్చి 20 లేదా 24 వరకు నడిచాయి. అయినప్పటికీ వేతనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో వచ్చే నెల మరింత క్లిష్ట పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. లాక్ డౌన్ పొడిగిస్తే కనుక అది మరింత ఆందోళనకరమే అంటున్నారు.

వేతనాలు ఇబ్బందికరమే

వేతనాలు ఇబ్బందికరమే

కొన్ని కంపెనీలు కొంతమందికి వేతనాలు ఇచ్చి, మరికొంతమందికి చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. తమ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది నెలవారీ వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత ఉత్పాదకుల సంఘం చెబుతోందట. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా అనే ఆందోళనలు కూడా ఉన్నాయి. వలస కార్మికులు, రోజువారీ కూలీలకు ఆదాయవనరులు లేకుండా పోయింది.

 కరోనా వైరస్ నేపథ్యంలో

కరోనా వైరస్ నేపథ్యంలో

కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలు మానవతా దృక్పథంతో తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అలాగే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా సూచించింది. ఉద్యోగుల జీతాలు కట్ చేయవద్దని లేదా ఉద్యోగులను తొలగించవద్దని EPFO కూడా కంపెనీలను, సంస్థలను కోరింది.

English summary

వేతనాలు చెల్లించలేక కంపెనీల ఇబ్బందులు, ఉద్యోగుల ఆందోళన!: EPFO విజ్ఞప్తి | No salaries in small companies amid coronavirus lockdown

There is no salaries in small companies amid coronavirus lockdown. It is said that Government may extend lockdown beyond april 14.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X