For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI డెబిట్ కార్డు పోయిందా? ఇలా సులభంగా బ్లాక్ చేసి, కొత్త కార్డు కోసం అప్లై చేయండి

|

ఏటీఎంకు వెళ్లినప్పుడు లేదా ఇతర ప్రాంతాల్లో కొంతమంది డెబిట్ కార్డును మరిచిపోతుంటారు. ప్రయాణాల్లో లేదా ఇతరులకు ఇచ్చినప్పుడు లేదా ఇతర సమయాల్లో పోగొట్టుకునే వారు ఉంటారు. దేశీయ ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పోగొట్టుకున్న డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సరళతరం చేసింది. ఇటీవల ఎస్బీఐ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎస్బీఐ డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, తిరిగి పొందే విధానాన్ని పేర్కొంటూ ఓ పోస్ట్ చేసింది. కార్డును ఐవీఆర్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.

స్బీఐ డెబిట్ కార్డును ఫోన్ కాల్ ద్వారా బ్లాక్ చేయడం

స్బీఐ డెబిట్ కార్డును ఫోన్ కాల్ ద్వారా బ్లాక్ చేయడం

- ఎస్బీఐ బ్యాంకు కస్టమర్లు 1800 112 211 కు లేదా 1800 425 3800కు ఫోన్ కాల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న కార్డును బ్లాక్ చేయవచ్చు. అయితే ఎస్బీఐ అకౌంట్‌కు లింక్ ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.

- మీ కార్డును బ్లాక్ చేయడానికి '0'ను ఎంటర్ చేయాలి.

- ప్రాసెస్ కంటిన్యూ చేయడం కోసం 1 లేదా 2 ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా, కార్డ్ నెంబర్ ద్వారా ఎస్బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకు ఆప్షన్ 1ను ఎంచుకోవాలి.

- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా, అకౌంట్ ద్వారా బ్లాక్ చేయడం కోసం ఆప్షన్ 2ను ఎంచుకోవాలి.

- అకౌంట్ చివరి 5 అంకెలను నమోదు చేసి, ఆ తర్వాత 1ని ఎంటర్ చేసి నిర్ధారించాలి.

- మీరు ఆప్షన్ 1ను ఎంచుకుంటే కనుక కార్డు చివరి 5 అంకెలు నమోదు చేయాలి. ఆ తర్వాత 1తో నిర్ధారించాలి. ఆ తర్వాత 2 ను ఎంటర్ చేస్తే ఎస్బీఐ కార్డు చివరి 5 అంకెలను నమోదు చేయాలి.

- మీ డెబిట్ కార్డు బ్లాక్ చేయబడుతుంది. అదే ఎస్సెమ్మెస్ ద్వారా వస్తుంది.

కొత్త కార్డు తీసుకోవాలి

కొత్త కార్డు తీసుకోవాలి

ఒకవేళ మీరు కొత్త కార్డును మళ్లీ తీసుకోవాలనుకుంటే 1ని ఎంటర్ చేయాలి. మునుపటి మెనూలోకి వెళ్లేందుకు 7 పైన క్లిక్ చేయాలి. మెయిన్ మెనూ కోసం 8 పైన క్లిక్ చేయాలి.

కొత్త కార్డు కోసం ఇలా..

కొత్త కార్డు కోసం ఇలా..

- కార్డు రీప్లెస్‌మెంట్ కోసం అప్లై చేసి, 1ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది.

- మొదట మీరు మీ పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. కార్డు మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపిస్తారు. కొత్త కార్డు కోసం ఛార్జీలు వర్తిస్తాయి. దీనిని నిర్ధారించడానికి 1, క్యాన్సిల్ చేయడానికి 2 పైన క్లిక్ చేయాలి. మీరు 1 పైన ప్రెస్ చేస్తే కార్డు రీప్లెస్‌మెంట్ విజ్ఞప్తి బ్యాంకుకు అందుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు నిర్ధారణ సందేశం వస్తుంది. ఇలాగే మీ బ్యాంకు అకౌంట్ వివరాలను ఉపయోగించి కూడా బ్లాక్ చేయవచ్చు.

English summary

SBI డెబిట్ కార్డు పోయిందా? ఇలా సులభంగా బ్లాక్ చేసి, కొత్త కార్డు కోసం అప్లై చేయండి | Know the details how to block SBI debit card and get over Phone

The country's leading lender SBI through its seamless service has now simplified the process to block the lost debit card and also get the same reissued.
Story first published: Thursday, July 22, 2021, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X