For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రోకర్లు దుకాణం సర్దేస్తే... పరిస్థితి ఏంటి? ఏం చేయాలి?

|

దేశంలోని స్టాక్ మార్కెట్లు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి.. తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల సొమ్ము ఒక రోజు పెరిగితే .. మరో రోజూ తగ్గుతోంది. లాభనష్టాలను ఇన్వెస్టర్లు భాద్యులుగా ఉంటారు. అయితే బ్రోకర్లు డిఫాల్ట్ అయితే పరిస్థితి ఏమిటి? ఈ మధ్యకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో డిఫాల్ట్ అవుతున్న బ్రోకర్ల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన ఎక్కువ అవుతోంది. తమకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంచేయాలన్న దాని గురించి ఆలోచిస్తున్నారు.

మండుతోన్న ఇం'ధనం'! ఏడాది గరిష్టానికి పెట్రోల్ ధరలు...మండుతోన్న ఇం'ధనం'! ఏడాది గరిష్టానికి పెట్రోల్ ధరలు...

భారీగా నష్టపోతున్న బ్రోకర్లు

భారీగా నష్టపోతున్న బ్రోకర్లు

అధిక రాబడుల కోసం బ్రోకర్లు కొన్నిసార్లు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారు. దేనివల్ల భారీ స్థాయిలో నష్టపోతున్నారు. డెరివేటివ్స్ వంటి సెగ్మెంట్లలో ఈ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో క్లయింట్ల హామీలను కూడా వాడేసుకొని తమ కోసం వినియోగించుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. క్లయింట్ షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును లబ్ది దారులకు ఇవ్వడం లేదు.

ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే..

ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే..

* బ్రోకర్ల మూలంగా నష్టపోయిన చిన్న, పెద్ద ఇన్వెస్టర్లు తమ సొమ్మును స్టాక్ ఎక్స్చేంజి ల ద్వారా రాబట్టు కోవచ్చు. ఈ ఎక్స్చేంజిలు నిర్వ హించే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి తమకు రావాల్సిన మొత్తాలను రికవరీ చేసుకోవచ్చు.

* అయితే ఇది జరగడానికి ముందు ఎక్చేంజీలు ఆ బ్రోకర్లను డిఫాల్టర్ గా ప్రకటించాల్సి ఉంటుంది. దీని వల్లనే ఆ బ్రోకర్ క్లయింట్లకు ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

* ఎక్స్చేంజ్ లు ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే ప్రక్రియలో వేగం పెంచే విధంగా ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

* నష్టపోయిన క్లయింట్లు ఒక బృందంగా ఏర్పడి సెక్యూరిటీస్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు.

ఇప్పటి వరకు ఎంత మంది అంటే?

ఇప్పటి వరకు ఎంత మంది అంటే?

డీఫాల్ట్ అవుతున్న బ్రోకర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 12 మంది బ్రోకర్లను డిఫాల్టర్లు గా ప్రకటించారు. వీరికి లక్షలాది మంది క్లయింట్లు ఉన్నట్టు తెలుస్తోంది.

క్లెయిమ్ చేసుకోవడం ఎలాగంటే?

క్లెయిమ్ చేసుకోవడం ఎలాగంటే?

* బ్రోకర్ డిఫాల్ట్ అయినా సందర్భంలో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి తమ సొమ్మును క్లెయిమ్ పొందాలంటే అందుకు తగిన పద్దతిని పాటించాల్సి ఉంటుంది.

* బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ల వద్ద ఫిర్యాదు చేయాలి.

* ఈ ఫిర్యాదులను ఎక్స్చేంజ్ పరిశీలిస్తుంది. వాటిని మెంబెర్ అండ్ కోరే సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ కమిటి ముందుంచుతారు. ఆ తర్వాత ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ కు సూచిస్తారు.

* అర్హత పొందిన క్లెయిమ్ లను పరిహారం కోసం ఫండ్ కు పంపుతారు. నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి.

English summary

బ్రోకర్లు దుకాణం సర్దేస్తే... పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? | What to do if broker defaults

Defaults by brokers in India's stock markets increasing. with this investors are losing their money. But investors can recover their dues from the investor protection fund.
Story first published: Tuesday, November 26, 2019, 9:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X