For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Honey Business: తేనె వ్యాపారంలో కోట్లు ఆర్జన.. భార్యాభర్తల తీపి విజయం.. ఉద్యోగాలు మానేసి..

|

Success Story: మనసులో వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే.. ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సంతృప్తి ఉండదు. సొంతంగా వ్యాపారం చేయాలనుకోవటంలో ఉండే మజా అలాంటిది. అలా ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి రాజీనామా చేసి భార్యతో కలిసి తేనె వ్యాపారం మెుదలు పెట్టాడు. ప్రస్తుతం వారు కోటీశ్వరులుగా మారారు. వారి విజయగాథ స్పూర్తి దాయకం.. వారు తేనె పరిశ్రమలో ఎలా సక్సెస్ అయ్యారో చూద్దాం.

హిమాన్షు - తన్వి జంట..

హిమాన్షు - తన్వి జంట..

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన హిమాన్షు ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య తన్వి టీచర్‌గా పనిచేసేవారు. కొంత కాలం ఉద్యోగం చేసిన తర్వాత విసిగిపోయిన ఈ జంట సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు.

ఎరువులకు ప్రత్యామ్నాయంగా..

ఎరువులకు ప్రత్యామ్నాయంగా..

పురుగుమందుల స్థానంలో సురక్షిత ప్రత్యామ్నాయ ఎరువుల కోసం వెతుకున్న వారికి తేనెటీగల పెంపకం గురించి తెలిసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వారు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించారు. పెంపకం లాభదాయకమని తెలుసుకున్న తర్వాత వారి సలహాల మేరకు నమ్మకంతో వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

సొంత పొలంలో ప్రారంభం..

సొంత పొలంలో ప్రారంభం..

హిమాన్షు-తన్వి దంపతులు తమ సొంత భూమిలో హనీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో కొద్ది మొత్తంలో తేనెను తయారు చేసేవారు. అలా అంచెలంచెలుగా వ్యాపారారన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. అలా లాభాలు కొనసాగుతున్నప్పటికీ.. సమీపంలోని పొలాల రైతులు రసాయనిక ఎరువులు వాడడం వల్ల తేనెటీగలు చనిపోవటం ఈ జంటను చలింపచేసింది.

హానిరహిత ఎరువులు..

హానిరహిత ఎరువులు..

తేనెటీగలు మరణించటంతో ఆ దంపతులు హనీ ఫామ్ సమీపంలోని రైతులకు రసాయన ఎరువులు వాడవద్దని కోరారు. వాటికి బదులుగా సహజసిద్ధమైన ఎరువులు ఎలా వినియోగించాలో అవగాహన కల్పించారు. ఈ క్రమంలో తేనెటీగల మృతి వల్ల వారికి సుమారు రూ.3 లక్షలు నష్టం వాటిల్లింది. అయినా పట్టువదలక తమ వ్యాపార ఆలోచనను ఆ దంపతులు ముందుకు తీసుకెళ్లారు.

కోట్లలో లాభాలు..

కోట్లలో లాభాలు..

ఫామ్ సమీపంలోని రైతులు దంపతుల సూచన మేరకు రసాయన ఎరువుల వాడకాన్ని మానేయటంతో వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. అలా ప్రస్తుతం వీరు నెలకు దాదాపు 300 కిలోల వరకు తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. నెలకు రూ.9 నుంచి రూ.12 లక్షల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. అలా ఏడాదికి రూ.1.40 కోట్లు లాభం వచ్చినట్లు వారు వెల్లడించారు.

English summary

Honey Business: తేనె వ్యాపారంలో కోట్లు ఆర్జన.. భార్యాభర్తల తీపి విజయం.. ఉద్యోగాలు మానేసి.. | couple left high paid jobs and earning crores with bee farming and honey business

couple left high paid jobs and earning crores with bee farming and honey business
Story first published: Monday, October 3, 2022, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X