For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలంటే టాక్స్ రిటర్న్ ఫైల్ తప్పనిసరా..? ITR ఎందుకు ఫైవ్ చేయాలంటే..

|

Income Tax: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడం తప్పనిసరి అయినప్పుడు షరతులను సవరించడం లేదా జోడిస్తుంది. ఇటీవల ఏప్రిల్ 21, 2022న, CBDT ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇది వ్యాపార టర్నోవర్, ప్రొఫెషనల్ రసీదులు, బ్యాంక్ డిపాజిట్లు, ఖర్చులకు సంబంధించి నాలుగు కొత్త షరతులను జోడించింది. ఇది ITR ఫైల్ చేయడం తప్పనిసరి చేసింది. 2022-23 అసెస్‌మెంట్ ఇయర్ కు ఇవి వర్తిస్తాయని వెల్లడించింది. ఈ కొన్ని కొత్త షరతులు కాకుండా, ITR ఫైల్ చేయడం తప్పనిసరి చేసే అనేక ఇతర షరతులు ఉన్నాయి.

TDS తిరిగి పొందటానికి..

TDS తిరిగి పొందటానికి..

కొన్ని సందర్భాల్లో ITR ఫైల్ చేయడం తప్పనిసరి. అయితే ఈ షరతులు మీకు వర్తించకపోయినా, మీరు మీ ప్రయోజనం కోసం ITRని ఫైల్ చేయవచ్చు. ఉదాహరణకు.. TDSగా చెల్లించిన అదనపు పన్నుల వాపసు తిరిగి పొందటానికి ఉన్న ఏకైక మార్గం సమయానికి ITRని ఫైల్ చేయడం మాత్రమేనని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడులపై టాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయటానికి టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం కూడా అవసరం అవుతుంది. సమయానికి దీనిని మీరు మీ సంస్థకు తెలియజేయలేక పోతే మీ జీతం నుంచి టీడీఎస్ రూపంలో చెల్లించాల్సిన టాక్స్ కట్ చేయటం జరుగుతుంది.

తగ్గింపులు పొందేందుకు..

తగ్గింపులు పొందేందుకు..

ఒకవేళ మీ వార్షిక ఆదాయం బేసిక్ ఎక్సెమ్షన్ లిమిట్ కంటే ఎక్కువ రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే.. సెక్షన్ 87A కింద రూ.12,500 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవటానికి మీరు అర్హులని గుర్తుంచుకోండి. ఎవరైనా నష్టాలను తరువాతి సంవత్సరాలకు క్యారీ ఫార్వాడ్ చేసుకోవాలంటే.. సమయానికి ఐటీఆర్ తప్పకుండా ఫైల్ చేయాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డ్‌లు, లోన్స్ కావాలంటే..

క్రెడిట్ కార్డ్‌లు, లోన్స్ కావాలంటే..

మరోవైపు, ITR అనేది.. లోన్స్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు అనేక ఇతర ప్రయోజనాల కోసం దరఖాస్తు చేయడానికి ఒక సాధారణ అవసరం. "వీసా దరఖాస్తు ఆమోదాలకు అసెస్సీ పన్ను-కంప్లైంట్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ పత్రాలు దరఖాస్తుదారు ఆదాయానికి రుజువుగా పనిచేస్తాయి." అది కాకుండా.. "అధికారిక ప్రయోజనాల కోసం మీరు చిరునామా రుజువును సమర్పించాల్సిన సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో ITR ఫైలింగ్ రసీదు చిరునామాకు రుజువుగా కూడా పనిచేస్తుంది" అని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.

చట్ట ప్రకారం ఎవరెవరు తప్పకుండా ITR ఫైల్ చేయాలి..

చట్ట ప్రకారం ఎవరెవరు తప్పకుండా ITR ఫైల్ చేయాలి..

1. 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఆదాయం రూ.2.50 లక్షలు దాటితే

2. వయస్సు 60 సంవత్సరాలు పైబడి ఆదాయం రూ.3 లక్షలకు మించితే

3. 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటినప్పుడు

4. విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసిన వారు

5. ఏడాదిలో రూ.1 లక్ష కంటే ఎక్కువ కరెంటు బిల్లు కడుతున్న వారు

6. విదేశీ ఆదాయం లేదా ఆస్తులు కలిగి ఉన్నవారు

7. బ్యాంక్ కరెంటు ఖాతాలో రూ. 1 కోటి బ్యాలెన్స్ కలిగి ఉన్నవారు

English summary

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలంటే టాక్స్ రిటర్న్ ఫైల్ తప్పనిసరా..? ITR ఎందుకు ఫైవ్ చేయాలంటే.. | to get a loan or credit card it is mandatory to file income tax return know who should file ITR

who should file income tax return compulsarily as per act know complete details
Story first published: Sunday, July 10, 2022, 14:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X