For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gratuity అంటే ఏంటి..? ఒక సంస్థ నుంచి ఉద్యోగి గ్రాట్యూటీ పొందాలంటే నిబంధనలేంటి..?

|

ఆయా సంస్థల్లో లేదా కంపెనీల్లో పనిచేసేవారికి పలు అనుమానాలు ఉంటాయి. అదేగ్రాట్యూటీ.గ్రాట్యూటీ అంటే ఏంటి..? కంపెనీల్లో పనిచేసే ఎలాంటి ఉద్యోగులుగ్రాట్యూటీ అందుకునేందుకు అర్హులు అనే విషయాలపై చాలామందిలో సందిగ్ధత నెలకొంది. అయితే దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి..? కంపెనీ యాజమాన్యాలు ఎలా వ్యవహరిస్తున్నాయి..?

గ్రాట్యూటీ అంటే ఏమిటి..?

గ్రాట్యూటీ అంటే ఏమిటి..?

గ్రాట్యూటీ... ఒక కంపెనీలో ఒక ఉద్యోగి ఫలానా సమయం వరకు పనిచేసి మరో కంపెనీకి మారే సమయంలోగ్రాట్యూటీ గురించి వాకబు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాటిట్యూటీ అంటే ఆ సంస్థకు చేసిన సేవలకుగాను సంస్థ ఉద్యోగికి కొంత మొత్తంలో చెల్లించే డబ్బులే గ్రాట్యూటీ అని పిలుస్తాం.అయితేగ్రాట్యూటీ అందుకోవాలంటే ఎవరు అర్హులు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలనే అంశం చాలామందికి తెలియదు. ఉదాహరణకు ఓ వ్యక్తి నాలుగేళ్లు 7 నెలల సమయం వరకు ఒక సంస్థలో పనిచేసి మరో సంస్థకు మారిపోతున్నాడనుకుందాం. అప్పుడు తను నాలుగేళ్లు పనిచేసిన సంస్థ నుంచిగ్రాట్యూటీ పొందే అవకాశం ఉందా... ఇప్పుడు అది చూద్దాం.

 గ్రాట్యూటీ ఏ పరిశ్రమలకు ఎవరికి వర్తిస్తుంది..?

గ్రాట్యూటీ ఏ పరిశ్రమలకు ఎవరికి వర్తిస్తుంది..?

మనదేశంలో పేమెంట్ మరియుగ్రాట్యూటీ చట్టం అన్ని పరిశ్రమలకు, గనులకు, ఆయిల్ ఫీల్డ్స్, ప్రాంటేషన్, పోర్టులు, రైల్వేలకు వర్తిస్తుంది. వీటికి తోడు ఒక సంస్థలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నట్లయితే అక్కడ కూడాగ్రాట్యూటీ వర్తిస్తుంది. పేమెంట్ మరియుగ్రాట్యూటీ చట్టం ప్రకారం ఒక ఉద్యోగిగ్రాట్యూటీ పొందాలంటే తాను పనిచేస్తున్న సంస్థలో వరుసగా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. అప్పుడైతేనే ఆ ఉద్యోగిగ్రాట్యూటీ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 2A "continuous service"అనే పదంను స్పష్టంగా తెలుపుతుంది. అంటే నిర్విరామంగా ఐదేళ్లు పాటు ఆ ఉద్యోగి ఆ సంస్థలో సేవలు అందించి లేదా పనిచేసి ఉంటేనేగ్రాట్యూటీ పొందేందుకు అర్హులు అవుతారు.

 ఒక ఉద్యోగి గ్రాట్యూటీ పొందాలంటే ఎన్ని రోజులు పనిచేయాలి..?

ఒక ఉద్యోగి గ్రాట్యూటీ పొందాలంటే ఎన్ని రోజులు పనిచేయాలి..?

భూగర్భ గనుల్లో పనిచేసేవారు, ఇక వారానికి ఆరు రోజుల కంటే తక్కువగా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలో ఒక ఉద్యోగి పనిచేసి అక్కడ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత మరో 190 రోజుల పాటు ఆ సంస్థలో పనిచేసినా కూడాగ్రాట్యూటీ పొందేందుకు అర్హులవుతారని చట్టం చెబుతోంది. మరోవైపు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులు మాత్రం 4 ఏళ్లు పూర్తయ్యాక మరో 240 రోజులు పనిచేస్తేనేగ్రాట్యూటీ పొందేందుకు అర్హులు అవుతారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మీరు భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగి కాకపోయి ఉంటే, లేదా వారానికి ఆరు రోజుల కంటే తక్కువ రోజులు పనిదినాలు మీ కంపెనీ షెడ్యూల్ చేయనట్లయితే అప్పుడు మీరు 4 ఏళ్లు 240 రోజులు పాటు ఉద్యోగంలో కొనసాగితే మీరుగ్రాట్యూటీ పొందేందుకు అర్హులుగా నిలుస్తారు.

అందుకేగ్రాట్యూటీ పొందాలంటే కచ్చితంగా నాలుగేళ్ల 240 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో మీరు కంపెనీ మారే ముందు ఇచ్చే నోటీస్ పీరియడ్ కూడా లెక్కగడతారు. అంటే ఈ 240 రోజుల్లో రెండు నెలల పాటు నోటీసు పీరియడ్ ఉంటే అది కూడా పరిగణలోకి తీసుకుంటారు.

English summary

Gratuity అంటే ఏంటి..? ఒక సంస్థ నుంచి ఉద్యోగి గ్రాట్యూటీ పొందాలంటే నిబంధనలేంటి..? | What is Gratuity, who are eligible to recieve Gratutity-Know the details here

The Payment and Gratuity Act applies to all factories, mines, oilfields, plantation, ports, and railways. In addition to this, it also applies to every shop and establishments employing 10 or more people.
Story first published: Saturday, March 6, 2021, 14:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X