జనవరి 1 నుండే మార్పు... ఫాస్టాగ్ లేకుంటే వాచిపోతుంది.. డబుల్ టోల్‌ట్యాక్స్
జనవరి 2021 నుండి జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను నగదురహితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుండి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్లను ఫాస్టాగ్ ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం టోల్ చెల్లింపుల్లో దాదాపు 75 శాతం ఫాస్టాగ్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒక లైన్‌లో నగదు రూపంలో చెల్లింపులకు అనుమతి ఉండగా, జనవరి నుండి 100శాతం ఫాస్టాగ్ ఉంటుంది. అంటే నగదు తీసుకునే అవకాశం లేదు. అంటే జనవరి 1వ తేదీ నుండి ఫోర్ వీలర్స్‌కు ఫాస్టాగ్ తప్పనిసరి.
టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!

ఫాస్టాగ్ లేకుంటే డబుల్ టోల్
టోల్ ప్లాజా వద్ద నగదు చెల్లింపుకు స్వస్తీ పలకాలని నిర్ణయించిన కేంద్రం, జనవరి 1 నుండి టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ కలిగిన ఫోర్ వీలర్ లేదా అంతకుమించిన వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ లేని వాహనం టోల్ ప్లాజాలోకి వస్తే రెండింతల మొత్తాన్ని టోల్ ట్యాక్స్‌గా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పర్యవేక్షణకు మార్షల్స్, నోడల్ అధికారులను నియమించింది.

టోల్ కలెక్షన్స్ రికార్డ్
టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ ద్వారా రికార్డ్ స్థాయిలో వసూళ్లు నమోదయినట్లు కేంద్రం తెలిపింది. గురువారం ఒక్కరోజే 50 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీంతో మొదటిసారి రూ.80 కోట్లు వసూలయినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండి(NHAI)ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 2.20 కోట్ల ఫాస్టాగ్స్ జారీ చేసినట్టు వెల్లడించింది. ఫాస్టాగ్ ద్వారా ఒక్కరోజే(గురువారం) తొలిసారి వసూళ్లు రూ.80 కోట్లు దాటడం, 50లక్షల లావాదేవీలు జరగడం ఓ మైలురాయి.

పాయింట్ ఆఫ్ సేల్స్
జనవరి 1 నుండి ఫోర్ వీలర్స్‌కు ఫాస్టాగ్ తప్పనిసరని కేంద్రం తెలిపింది. ఇందుకు టోల్‌ప్లాజాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం వాహనాలను ఆపకుండా ఈ ఫాస్టాగ్స్ నివారిస్తాయని, ఫలితంగా ఇంధనం, ప్రయాణ సమయం ఆదా అవుతాయన్నారు.
దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా పాయింట్స్ ఆఫ్ సేల్స్(POS)లో ఫాస్టాగ్ పాయింట్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ ప్రోగ్రాం కోసం 27 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్‌లో కూడా ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టం, యూపీఏ, పేటీఎం, మైఫాస్ట్ మొబైల్ యాప్స్‌తోను భాగస్వామ్యం ఉంది.