For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్‌కార్డ్‌లోని అంకెలు, అక్షరాలకు అర్థం ఏమిటి, ఎన్ని రకాలు?

|

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2019 నుండి పాన్ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డును తీసుకు వచ్చింది. మీకు పాన్ కార్డు లేకుంటే కనుక ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా వారికి పాన్ నెంబర్ లభిస్తుంది. పాన్ అవసరమైన చోట ఆధార్ కార్డు ఉపయోగించే వెసులుబాటును కల్పించింది ఆదాయపు పన్ను శాఖ. అయితే దీనికి పాన్-ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి. పన్ను చెల్లింపుదారులకు లేదా ఆదాయపు పన్ను మదింపుదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా ఈ పది అంకెల సంఖ్యను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దేశంలోని పన్ను చెల్లింపుదారులకు పాన్ తప్పనిసరి. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలి. మైనర్, విదేశీయులకు కూడా అవసరమే.

పాన్ కార్డుతో...

పాన్ కార్డుతో...

పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్, టీసీఎస్ క్రెడిట్స్, ఆదాయం, ట్రాన్సాక్షన్ వంటివి పాన్ కార్డు ద్వారా ఆదాయ పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందడానికి, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. పాన్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి పాన్ కార్డు గురించి తెలుసుకుందాం... పాన్ కార్డు అంటే ఏమిటి, ఎవరు తీసుకోవాలి, పాన్ కార్డు రకాలు... ఏమిటో చూద్దాం.

జీవితకాలం చెల్లుబాటు

జీవితకాలం చెల్లుబాటు

PAN లేదా పాన్ కార్డ్ పూర్తి పేరు పర్మినెంట్ అకౌంట్ నెంబర్. ఇందులో పది అంకెల నెంబర్ ఉంటుంది. దీనిని ఆదాయపు పన్ను శాఖ జారీ చేసింది. ప్రతి పాన్ నెంబర్ ప్రత్యేక నెంబర్‌ను కలిగి ఉంటుంది.

పాన్ నెంబర్ వ్యక్తి ఆర్థిక కార్యకలాపాల రికార్డ్‌ను కలిగి ఉంటుంది. అన్ని రకాల చెల్లింపుల్లో అంతర్భాగమై ఉంటుంది.

భౌతికంగా ఇది ప్లాస్టిక్ కార్డు. ఇందులో పాన్ కార్డు హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటివి ఉంటాయి. దాని పైన పాన్ నెంబర్ ఉంటుంది.

అడ్రస్ లేదా జాబ్ ప్రొఫైల్‌లో మార్పు వచ్చినప్పటికీ పాన్ నెంబర్ ప్రభావితం కాదు. కాబట్టి ఇది జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిని గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు.

పాన్ కార్డు అక్షరాలు, అంకెలకు అర్థం

పాన్ కార్డు అక్షరాలు, అంకెలకు అర్థం

పాన్ కార్డు వినియోగదారు ప్రాథమిక వివరాలతో కూడిన కార్డు. దీనిపై ప్రత్యేక అక్షరాలు, నెంబర్స్ రాయబడి ఉంటాయి.

పాన్ కార్డులో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ హోల్డర్ అనే దాని కింద ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, నాలుగు అంకెలు, ఆ తర్వాత మరో ఒక ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. మొత్తం పది అంకెలు/అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు ABCDE1234E అని ఉంటుంది.

ఇందులో మొదటి మూడు అక్షరాలు ఆల్బాబెటిక్ సీక్వెన్స్. నాలుగో అక్షరం కార్డు హోల్డర్ టైప్‌కు సంబంధించింది.

కార్డు హోల్డర్ టైప్ అంటే.. ఉదాహరణకు నాలుగో అక్షరం P అని ఉంటే ఇండివిడ్యువల్ అని అర్థం.

నాలుగో క్యారెక్టర్ అర్థాలు ఇలా...

A- Association of persons (AOP)

B- Body of Individuals (BOI)

C- Company

F- Firm

G- Government

H- HUF (Hindu Undivided Family)

L- Local Authority

J- Artificial Juridical Person

P- Individual or Person

T- Trust (AOP)

ఇక ఐదో క్యారెక్టర్ సర్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ అయి ఉంటుంది. పర్సన్ లేదా ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ఎంటిటీ లేదా ఆర్గనైజేషన్ పేర్లను సూచిస్తాయి.

ఆ తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి.

చివరి అక్షరం లేదా 10వ అక్షరం ప్రస్తుత కోడ్ చెల్లుబాటును ధృవీకరించడానికి ఉద్దేశించినది.

పాన్ కార్డు రకాలు

పాన్ కార్డు రకాలు

పాన్ కార్డులో వివిధ రకాలు ఉన్నాయి.

ఆర్గనైజేషన్, కంపెనీలకు పాన్ కార్డు

కో-ఆపరేటివ్ సొసైటీలు, ట్రస్టులకు పాన్ కార్డు

ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్‌కు పాన్ కార్డు

బిజినెస్ యూనిట్లు, భాగస్వామ్య సంస్థలకు పాన్ కార్డు

పాన్ కార్డుకు అర్హత

పాన్ కార్డుకు అర్హత

రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగిన సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ లేదా బిజినెస్‌మెన్.

దిగుమతులు, ఎగుమతులు చేసుకునే ఇండివిడ్యువల్స్.

రిజిస్టర్డ్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, ట్రస్ట్‌లు.

పన్ను చెల్లింపుదారులు.

వీరే కాకుండా ఎన్నారైలు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా పొందవచ్చు. అలాగే ఆదాయపు పన్ను చట్టం 1961 కిందకు వచ్చే ఫారనర్స్ కూడా పాన్ కార్డుకు అర్హులు. అలాగే పిల్లల తరఫున పేరెంట్స్ దరఖాస్తు చేయవచ్చు.

పాన్ ఎప్పుడు అవసరం

పాన్ ఎప్పుడు అవసరం

ఆదాయపు పన్ను చెల్లింపు, ఐటీ రిటర్న్స్ క్లెయిమ్స్, బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్, ఐడెంటిటీ ప్రూఫ్, ప్రాపర్టీ అవసరాలు, రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్, టెలిఫోన్ కనెక్షన్, జ్యువెల్లరీ కొనుగోలు, ఫారెన్ ఎక్స్చేంజ్, పెట్టుబడుల కోసం.. ఇలా వివిధ సందర్భాల్లో పాన్ కార్డు అవసరం.

పాన్ కార్డు దరఖాస్తుకు డాక్యుమెంట్స్

పాన్ కార్డు దరఖాస్తుకు డాక్యుమెంట్స్

పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైనవి కింద చూద్దాం...

ఇండివిడ్యువల్స్ అయితే పాస్ పోర్ట్, వోటర్ ఐడీ, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పీవోఐ, పీవోఏ.

ట్రస్ట్ అయితే ట్రస్ట్ డీడ్ కాపీ లేదా సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్.

కంపెనీలు అయితే సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కాపీ. (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చినది)

HUF అయితే హెడ్ ఆఫ్ HUF ఇష్యూ చేసిన HUF అఫిడవిడ్.

భాగస్వామ్య/సంస్థలు అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ.

సొసైటీ అయితే సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం. చారిటీ కమిషనర్ లేదా కో-ఆపరేటివ్ సొసైటీ ఆఫ్ రిజిస్ట్రార్ సర్టిఫికెట్.

ఫారెనర్స్ అయితే పాస్‌పోర్ట్ పీఐవో/ఓసీఐ కార్డు. దీనిని ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసి ఉండాలి. రెసిడెన్షియల్ కంట్రీ బ్యాంకు స్టేట్‌మెంట్. ఎన్ఆర్ఈ బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీ.

ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తు...

ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తు...

NSDL లేదా UTIITSL అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

అవసరమైన ఫీజును చెల్లించాలి.

మీ రిజిస్టర్డ్ చిరునామాకు మీ పాన్ కార్డు వస్తుంది. పదిహేను రోజుల్లో ఇది వస్తుంది.

ఆఫ్ లైన్‌లో అయితే పాన్ కేంద్రానికి వెళ్లాలి.

పాన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి.

సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరం. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

మీ పాన్ కార్డు పదిహేను రోజుల్లో మీ ఇంటికి వస్తుంది.

English summary

పాన్‌కార్డ్‌లోని అంకెలు, అక్షరాలకు అర్థం ఏమిటి, ఎన్ని రకాలు? | Things to Know About PAN Card, What are benefits?

Just like an Aadhar card or a Voter IT Card, a PAN card is one of the most important documents required to perform any major task.
Story first published: Sunday, January 16, 2022, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X