దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (గురువారం, నవంబర్ 27, 2025) అసాధారణమైన లాభాలతో దూసుకుపోతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా పాజిటివ్ సంకేతాలు, US వడ్డీ రేట్ల కోతపై అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను అమాంతం పెంచాయి. ఈ భారీ కొనుగోళ్ల జోరులో సెన్సెక్స్ తొలిసారిగా 86,000 మార్క్‌ను దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. నిఫ్టీ కూడా తన 14 నెలల పాత రికార్డును బద్దలు కొట్టి, 26,306.95 పాయింట్లతో ఆల్ టైం గరిష్ఠాన్ని తాకింది.

ఉదయం 10:50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 410 పాయింట్లు(0.48 % లాభం), నిఫ్టీ 83.6 పాయింట్లు (0.32%లాభం)లో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతానికి సెన్సెక్స్ సూచీ 86,021, నిఫ్టీ సూచీ 26,288 గా ఉంది. సుమారు 1903 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా 1377 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ-50 లో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్ & టీ వంటి షేర్లు 2% వరకు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఈ మార్కెట్ ర్యాలీకి కారణాలివే..
మార్కెట్లు ఆల్ టైం హయ్యెస్ట్(sensex all time high)కు చేరుకోవడానికి కేవలం ఒక్క అంశమే కాదు, దేశీయంగా, అంతర్జాతీయంగా పలు సానుకూల పరిణామాలు దోహదపడ్డాయి. అవేంటంటే..
- అమెరికాలో రేట్ల కోతపై పెరిగిన అంచనాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed Reserve) డిసెంబర్‌లో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు పెరిగాయి. దీనివల్ల గిరాకీ నెమ్మదించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. CME ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం.. డిసెంబర్ రేటు కోతకు అవకాశం ఒక వారం క్రితం 30% ఉండగా, ప్రస్తుతం ఏకంగా 85%కి పెరిగింది. ఈ పాజిటివ్ సిగ్నల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు ముఖ్యంగా ఆసియా మార్కెట్లు ఊపు అందుకున్నాయి.
- విదేశీ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు (FII Buying): విదేశీ పెట్టుబడి దారులు వరుసగా రెండో సెషన్‌లో కూడా నికర కొనుగోలుదారులుగా మారారు. బుధవారం ఒక్కరోజే వీరు రూ.4,778.03 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ స్థిరమైన పెట్టుబడి ప్రవాహం దేశీయ ఈక్విటీలకు బలమైన మద్దతుగా నిలిచింది.
- ముడి చమురు ధరల తగ్గడం: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గి 62.83 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చమురు ధరలు తగ్గడం భారత్‌కు చాలా సానుకూల అంశం. ఇది దిగుమతి వ్యయాన్ని తగ్గిస్తుంది, ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
- లాభాలపై అంచనాలు : జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన డా. వి.కె. విజయకుమార్ ప్రకారం, FY26 మూడవ మరియు నాల్గవ త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయాలు మెరుగ్గా ఉంటాయనే అంచనాలు ర్యాలీకి మద్దతు ఇస్తున్నాయి.
- ఐఎంఎఫ్ అంచనాలు (IMF Outlook): నవంబర్ 26న విడుదల చేసిన నివేదికలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత ఆర్థిక వ్యవస్థ FY29 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది గత అంచనా కంటే ఒక సంవత్సరం ఆలస్యమైనప్పటికీ, దీర్ఘకాలిక వృద్ధిపై మార్కెట్‌లో సానుకూలతను పెంచింది.
- నెక్స్ట్ టార్గెట్: నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిఫ్టీ 26,470-26,550 స్థాయిల లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, మార్కెట్ ర్యాలీ కొనసాగాలంటే 26,165 స్థాయికి పైన స్థిరంగా ట్రేడ్ కావడం అవసరం.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
మార్కెట్ రికార్డు స్థాయిలకు చేరినప్పుడు.. ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. సెన్సెక్స్ 86,000 మార్కును అధిగమించినప్పటికీ.. ప్రస్తుత విలువలు కొంత వరకు అధికంగా (Expensive Valuations) ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా, దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిది. ఇప్పటికే లాభాల్లో ఉన్నవాళ్లు కొద్ది మొత్తంలో లాభాలను స్వీకరించి మిగిలిన పెట్టుబడులను కొనసాగించవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలున్న ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా తమ పెట్టుబడులను కొనసాగించడం ఉత్తమం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications