For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Electric Cars: ఎలక్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..

|

Electric Cars: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల వల్ల ఇంధన కార్లకు క్రమంగా కాలం చెల్లుతోంది. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహానాలే భవిషత్తు రవాణా సాధనాలని చెబుతున్నాయి. గత వారం కేంద్ర రవాణా మంత్రి 5 ఏళ్లలో పెట్రోల్ బ్యాన్ అవుతుంది అంటూ కామెంట్ కూడా చేశారు. ఈ ప్రకారం చూసినట్లయితే.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లదే హవా. కొనటానికి ఈ వాహనాలు కొంత ఎక్కువ ధర ఉన్నప్పటికీ.. తడిసి మోపెడవుతున్న ఇంధన ధరలతో పోల్చుకుంటే రవాణా ఖర్చు దీర్ఘకాలంలో చాలా తగ్గుతుంది. మరికొన్నిసంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయని ఆటో రంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలు సైతం ఇందుకు అనుగుణంగానే ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

ఒక్క సారి పెట్టుబడితో లాభం..

ఒక్క సారి పెట్టుబడితో లాభం..

మెుదట ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈవీల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కానీ జీవితకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు పాకెట్-ఫ్రెండ్లీ అని మనం గుర్తించాలి. చాలా బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆకర్షణీయమైన, తక్కువ వడ్డీ రేటుకు ఫైనాన్సింగ్‌ను అందిస్తాయి. వీటిని గ్రీన్ లేదా ఎలక్ట్రిక్ వాహన రుణాలు అని పిలుస్తారు. అసలు ఎలక్రిక్ వాహనాలు కొనేటప్పుడు తెలుసుకోవలసిన, గమనించవలసిన విషయాలను ఇప్పుడు చూద్దాం..

వడ్డీ రేట్లు కంపేర్ చేయటం..

వడ్డీ రేట్లు కంపేర్ చేయటం..

ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ వాహనాల మధ్య వడ్డీ రేటును ఎల్లప్పుడూ కంపేర్ చేయండి. దీనివల్ల మీకు ఆదా అయ్యే డబ్బును లెక్కించుకోండి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఈపీలపై అందిస్తున్న రుణాల రేట్లను గమనించండి. ఆ తరువాత మీ అవసరాలకు సరిపోయే ఉత్తమమైన డీల్‌ను అందించే సంస్థను ఎంచుకోండి.

 వాహనం ఖర్చు, నిర్వహణ..

వాహనం ఖర్చు, నిర్వహణ..

మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ముందుగా ఎక్కువ ఖర్చు అవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి.. మీ బడ్జెట్‌ను పరిశీలించి, మీరు భరించగలరో లేదో నిర్ణయించుకోండి. మీరు తప్పనిసరిగా EMI మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నిధుల కొరత కారణంగా మీరు చెల్లింపులను ఆలస్యం చేయడం లేదా మీ లోన్‌పై డిఫాల్ట్ అయ్యేంత ఎక్కువగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ ఉండకూడదు. కారును కొనుగోలు చేసిన తర్వాత మీకు అయ్యే నిర్వహణ ఖర్చుతో పాటు ఇతర ఛార్జీలను ముందుగానే తెలుసుకోండి.

సరైన వాహన ఎంపిక..

సరైన వాహన ఎంపిక..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కాబట్టి మీరు ఈ వాహనాలను కొనుగోలు చేసే ముందు సాంకేతికత, మైలేజ్, ఛార్జింగ్ సమయం గురించి తెలుసుకోవాలి. నగరాల్లో, ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా ఛార్జ్ చేయవచ్చు. కానీ.. బయట ఛార్జింగ్ పాయింట్లను కనుగొనడం అంత సులభం కాదు. మీరు మీ బడ్జెట్, డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా సరైన వాహనాన్ని ఎంచుకోవాలి. మీ రైడ్‌ను ఒత్తిడి లేకుండా ఆస్వాదించడానికి కొనుగోలు చేసే ముందు మీరు వేర్వేరు కంపెనీల వాహనాలను, మోడళ్లను కంపేర్ చేసి నిర్ణయం తీసుకోండి.

 ఆఫర్లు, డిస్కౌంట్లు

ఆఫర్లు, డిస్కౌంట్లు

ప్రభుత్వం, వాహన కంపెనీల ఆఫర్‌లతో పాటు ఇతర తగ్గింపులను తెలుసుకోండి. సాధారణంగా, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ తక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు ఈవీలపై బహుళ ప్రోత్సాహకాలను అందిస్తాయి. వాటి గురించి వాహన సంస్థను అడిగి తెలుసుకోండి. చివరిగా దేశంలో ప్రస్తుతం ఉన్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ రైడ్లకు సరిపోదు కాబట్టి ప్రస్తుత అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోండి.

English summary

Electric Cars: ఎలక్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలు గుర్తుంచుకోండి.. | know these key points about electric cars and bike before buying them and get a good deal

know these key points about electric cars and bike before buying
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X