For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Subsidy Loan: చిరు వ్యాపారులకు సబ్సిడీ లోన్.. తక్కువ వడ్డీకే అందిస్తున్న కేంద్రం.. ఎలా పొందాలంటే..

|

Subsidy Loan: కరోనా మహమ్మారి కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. చిరు వ్యాపారుల జీవితాలు నాశనమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి జీవనోపాధి కష్టంగా మారింది. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది.దీని కింద ఉపాధి ప్రారంభించడానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు రుణం అందజేస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాలను చవిచూసిన వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.

 రుణంపై సబ్సిడీ..

రుణంపై సబ్సిడీ..

ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద.. వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం లోన్స్ అందిస్తోంది. దీని కింద వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల రుణం లభిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వం.. రుణంపై సబ్సిడీని కూడా అందిస్తోంది. రుణం చెల్లించిన తర్వాత రెండోసారి రెట్టింపు మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం కూడా రుణాలపై గ్యారెంటీని ప్రస్తుత 15% నుంచి 25%కి పెంచింది. ఈ పథకాన్ని గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) స్పాన్సర్ చేస్తుంది. ప్రతి రుణగ్రహీత 7% వడ్డీ రాయితీకి అర్హులు.

విడతల వారీగా లోన్..

విడతల వారీగా లోన్..

ఎవరైనా ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద మొదటిసారిగా 10 వేల రూపాయలు లోన్ తీసుకున్నారని అనుకుందాం. అతను దానిని సకాలంలో చెల్లించినట్లయితే.. వారికి ఈ పథకం కింద రెండోసారి రూ.20 వేల రుణం లభిస్తుంది. అదేవిధంగా మూడోసారి రూ.50 వేల రుణం పొందేందుకు అర్హత సాధిస్తారు. విశేషమేమిటంటే ఈ పథకం కింద లోన్ తీసుకోవడానికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత.. లోన్ మొత్తం మూడు విడతలుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

PM స్వానిధి యోజన కింద తీసుకున్న రుణ మొత్తాన్ని ఒక సంవత్సరం కాలవ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. మీరు ప్రతి నెలా వాయిదాల్లో లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంది. PM స్వనిధి యోజన ప్రయోజనం పొందడానికి.. దరఖాస్తుదారు ఆధార్ కార్డును తప్పక కలిగి ఉండాలి. PM స్వనిధి యోజన కింద రుణం తీసుకోవడానికి, ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకోసం ముందుగా బ్యాంకులో PM స్వానిధి యోజన లోన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. మీరు ఫారమ్‌తో ఆధార్ కార్డ్ ఫోటోకాపీని జతచేయాలి. దీని తర్వాత.. మీ దరఖాస్తు ఆమోదించబడినట్లయితే లోన్ మొదటి విడత సొమ్ము మీ ఖాతాలో జమ చేయబడుతుంది.

 ఈ పథకానికి బడ్జెట్ పెంచిన కేంద్రం..

ఈ పథకానికి బడ్జెట్ పెంచిన కేంద్రం..

వీధి వ్యాపారులకు క్యాష్ బ్యాక్ సహా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వం ఈ పథకం బడ్జెట్‌ను పెంచింది. ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ పథకం కింద 25 ఏప్రిల్ 2022 వరకు 31.9 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. ఇది కాకుండా 29.6 లక్షల రుణాలకు గాను రూ.2,931 కోట్లు విడుదలయ్యాయి.

English summary

Subsidy Loan: చిరు వ్యాపారులకు సబ్సిడీ లోన్.. తక్కువ వడ్డీకే అందిస్తున్న కేంద్రం.. ఎలా పొందాలంటే.. | know how to get subsidy loan under pm svanidhi yojana by small street vendors

know how to get subsidy loan under pm svanidhi yojana by small street vendors suffered losses with corona pandemuic easily..
Story first published: Sunday, July 17, 2022, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X