For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPI Apps: ఫోన్ పోగొట్టుకున్నారా.. మీ యూపీఐ యాప్స్ ఎలా బ్లాక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

|

UPI Payment Apps: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారు, డిజిటల్ చెల్లింపు యాప్స్ వాడనివారు అరుదనే చెప్పుకోవాలి. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఉన్న చిక్కల్లా బ్యాంకింగ్ యాప్స్ తోనే.

ఫోన్ పోగొట్టుకున్నట్లయితే..

ఫోన్ పోగొట్టుకున్నట్లయితే..

కనీసం రూ.10 చెల్లింపు చేయాలన్నా ఈ రోజుల్లో అందరూ డిజిటల్ రూపంలోనే పేమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా రకాల చెల్లింపు యాప్ లను వాడుతుంటారు. వీటిలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి అనేక చెల్లింపు యాప్స్ వినియోగిస్తుంటారు.

అయితే ఒకవేళ ఫోన్ పోయినప్పుడు ఇవి పనిచేయకుండా ఎలా బ్లాక్ చేయాలన్నదే పెద్ద ప్రశ్న. వాటిని ఇతరులు దుర్వినియోగం చేయకుండా, డబ్బు ట్రాన్ఫర్ అవకుండా తప్పక చర్యలు తీసుకోవాలి. అసలు స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ పే బ్లాక్ చేయటం ఎలా..

గూగుల్ పే బ్లాక్ చేయటం ఎలా..

స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు డిజిటల్ పేమెంట్ యాప్ లను తప్పకుండా బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ పే అకౌండ్ ను బ్లాక్ చేయటానికి వినియోగదారు 18004190157 కస్టమర్ కేర్ నెంబర్ ను సంప్రదించాలి. ఇందుకోసం కాల్ కనెక్ట్ కాగానే అదర్ ఇష్యూస్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ గూగుల్ రిజిస్టర్డ్ నెంబర్ వివరాలను అందించాలి. ఆ వెంటనే చెల్లింపుల సంస్థ మీ డిజిటల్ యూపీఐ చెల్లింపుల ఖాతాను బ్లాక్ చేస్తుంది.

డేటా ఎలా తొలగించాలి..

డేటా ఎలా తొలగించాలి..

మీరు పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ లో మీ లాగిన్, అకౌంట్ వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. వీటిని కూడా మీరు తొలగించటం సురక్షితమైనది. ఇందుకోసం మీరు Anroid.com ద్వారా గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి డేటా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల డేటా పూర్తిగా డిలీట్ అవుతుంది.

ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయటం ఇలా..

ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయటం ఇలా..

ఇక ఫోన్ పే వాడేవారు తమ యూపీఐ ఖాతాను బ్లాక్ చేసుకోవటానికి 08068727374, 02268727374 నెంబర్లను సంప్రదించాలి. కాల్ కనెక్ట్ కాగానే కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడేందుకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సమయంలో వారికి మీ మెుబైల్ నంబర్, మెయిల్ ఐడీ, లాస్ట్ ట్రాన్సాక్షన్ లకు సంబంధించిన వివరాలు అందించాలి. ఇవి సరైనవిగా ఉన్నట్లు వారు రుజువు చేసుకున్న తరువాత మీ యూపీఐ అకౌంట్ బ్లాక్ చేయటం పూర్తవుతుంది.

English summary

UPI Apps: ఫోన్ పోగొట్టుకున్నారా.. మీ యూపీఐ యాప్స్ ఎలా బ్లాక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.. | know how to block upi digital payment apps in case lost mobile phone

know how to block upi digital payment apps if you lost your mobile phone in detail
Story first published: Tuesday, July 26, 2022, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X