For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరికొద్ది రోజుల్లో ఇంట్లోనే కరోనా టెస్ట్, ఇలా చేసుకోవచ్చు

|

పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తాజాగా కరోనా టెస్ట్ కిట్ ఇండియా ఫస్ట్ సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్(RAT) కిట్‌ను రూ.250కే అందిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఈ కిట్‌కు ఆమోదముద్ర వేసింది. దీనికి కోవిసెల్ఫ్ అని నామకరణం చేశారు. ఇది మరో వారంలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశమంతా వణికిపోతోన్న సమయంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఇది మరో ముందడుగు.

ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ, ప్రయివేటు కేంద్రాల్లోనే కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంటి వద్దే స్వయంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.

త్వరలో అందుబాటులోకి..

త్వరలో అందుబాటులోకి..

మైల్యాబ్ రూపొందించిన యాంటీజెన్ టెస్ట్ కిట్‌కు ICMR ఆమోదం తెలిపింది. దీంతో మరికొన్ని రోజుల్లో ఈ కిట్ విస్తృతంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. పుణెకు చెందిన మైల్యాబ్ రూపొందించిన ఈ కిట్‌లో కొవిడ్ నిర్ధారణ పరీక్షకు కావాల్సిన ఓ ద్రవపదార్థంతో కూడిన ట్యూబ్, శాంపిల్ సేకరణకు స్వాబ్, టెస్ట్ కార్డుతో పాటు పరీక్ష పూర్తయిన తర్వాత వీటిని సురక్షిత విధానంలో పడేసేందుకు ప్రత్యేక కవర్ ఉంటాయి.

ట్యూబ్‌లో కోవిడ్ నిర్ధారణ ద్రవం

ట్యూబ్‌లో కోవిడ్ నిర్ధారణ ద్రవం

పరీక్ష ప్రారంభించే ముందు మైల్యాబ్ రూపొందించిన CoviSelf యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో పూర్తి వివరాలను పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రీఫిల్డ్ ఎక్స్‌ట్రాక్షన్ ట్యూబ్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే ద్రవం ఉంటుంది. దీనిని మూడు నాలుగు సార్లు కదిలించి ద్రవాన్ని ట్యూబ్ కింద భాగంలోకి వచ్చేలా చూసుకోవాలి.

ఇలా శాంపిల్ తీసుకోవాలి

ఇలా శాంపిల్ తీసుకోవాలి

స్టెరిల్ నాసల్ స్వాబ్ నాసికా రంద్రాల్లో ఉంచి ఐదుసార్లు తిప్పాలి. ఇలా రెండు నాసికా రంధ్రాల్లో చేయాలి. అప్పుడే కచ్చితమైన శాంపిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ద్రవపదార్థం ఉన్న ట్యూబ్‌లో స్వాబ్‌ను ముంచి, స్వాబ్ పైన భాగాన్ని తుంచివేయాలి. ఆ తర్వాత ట్యూబ్ మూతను కప్పివేయాలి. ఇలా తీసిన శాంపిల్‌ను ముంచిన ద్రవాన్ని టెస్ట్ కార్డుపై రెండు చుక్కలు వేయాలి. ఫలితం కోసం పదిహేను నిమిషాలు వేచి చూడాలి.

మైల్యాబ్ కోవిసెల్ఫ్ యాప్

మైల్యాబ్ కోవిసెల్ఫ్ యాప్

ఇప్పటికే వివరాలు మోదు చేసుకున్న ఈ యాప్ నుండి 15 నిమిషాల్లో ఓ శబ్దం వస్తుంది. టెస్ట్ కార్డు పైన కేవలం సీ-క్వాలిటీ కంట్రోల్ లైన్ వద్ద మాత్రమే చార కనిపిస్తే కోవిడ్ నెగిటివ్. క్వాలిటీ కంట్రోల్ లైన్ సీ-తో పాటు టెస్ట్ లైన్ టీ వద్ద రెండు చారలు కనిపిస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత వచ్చే ఫలితాన్ని పరిగణలోకి తీసుకోవద్దు.

English summary

మరికొద్ది రోజుల్లో ఇంట్లోనే కరోనా టెస్ట్, ఇలా చేసుకోవచ్చు | Test for Covid 19 at home: ICMR approves Mylab's self use kit CoviSelf

Pune-based Mylab Discovery Solutions will launch India's first self-use rapid antigen test (RAT) kit for Covid-19 for Rs 250 per pack. The product has been cleared by Indian Council of Medical Research (ICMR).
Story first published: Thursday, May 20, 2021, 18:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X