For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెప్పకుండా ఉద్యోగం మారుతున్నారా.. పీఎఫ్ రావాలంటే మీరే నెల జీతం రివర్స్ ఇవ్వాలి!

|

ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ లేకుండానే కొంతమంది హఠాత్తుగా మానివేస్తుంటారు. మరో కంపెనీలో ఎక్కువ వేతనం ఇస్తామని చెబితే ఆలోచించకుంటే నాలుగైదు రోజుల్లోనే మారేందుకు సిద్ధమవుతారు. అయితే ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు ఈపీఎఫ్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పాత కంపెనీలో రిలీవింగ్ లెటర్ కూడా లేకుండా, నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా కొత్త కంపెనీలోకి రోజుల సమయంలోనే చేరితే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

అమెరికా-ఇరాన్ టెన్షన్: బంగారం, ఆయిల్ సహా వీటిపై భారీ ప్రభావంఅమెరికా-ఇరాన్ టెన్షన్: బంగారం, ఆయిల్ సహా వీటిపై భారీ ప్రభావం

ఉద్యోగం మారే సమయంలో ఇలా చేయాలి..

ఉద్యోగం మారే సమయంలో ఇలా చేయాలి..

ఉద్యోగం మారే సమయంలో మీరు ఈ కింది విధంగా చేయకుంటే ఈపీఎఫ్ మనీని ట్రాన్సుఫర్ చేసుకోవడం లేదా విత్ డ్రా చేసుకోవడం కష్టతరంగా మారే అవకాశముంది. ఉద్యోగం మారే సమయంలో ప్రాపర్ ప్రొసీజర్స్ అనుసరించాలి. చెప్పకుండా పాత కంపెనీ వదిలి వెళ్లినప్పుడు ఉద్యోగం మానివేసిన వివరాలను ఈపీఎఫ్‌ఓకు అందించదు. దీని వల్ల కూడా సమస్యలు ఉంటాయి.

పీఎఫ్ డబ్బు తీసుకోలేడు.. ట్రాన్సుఫర్ చేసుకోలేడు

పీఎఫ్ డబ్బు తీసుకోలేడు.. ట్రాన్సుఫర్ చేసుకోలేడు

ఉద్యోగం మారే సమయంలో సమాచారం ఇవ్వనందున పాత కంపెనీ ఈపీఎఫ్ఓ రికార్డుల్లో నమోదు చేయలేదు. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం ఉద్యోగి కంపెనీలో జాబ్ మానివేయకపోతే అతను పీఎఫ్ డబ్బును తీసుకోలేడు. అలాగం పీఎఫ్ అకౌంట్ ట్రాన్సుఫర్ చేసుకోలేడు.

పాక్షికంగా కూడా తీసుకోలేరు

పాక్షికంగా కూడా తీసుకోలేరు

అంతేకాదు, పీఎఫ్ సబ్‌స్క్రైబర్ తమ పీఎఫ్ అకౌంట్ నుంచి పీఎప్ అమౌంట్‌ను కూడా పాక్షికంగా కూడా ఉపసంహరించుకోలేరు. ఈపీఎప్ అకౌంట్‌కు మంత్లీ కంట్రిబ్యూషన్ నిలిచిపోవడం వల్ల అకౌంట్ నుంచి పాక్షికంగా డబ్బు తీసుకోవడం వీలుకాదు.

OTP లేకుండా...

OTP లేకుండా...

ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ పాస్ బుక్ చూసుకోవడం కూడా కుదరదు. ఎందుకంటే ఈపీఎఫ్ అకౌంటుకు పాత కంపెనీలో ఉన్నప్పుడు మీ అధికారిక ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. లాగిన్ అయే సమయంలో OTP అడుగుతుంది. ఈ నెంబర్‌ను మీరు కంపెనీకి సబ్‌మిట్ చేసి ఉండవచ్చు. అప్పుడు లాగిన్ అవడం కుదరదు. OTP లేకుండా పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవాలనుకుంటే డేటా మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. అలా కూడా లాగిన్ అవలేరు.

సబ్‌స్క్రైబర్ ఏం చేయాలి?

సబ్‌స్క్రైబర్ ఏం చేయాలి?

ఇలాంటి సమయంలో సబ్‌స్క్రైబర్ ఈపీఎఫ్ఓను ఆశ్రయిస్తే.. పాత కంపెనీని సంప్రదించమని చెబుతుంది. ఎగ్జిట్ డేట్ రికార్డ్ చేయించాలి. పర్సనల్ మొబైల్ నెంబర్‌ను అప్ డేట్ చేసుకోవాలి. పాత కంపెనీని కలవడం తప్పనిసరి.

పాత కంపెనీలో ఇలా చిక్కులు.

పాత కంపెనీలో ఇలా చిక్కులు.

ఇక, మీరు పాత కంపెనీకి వెళ్లినప్పుడు ఒక నెల నోటీసు పీరియడ్‌కు బదులు ఒక నెల వేతనం చెల్లించమని అడుగుతారు. నియామకం సమయంలోనే ఈ షరతు ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో నెల వేతనం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. అంటే మీ ఈపీఎఫ్ డబ్బులు పొందాలంటే పాత కంపెనీకి నెల వేతనం చెల్లించాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓలో పర్సనల్ డిటైల్స్ అప్ డేట్ అవుతాయి. అలాగే ఈపీఎఫ్ ట్రాన్సుఫర్‌కు అవకాశముంటుంది.

English summary

చెప్పకుండా ఉద్యోగం మారుతున్నారా.. పీఎఫ్ రావాలంటే మీరే నెల జీతం రివర్స్ ఇవ్వాలి! | You may not be able to transfer or withdraw your EPF money unless you do this

Not following these rules while changing a job may make withdrawal or transfer of EPF money difficult for you.
Story first published: Monday, January 6, 2020, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X