For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసీఐసీఐ బ్యాంకు iMobile Pay ద్వారా PPF ఖాతాను ఇలా తెరవండి

|

PPF లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది భారతదేశంలో పదిహేను సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ కలిగిన అత్యంత సురక్షిత ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకంగా చెప్పవచ్చు. ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఇవ్పుడు కేవలం పోస్టాఫీస్ మాత్రమే కాకుండా, భారత దేశంలోని బ్యాంకుల్లో కూడా PPF ఖాతాను తెరువవచ్చు కాబట్టి మీరు ప్రయివేటురేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయితే, ఈ బ్యాంకులో PPF ఖాతాను తెరవాలనుకుంటే, మీరు ఐ-మొబైల్ పేయాప్‌ను ఉపయోగించవచ్చు.

ఐసీఐసీఐ ట్వీట్

ఐసీఐసీఐ ట్వీట్

ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంకు ఓ ట్వీట్ చేసింది. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోండి, మీ సంపదను ప్రావిడెంట్ ఫండ్(PPF)తో పెంచుకోండి. iMobilePay app ద్వారా మీ పీపీఎఫ్ ఖాతాను డిజిటల్‌గా నిర్వహించుకోండి అని బ్యాంకు ఈ ట్వీట్‌లో పేర్కొంది.

mobile.icicibank.com/dl ద్వారా మొబైల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని, అకౌంట్ తెరువవచ్చు.

ఖాతాను ఇలా తెరవండి

ఖాతాను ఇలా తెరవండి

- iMobile Pay యాప్‌ను ఉపయోగించి ఐసీఐసీఐ బ్యాంకులో PPF ఖాతాను తెరవడానికి వివిధ దశలు...

- మీ మొబైల్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్‌ను లేదా నాలుగు అంకెల లాగ్-ఇన్ పిన్‌ను ఉపయోగించి iMobile Pay appలోకి లాగ్-ఇన్ కావాలి.

- ఆ తర్వాత Invest and insureను ఎంచుకోవాలి. ఈ కేటగిరీ కింద PPF/NPS/Gold Bondను ఎంచుకోవాలి.

- ఆ తర్వాత స్క్రీన్ పైన మూడు ఎంపికలు వస్తాయి. అది పీపీఎప్, ఇన్‌స్టాంట్ ఎన్పీఎస్, సావరీన్ గోల్డ్ బాండ్.

- మీరు బ్యాంకులో PPF ఖాతాను నిర్వహించకుంటే కనుక ఎలాంటి పీపీఎఫ్ ఖాతాలు లేవని వెల్లడించాలి. దాని కింద Apply Now అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేయాలి.

- మీ ఆధార్ కార్డును ధృవీకరణ కోసం సిద్ధంగా ఉంచాలని పేర్కొంటూ ఓ నోటిఫికేషన్ వస్తుంది. పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు వ్యాలీడ్ ఆధార్ తప్పనిసరి.

ఇలా పూర్తి చేయండి...

ఇలా పూర్తి చేయండి...

- ఆ తర్వాత స్క్రీన్ పైన ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనంతో పాటు పీపీఎఫ్ ప్రయోజనాలు ఉంటాయి. పన్ను ప్రయోజనం కింద గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనిష్టంగా రూ.500 ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి. నిబంధనల మేరకు ముందుకు సాగాలి. ప్రాథమికంగా ఇది ఆటో చెక్‌గా ఉంటుంది.

- ఆ తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి.

- ఇప్పుడు తక్షణ పీపీఎఫ్ ఖాతా విధానం మూడు దశలను కలిగి ఉంటుంది.

- మీ పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయడానికి మీరు ప్రారంభ డిపాజిట్ మొత్తాన్ని నమోదు చేయాలి. పెట్టుబడిగా రూ.500, రూ.5000, రూ.10000 ఇన్వెస్ట్ చేయాలి.

- ఆ తర్వాత డెబిట్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఐసీఐసీఐ బ్యాంకులో ఒకే పొదుపు ఖాతాను నిర్వహిస్తే అది మళ్లీ ప్రతిబింబిస్తుంది.

- నామినేషన్‌ను ధృవీకరిస్తారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాకు సంబంధించి అదే నామినీని కొనసాగించాలా అని అడుగుతుంది.

- తర్వాత పేజీలో మీ వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. పేరు, అడ్రస్, పాన్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ రిఫ్లెక్ట్ అవుతాయి.

- మీరు submit ఆప్షన్ పైన క్లిక్ చేసి, మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.

- మీరు మీ ఆధార్ నెంబర్‌ను మళ్లీ ఎంటర్ చేసి, ఓటీపీ కోసం విజ్ఞప్తి చేయాలి.

- ఓటీపీని నమోదు చేయాలి. ఆ తర్వాత Submit ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

- ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకులో మీ పీపీఎఫ్ ఖాతా ఓపెన్ అవుతుంది. మీరు మీ దరఖాస్తును చూడవచ్చు. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ - యూఏఎన్ లింకింగ్

ఆధార్ - యూఏఎన్ లింకింగ్

కాగా, ప్రావిడెంట్ ఫండ్(PF)సబ్‌స్క్రైబర్లు UAN నెంబర్‌తో తమ ఆధార్ నెంబర్‌ను జత చేయడాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ తప్పనిసరి చేసింది. ఆగస్ట్ 31వ తేదీని ఇందుకు గడువుగా విధించింది. ఈ లోగా ఆధార్ కార్డును జత చేయకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుండి పీఎఫ్‌కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందలేరు. కంపెనీలు పీఎఫ్ మొత్తాన్ని జమచేయలేకపోవడంతో పాటు పీఎఫ్‌కు సంబంధించి సబ్‌స్క్రైబర్లు కూడా నగదును ఉపసంహరించుకోలేరు.

ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మే 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయడానికి జూన్ 1వ తేదీని గడువుగా విధించింది. తాజాగా సెప్టెంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదివరకే ఆధార్-పీఎఫ్ ఖాతాను లింక్ చేస్తే ధృవీకరించుకోవాలి.

ఐసీఐసీఐ బ్యాంకు డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్స్ హోల్డర్లకు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్‌చేంజ్, చెక్ బుక్ ఛార్జీలను ఆగస్ట్ 1వ తేదీ నుండి మారిన విషయం తెలిసిందే. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ఐసీఐసీఐ ఖాతాదారులకు ఆరు మెట్రో నగరాల్లో మొదటి మూడు ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సేవలు ఉచితం.

English summary

ఐసీఐసీఐ బ్యాంకు iMobile Pay ద్వారా PPF ఖాతాను ఇలా తెరవండి | Open PPF account in ICICI bank via Imobile Pay App

Public Provident Fund is a 15-year lock-in highly safe government of India backed small savings scheme.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X