తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి... ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన దేవుడు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. రోజు కూడా కోట్లాది మంది విరాళాలు సమర్పిస్తారు. తిరుమలలో మధ్యతరగతి భక్తులకు వసతి గదులు దొరుకతాయి. ఈ ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల పెంచింది. పెంచిన ధరలు గత గురువారం నుంచి అమలులోకి తెచ్చింది.

రెండింతలు పెరిగిన ధరలు
పెంచిన ధరలను ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లలో అమలులోకి తీసుకు వచ్చింది. కౌస్తుభం, పాంచజన్యం సముదాయాల్లో గది అద్దెను రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. నందకంలో గదులను రూ.600 నుంచి రూ.1000కు పెంచింది. ధరలు పెంచిన వెంటనే అమలులోకి వచ్చాయి. దీంతో ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.

యథావిధిగా రూ.50, రూ.100 ధరలు
ఈ నెల 5వ తేదీన గదుల బుకింగ్‌కు ఆన్ లైన్ కోటా విడుదల చేసింది. ఇందులో పెంచిన ధరలు ఉన్నాయి. తొలుత కరెంట్ కౌంటర్ల వద్ద భక్తులు గదులు బుక్ చేసుకున్నారు. రూ.1000గా చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. అదనపు సౌకర్యాలు కల్పించకుండా ధరలు పెంచడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. రూ.50, రూ.100 గదులు అధునికీకరించి వాటి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కానీ ఈ ధరలు ప్రస్తుతం పెంచలేదు.

ఆఫ్ లైన్.. ఆన్ లైన్
తిరుమలలో రూ.50 నుంచి రూ.3,000 వరకు ఉన్న గదులు వివిధ సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 అందుబాటులో ఉన్నాయి.

వారికి ఇక భారం..
తిరుమలకు వెళ్లే భక్తుల్లో ఎక్కువగా రూ.100 గదులను తీసుకుంటారు. రూ.100 గదులు పూర్తిగా నిండితే రూ.500, రూ.600 గదులను తీసుకుంటారు. ఇవి మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వీటి ధరలు పెరగడం భక్తులకు ఇబ్బందికరం.

తిరుపతిలో ధరలు యథాతథం
తిరుమలలో అకామిడేషన్ ధరలు పెరిగినప్పటికీ, తిరుపతిలోని శ్రీనివాసంలో మాత్రం ధరలు యథావిధిగా ఉన్నాయి. గది రూ.200, ఏసీ గది రూ.400, డీలక్స్ ఏసీ గది రూ.600, మాధవమ్ ఏసీ రూ.800, డీలక్స్ ఏసీ రూ.1000గా ఉంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications