ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లను హెచ్చరించింది. ఫ్రాడ్ చేసే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. తాజాగా, ఎస్బీఐ మరోసారి కస్టమర్లను ప్రాడ్‌స్టర్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. వివిధ పబ్లిక్ ప్రాంతాల్లోని ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద తమ ఫోన్స్‌ను పెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి
ఛార్జింగ్ స్టేషన్లలో మీ ఫోన్‌ను ప్లగ్ చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండని, మాల్వేర్ మీ ఫోన్లో ఓ మార్గాన్ని గుర్తించి వచ్చే ప్రమాదముందని, మీ పాస్ వర్డ్‌ను దొంగిలించేందుకు ఆస్కారం ఉందని, అలాగే ఇతర డేటాను కూడా చోరీ చేసే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ తన ట్వీట్‌లో పేర్కొంది.

డేటాను ఇలా దొంగిలిస్తున్నారు
మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లలో జరుగుతున్న ఆన్ లైన్ మోసం గురించి ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరించింది. మీ స్మార్ట్ ఫోన్ ఓనర్స్ పాస్ వర్డ్స్, ఇతర ముఖ్యమైన డేటాను చోరీ చేసే ఆస్కారం ఉంటుందని సూచించింది. ఆన్ లైన్ మోసగాళ్లు ఇటీవలి కాలంలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వెనుక భాగంలో ఆటో డేటా ట్రాన్సుఫర్ డివైజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ ప్లగిన్ చేసినప్పుడు ఆ డేటాను ఆ డేటా ట్రాన్సుఫర్ డివైజ్ ద్వారా దొంగిలిస్తున్నారు.

పాపప్ చూడకుండానే..
స్కిమ్మింగ్ కార్డు ఉంటే మీ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు పాపప్ వస్తుంది. కానీ చాలామంది దానిని చదవకుండానే యస్ అనే బటన్ పైన క్లిక్ చేస్తారు. దానిని చూసుకోకుండే మీ ఫోన్ నుంచి పాస్ వర్డ్స్, ఇతర డేటా దొంగిలించడం సులభమవుతుంది.

పాపప్ చూసుకొని..
మీరు ఛార్జింగ్ కేబుల్‌తో ప్లగిన్ చేస్తే పాపప్ రాదు. పాపప్ లేదంటే కొంత సమస్య ఉందని అర్థం. అలాంటి సందర్భంలో మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ల నుంచి మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయకుండా ఉండటం మంచిది.

వీటిని అందుకే గుర్తించలేకపోతున్నారు
మీ డేటా దొంగిలించేందుకు ఆన్ లైన్ ఫ్రాడ్‌స్టర్స్ ఉపయోగించే డివైజ్‌ను ఆన్ లైన్ వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇవి చైనా నుంచి దిగుమతి అవుతాయి. ఇది అచ్చు పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. కాబట్టి కస్టమ్స్ స్టాఫ్‌కు ఈ మోసాలను గుర్తించడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు.

ఇవి అనుసరించండి
- ఛార్జింగ్ స్టేషన్ వెనుక ఉన్న ఎలక్ట్రికల్ సాకెట్‌ను పరీక్షించండి.
- మీ సొంత ఛార్జింగ్ కేబుల్స్ తీసుకెళ్లండి
- ఎలక్ట్రికల్ ఔట్ లెట్ నుంచి నేరుగా ఛార్జింగ్ చేసుకోండి.
- తెలిసిన వెండర్స్ నుంచి పోర్టబుల్ బ్యాటరీలు కొనుగోలు చేయండి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications