ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పీఎఫ్ ఖాతా నిబంధనలలో మార్పులు తీసుకు వచ్చింది. ఈ మార్పులు జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. అన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలకు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సంస్థలకు సందేశాలను పంపించింది. ఆధార్ కార్డుతో అనుసంధానించని ఖాతాలకు ఈసీఆర్ దాఖలు చేయలేరు కాబట్టి సంస్థ కాంట్రిబ్యూషన్ నిలిచిపోతుందని తెలిపింది.
కాబట్టి ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలని సూచించింది. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అన్ని ఈపీఎఫ్ ఖాతాలకు UANను పొందాలని ఈపీఎఫ్ కంపెనీ యజమానులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO మార్గదర్శకాల మేరకు ఆధార్ కార్డు అనుసంధానానికి కావాల్సిన పత్రాలను సంస్థలకు ఇవ్వాలి.

ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా...
ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా ఉద్యోగులు తమ ఆధార్ కార్డును యునివర్సల్ అకౌంట్ నెంబర్(UAN)కు లింక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో దీనిని లింక్ చేసుకునే ప్రాసెస్ తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ద్వారా ఇలా లింక్
- EPFO పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. మీ అకౌంట్‌లోకి సైన్-ఇన్ కావాలి. UAN, పాస్ వర్డ్ అవసరం. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను ఎంటర్ చేయాలి.
- మేనేజ్ సెక్షన్‌లోని KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో Aadhaar కనిపిస్తుంది. అక్కడ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి.
- మీరు ఓసారి ఫామ్ పూర్తి చేసి, సేవ్ చేయాలి. UIDAI మీ ఆధార్‌ను వ్యాలిడేట్ చేస్తుంది.
- ఓసారి కేవైసీ పూర్తయ్యాక మీ ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోవచ్చు.

ఓటీపీ ద్వారా
EPFO పోర్టల్‌ను ఓపెన్ చేసి, ఎడమవైపు ఉన్న ఈ-కేవైసి ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
ఇక్కడ యూఏఎన్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను ఎంటర్ చేయాలి.
జనరేట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. జండర్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ ఆధార్ నెంబరును ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ లేదా ఈ-మెయిల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
వెరిఫికేషన్ కోసం మరోసారి ఓటీపీ వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
దీంతో ఈపీఎఫ్, యూఏఎన్ ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications