For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పే టు కాంటాక్ట్‌‌తో నెక్స్ట్ లెవల్‌కు... పేమెంట్ మరింత ఈజీ

|

UPI ట్రాన్సాక్షన్స్‌ను సులభతరం చేసేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులు 'పే టు కాంటాక్ట్' లేదా 'పే యువర్ కాంటాక్ట్' ఫీచర్‌ను ప్రారంభించాయి. ఇది మొబైల్ చెల్లింపులను గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇందుకు తొలుత యాప్ ఓపెన్ చేసి పే టు కాంటాక్ట్ ఎంపిక పైన క్లిక్ చేయాలి. అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తాయి. ఎవరికి డబ్బు పంపించాలో వారి కాంటాక్ట్ నెంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే కాంటాక్టుకు సంబంధించిన యూపీఐ అడ్రస్‌ను ఆటోమేటిక్‌గా యాప్ గుర్తిస్తుంది. మీరు చేయవలసింది యూపీఐ అడ్రస్ చెక్ చేసుకొని నగదు, పాస్‌వర్డ్ టైప్ చేసి ట్రాన్సుఫర్ చేయడం.

రిసీవర్ యాప్‌ను కూడా చూడవచ్చు

రిసీవర్ యాప్‌ను కూడా చూడవచ్చు

కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లు ఐతే రిసీవర్ వినియోగిస్తున్న యాప్‌ను చూడవచ్చు కూడా. రిసీవర్... ఫోన్‌పే, గూగుల్‌పే లేదా పేటీఎం ఇలా ఏ యూపీఐ అడ్ర‌స్‌ను అయినా యాప్ గుర్తిస్తుంది. NPCI ఫండ్ బదలీ, చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని ప్రారంభించారు. బ్యాంకు అకౌంట్ నెంబర్, IFSC కోడ్స్ నమోదు చేసే ఇబ్బంది లేకుండా ఈ యూపీఐ విధానం చెల్లింపులను సులభతరం చేసింది. అంతకుముందు డబ్బు పంపించాల్సిన వ్యక్తి, రిసీవర్ వర్చువల్ అడ్రస్ వంటివి నమోదు చేయవలసి ఉండేది.

నేరుగా కాంటాక్టుకు బదలీ

నేరుగా కాంటాక్టుకు బదలీ

మొబైల్ చెల్లింపులపై దృష్టి సారిస్తున్న యాప్స్ డబ్బు బదిలీల్ని మరింత సులభతరం చేస్తున్నాయి. మనీ రిసీవర్ ఒకే యాప్ ఉప‌యోగిస్తే నేరుగా కాంటాక్టుకు బదిలీ చేయవచ్చు. మీరు యూపీఐ ఐడీని నమోదు చేయకుండా గూగుల్‌పే ఉపయోగించి మీరు మరో వ్యక్తికి డబ్బు పంపించవచ్చు. 'పే టు కాంటాక్ట్' ఫీచర్‌తో బ్యాంకులు ఇప్పుడు దానిని తదుపరి స్థాయి సులభతరానికి తీసుకు వెళ్లాయి.

పదిసార్లు ట్రాన్సాక్షన్స్

పదిసార్లు ట్రాన్సాక్షన్స్

కొటక్ మహీంద్రా బ్యాంకు ప్రకారం ఒక వ్యక్తి రోజుకు పదిసార్లు ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. రోజుకు మొత్తం రూ.50,000 వరకు పంపించుకోవచ్చు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ఒక కస్టమర్ రోజుకు రూ.1 లక్ష వరకు, గరిష్టంగా పది ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.

English summary

పే టు కాంటాక్ట్‌‌తో నెక్స్ట్ లెవల్‌కు... పేమెంట్ మరింత ఈజీ | Pay to Contact feature takes UPI to the next level of convenience

Banks are working towards making UPI transactions easy as a breeze. Three banks—ICICI Bank, Kotak Mahindra Bank and Airtel Payments Bank—have launched the 'Pay to Contact' or 'Pay your Contact' feature, which makes mobile payments more convenient than ever.
Story first published: Tuesday, July 13, 2021, 20:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X