For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే: 'డబుల్' ప్రయోజనాలు

|

ప్రయివేటురంగంలో ఉద్యోగాలు మారడం సాధారణమే! అధిక వేతనం కోసమో లేక మంచి జాబ్ ప్రొఫైల్ కోసమే లేక రెండింటి కోసమో.. ఇలా వివిధ కారణాలతో ఉద్యోగాలు మారుతుంటారు. మీరు ఉద్యోగం మారడానికి కారణం ఏదైనా కావొచ్చు. కానీ అలాంటి సమయంలో అనవసరంగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లోని డబ్బులు తీసుకోవడానికి మాత్రం దూరంగా ఉండాలి. సాధారణంగా చాలామంది ఉద్యోగం మారిన ప్రతి సందర్భంలోను పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు తీసుకునే వారు ఉంటారు. అయితే ఇటీవల కొన్ని మార్పులు వచ్చాయి. ఉద్యోగం మారినా ఒకే అకౌంట్ ఉండటం, నెల రోజుల వరకు మరో ఉద్యోగం లేకుంటే కొంత శాతం, మరుసటి నెల తర్వాత మరికొంత శాతం తీసుకోవచ్చు.

సాఫ్టువేర్ షాక్: ఐటీలో 40,000 ఉద్యోగాలు పోవచ్చుసాఫ్టువేర్ షాక్: ఐటీలో 40,000 ఉద్యోగాలు పోవచ్చు

ప్రయోజనాలు మిస్సవుతాం

ప్రయోజనాలు మిస్సవుతాం

అయితే ఉద్యోగం మారిన సమయంలో అవసరం లేకున్నా పీఎఫ్ విత్ డ్రా చేసుకోకపోవడమే మంచిది. డబ్బులు తీసుకుంటే పలు ప్రయోజనాలు మిస్సవుతాం. దానిని ట్రాన్సుఫర్ చేసుకోవడమే ఉత్తమం.

ట్రాన్సుఫర్ చేస్తే పన్ను ఆదా

ట్రాన్సుఫర్ చేస్తే పన్ను ఆదా

పీఎఫ్ డబ్బులను అయిదేళ్లలోపు తీసుకుంటే పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఉద్యోగంలో చేరి అయిదేళ్ల లోపు పీఎఫ్ విత్ డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పోయి ఉపసంహరణ పన్ను కిందకు వస్తుంది. అలా కాకుండా మీ ఈపీఎఫ్‌ను కొత్త కంపెనీకు బదలీ చేసుకుంటే పన్ను ఆదా అవుతుంది.

పెన్షన్ ప్రయోజనం

పెన్షన్ ప్రయోజనం

ఓ ఈపీఎఫ్ మెంబర్ పదేళ్ల పాటు కాంట్రిబ్యూట్ చేస్తే పెన్షన్ పథకానికి అర్హులు. అప్పుడు 58 ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రయోజనాలు పొందవచ్చు. 58 ఏళ్ల కంటే ముందే రిటైర్ అయినప్పటికీ పదేళ్ల కాంట్రిబ్యూషన్ ఉంటే.. అలాంటి వారికి కూడా పెన్షన్ వర్తిస్తుంది.

పెన్షన్ 'డబుల్'

పెన్షన్ 'డబుల్'

20 ఏళ్లకు మించి కాంట్రిబ్యూషన్ చేసి, 58 ఏళ్ల తర్వాత రిటైర్ అయితే అప్పుడు పెన్షనబుల్ సర్వీస్ కింద రెండు బోనస్ ఇయర్లు కలుస్తాయి. ఉదాహరణకు ఓ ఉద్యోగి 22 ఏళ్లపాటు ఈపీఎస్‌కు కాంట్రిబ్యూట్ చేసి, 58 ఏళ్లకు పదవీ విరమణ పొందితే అతని పెన్షనబుల్ సర్వీస్ ఏళ్లు 22 నుంచి 24 ఏళ్లకు పెరుగుతాయి. అంటే రెండేళ్లు యాడ్ అవుతాయి. అందుకే పీఎఫ్ డబ్బు తీసుకోకపోవడమే ఉత్తమం.

EPFO పెన్షన్ ఎలా లెక్కిస్తారు?

EPFO పెన్షన్ ఎలా లెక్కిస్తారు?

ఈపీఎఫ్ఓ పెన్షన్‌ను ఇలా లెక్కిస్తారు.... (పెన్షనబుల్ శాలరీ X పెన్షనలబుల్ సర్వీస్)/70. నవంబర్ 16, 1995 తర్వాత ఉద్యోగంలో చేరిన వారి పెన్షనబుల్ శాలరీని పై విధంగా లెక్కిస్తారు. గత అయిదేళ్ల సరాసరి శాలరీని పరిగణలోకి తీసుకుంటారు. గరిష్ట పెన్షన్ లిమిట్ రూ.15,000.

English summary

PF విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే: 'డబుల్' ప్రయోజనాలు | Why you should not withdraw your Provident Fund while changing jobs

Changing jobs is a common thing for private sector employees. Some change jobs for higher salary while others change jobs for better job profiles or both.
Story first published: Tuesday, November 19, 2019, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X