For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: మీరు ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం! నవంబర్ 30కి లాస్ట్

|

న్యూఢిల్లీ: పెన్షన్ తీసుకునేవారికి ఓ అలర్ట్. పెన్షనర్లు తాము పెన్షన్ పొందేందుకు బ్యాంకులో లేదా ఆన్ లైన్ ద్వారా తాము జీవించి ఉన్నామనే జీవన ప్రమాణ పత్రం సమర్పించవలసి ఉంటుంది. బ్యాంకులు లేదా పోస్టాఫీస్ అకౌంట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్న వారు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుంది. ప్రస్తుతం మీరు మీకు పెన్షన్ వస్తున్న సిటీలో లేకుంటే కనుక మీ బ్యాంకు బ్రాంచీని సందర్శించవలసి ఉంటుంది. పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి ఇంకా బతికి ఉన్నారని సదరు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు రుజువు అవసరం. మీరు జీవించే ఉన్నారని అవి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చే నెలలోనే (నవంబర్) పూర్తి చేయాలి.

లాయర్లకు జగన్ గుడ్‌న్యూస్: లా నేస్తం స్కీం, అర్హత, దరఖాస్తు వివరాలులాయర్లకు జగన్ గుడ్‌న్యూస్: లా నేస్తం స్కీం, అర్హత, దరఖాస్తు వివరాలు

జీవన్ ప్రమాణ పత్రం

జీవన్ ప్రమాణ పత్రం

పెన్షన్ తీసుకునే వ్యక్తులు తాము పెన్షన్ పొందుతున్న బ్యాంకుకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. లేదా ఆన్ లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు. ఆన్ లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ పత్రం) సమర్పించేందుకు బ్యాంకుకు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లవలసిన పని లేదు. మీరు ఇంటి నుంచే ఈ పనిని పూర్తి చేయవచ్చు. జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పలు విధాలుగా పొందవచ్చు. జీవన్ ప్రమాణ పత్రాన్ని ఉపయోగించాలంటే పెన్షనర్లు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కు ఆధార్ నెంబర్‌ను పెన్షన్ అకౌంటుతో లింకప్ చేయాలి.

జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇలా తీసుకోవచ్చు

జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇలా తీసుకోవచ్చు

వాస్తవానికి జీవన్ ప్రమాణ పత్రం (DLC-డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్) ప్రాసెస్ పూర్తయిన తర్వాత వచ్చే ఐడీ జీవన్ ప్రమాణ్ పత్ర్. ఇలాంటి పత్రాలను పొందేందుకు మూడు మార్గాలు ఉన్నాయి.

- దేశంలోని ఏ సిటిజన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లి అయినా ఈ పత్రం తీసుకోవచ్చు.

- బ్యాంకులు, పోస్టాఫీస్‌లు జీవన్ ప్రమాణ్ పత్రాలు ఇస్తాయి.

- విండోస్ పీసీ/ల్యాప్‌టాప్ (Ver 7 ఆ పైన) లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు.

ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి

ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి

పెన్షనర్లు వారి బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ నెంబర్‌ను లింకప్ చేయవచ్చు. ఇందుకు కావాల్సిన పత్రాలు ఒరిజినల్ పీపీవో, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, , ఫోటోలు అవసరం. ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి జీవన్ ప్రమాణ్ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు (CSC)లు సహకరిస్తాయి.

మరింత సమయం..

మరింత సమయం..

DLC (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్) ప్రాసెస్ సమయంలో బయోమెట్రిక్ కారణంగా యాక్సెప్ట్ చేయకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఫిజికల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అంగీకరిస్తారు. కానీ వారికి నష్టం చేయకూడదని బ్యాంకులకు ఆదేశాలు వచ్చాయి. ఇంతకుముందు, 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు ఉపశమనం ఇచ్చేలా నవంబర్‌కు బదులు అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు సమర్పించవచ్చునని ప్రభుత్వం నిర్ణయించింది.

English summary

అలర్ట్: మీరు ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం! నవంబర్ 30కి లాస్ట్ | Pensioner should submit Jeevan Pramaan Patra

It is that time of the year again when pensioners need to inform their pension disbursing bank that they are alive All those pensioners who are receiving a pension in their bank account or post office account will now need to submit the Life Certificate in the month of November.
Story first published: Thursday, October 31, 2019, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X