For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైలింగ్ చాలా సులభం: కొత్త ఐటీ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి

|

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. కరోనా నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ గడువును పలుమార్లు పొడిగించింది. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈ ఏడాది చివరి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు CBDT ప్రకటించింది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో డిసెంబర్ 31వ తేదీ వరకు గడువును ఇచ్చింది. కరోనాకు తోడు ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త ఐటీ వెబ్ పోర్టల్‌లో సాంకేతికత సమస్యలు వచ్చాయి. దీంతో అంతకుముందు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచారు. ఈ గడువు కూడా సమీపించింది.

కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చినందున గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా ఉంటుంది. అంతేకాదు, ఈసారి మీరు పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. వేతన జీవులు పాత, కొత్త పన్ను విధానాలలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మీరు మీ యజమానికి పాత పన్ను విధానంలో పెట్టుబడి రుజువులు చూపిస్తే, ఇప్పుడు దీనిని మార్చుకోవచ్చు. ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ద్వారా ఆర్జించిన డివిడెండ్ ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఇలా...

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఇలా...

- అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా వేతనాలు పొందే పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇది సులభమైన మార్గం.

- మీరు మీ ప్రక్రియను ప్రారంభించే ముందు మీ కీలక డాక్యుమెంట్స్, గత సంవత్సరం రిటర్న్స్, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్లు, ఫామ్ 16, ఫామ్ 26AS మీ వద్ద అట్టిపెట్టుకోవాలి.

- కొత్త పోర్టల్‌లోకి వెళ్లాలి. www.incometax.gov.in. పోర్టల్‌లోకి రిజిస్టర్ కావాలి. ఇక్కడ మీ పాన్ కార్డు నెంబర్ యూజర్ ఐడీలా ఉపయోగపడుతుంది.

- మెయిన్ డ్రాప్ డౌన్ మెను నుండి e-file ట్యాబ్ పైకి వెళ్ళాలి. ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ప్రొసీడ్ కావాలి.

- e-file లోకి వెళ్లాక ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ పైన కర్సర్ ఉంచాలి. మీరు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మోడ్‌ను ఎంచుకోవాలి.

- మీరు ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవాలి. ఐటీఆర్-2 శాలరైడ్ ట్యాక్స్ పేయర్స్ కోసం. చాలామంది వేతనజీవులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, నికర మూలధన లాభాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నందున ఇక్కడ ఐటీఆర్2ను తీసుకున్నాం.

- ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రొసీడ్ కావాలి. మీరు రిటర్న్స్ దాఖలు చేసే విండోకు వెళ్తారు.

- సంబంధిత షెడ్యూల్‌ను పూరించాలి. ముందుగా నింపిన సమాచారాన్ని అవసరమైన విధంగా సవరించాలి లేదా నిర్ధారించాలి. వేతన షెడ్యూల్ మొత్తం సమాచారం, తగ్గింపును మరోసారి తనిఖీ చేసి నమోదు చేయాలి.

- సమాచారాన్ని ధృవీకరించేదుకు ప్రొసీడ్ కావాలి. ముఖ్యంగా శాలరీ, డిడక్షన్స్, క్యాపిటల్ గెయిన్స్‌ను నిర్ధారించాలి. మీ రిటర్న్స్ సమర్పించాలి. రిటర్న్స్ సమర్పించే ముందు ధృవీకరణ పద్ధతిని ఎంచుకోవాలి.

- మీ రిటర్న్స్ వెరిఫై చేసుకోవడం మరిచిపోవద్దు. నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీ, డీమ్యాట్ ఖాతా లేదా ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ (EVC) ద్వారా ధృవీకరించుకోవాలి. (main menu > e-file > Income tax returns > e-verify returns). ప్రక్రియ పూర్తయినట్లుగా పరిగణించడం కోసం మీరు రిటర్న్స్‌ను దాఖలు చేసిన 120 రోజులలోపు దీనిని పూర్తి చేయాలి.

ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఒకేచోట

ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఒకేచోట

ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం, మూలం వ‌ద్ద ప‌న్ను(TDS) సంబంధిత స‌మాచారాన్ని అందించడానికి ఐటీ శాఖ ఇప్ప‌టి వ‌ర‌కు ఫామ్ 26ASను జారీ చేస్తోంది. అయితే దీని స్థానంలో వార్షిక స‌మాచార నివేదిక‌(యాన్యువ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ స్టేట్‌మెంట్-AIS)ను తీసుకు వచ్చింది. ఫామ్ 26ASతో పోలిస్తే AISలో మ‌రింత స‌మాచారం అందుబాటులో ఉంటుంది.

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో సేవింగ్స్ ఖాతాకు జమ అయిన వ‌డ్డీ, అమ్మిన, కొనుగోలు చేసిన షేర్ల విలువ‌తో స‌హా, మ్యూచువ‌ల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి స‌మాచారాన్ని అందిస్తుంది. అందుకే ఒకేచోట పూర్తి స‌మాచారాన్ని అందించ‌డం వ‌ల్ల ఫామ్ 26ASతో పోలిస్తే AISతో ప‌న్ను రిటర్న్స్ దాఖలు మరింత సులభం.

స్టాక్స్, బీమా, క్రెడిట్ కార్డ్స్, ఆస్తుల కొనుగోలు, మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్, వేతనం, ద్వారా వ‌చ్చే ఆదాయం లేదా వ్యాపారం నుండి వ‌చ్చే ఆదాయం, డివిడెండ్, బ్యాంకు సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల‌పై వ‌డ్డీ ఇలా ఈ కొత్త వార్షిక స‌మాచార‌ స్టేట్‌మెంట్‌లో ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌బంధించి పూర్తి స‌మాచారం అందుబాటులో ఉంటుంది.

పన్నుచెల్లింపుదారు ప్రాథమిక సమాచారం మాత్రమే కాకుండా స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం, విదేశీ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ వంటివి ఉంటాయి. దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అందుబాటులో ఈ సమాచారం

అందుబాటులో ఈ సమాచారం

యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) ట్యాక్స్ పాస్‌బుక్. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇందులో టీడీఎస్, టీసీఎస్, నిర్దిష్ట ఆర్థిక ట్రాన్సాక్షన్స్, పన్ను చెల్లింపులు, డిమాండ్, రీఫండ్స్, పెండింగ్‌లోని ప్రొసీడింగ్స్, పూర్తయిన ప్రొసీడింగ్స్, సూచించిన ఆదాయపు పన్ను అధికారి అప్ లోడ్ చేయదగిన ఇతర సమాచారం ఉంటుంది.

- ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావడం ద్వారా AISకు యాక్సెస్ కావొచ్చు. కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి.

- లాగ్-ఇన్ అయ్యాక సర్వీసెస్ ట్యాబ్‌లో AIS లింక్ పైన క్లిక్ చేసి, యాక్సెస్ చేయవచ్చు.

- స్క్రీన్ పైన సందేశం వస్తుంది. ప్రొసీడ్ పైన క్లిక్ చేసి, AIS హోమ్ స్క్రీన్‌కు రీ-డైరెక్ట్ అవుతుంది.

- AIS స్టేట్‌మెంట్, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీలకు సంబంధించిన కీలక సూచనలు అందిస్తుంది. AISలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కేటగిరీ వారీగా ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ చూపిస్తుంది. ఇది అసలు, సవరించిన వ్యాల్యూను సూచిస్తుంది. ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీలో సవరించిన వ్యాల్యూను రిటర్న్స్ ప్రీ-ఫైలింగ్‌లో ఉపయోగిస్తారు.

AIS పైన క్లిక్ చేస్తే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ రెండు కనిపిస్తాయి. డ్రాప్ డౌన్ మెనూలో కావాల్సిన ఆర్థిక సంవత్సరాన్ని సెలక్ట్ చేసుకొని సమాచారం కోసం AIS పైన క్లిక్ చేయాలి.

- తర్వాత స్క్రీన్‌లో AISలో ఉన్న సమాచారం పార్ట్ ఏ, పార్టి బీగా డిస్‌ప్లే అవుతుంది. పార్ట్ ఏలో పన్ను చెల్లింపుదారుని సాధారణ సమాచారం, పాన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. పార్ట్ బీలో పన్ను చెల్లింపుదారుడు ఎంపిక చేసుకున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమగ్ర సమాచారం ఉంటుంది. పార్ట్ బీలో టీడీఎస్, టీసీఎస్, ఎస్‌ఎఫ్‌టీ, పన్ను చెల్లింపులు, డిమాండ్ అండ్ రీఫండ్ తదితర సమాచారం ఉంటుంది.

English summary

ఫైలింగ్ చాలా సులభం: కొత్త ఐటీ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి | Simple step by step guide to file income tax new portal

This is the first assessment year when you will have to indicate the tax regime you have chosen. Salaried tax-payers can switch between the two tax regimes even at the time of filing returns.
Story first published: Thursday, November 11, 2021, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X