For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Policy: LIC కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్.. 15 శాతం అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు..

|

LIC Policy: దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్‌ను ప్రారంభించింది. LIC న్యూ పెన్షన్ ప్లస్ అనేది నాన్-పార్టిసిటింగ్, యూనిట్-లింక్డ్ పెన్షన్ ప్లాన్. రిటైర్మెంట్ అనంతరం సుఖంగా జీవించాలని ప్లాన్ చేసుకునే యువతకు ఇది సరైన ఎంపిక. ఈ కొత్త పెన్షన్ ప్లాన్- 867 పూర్తి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుని లాభపడండి.

ప్రీమియం చెల్లింపులు..

ప్రీమియం చెల్లింపులు..

LIC కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్‌ను ఒకే ప్రీమియం చెల్లింపు విధానంగా లేదా సాధారణ ప్రీమియం చెల్లింపుగా కొనుగోలు చేయవచ్చు. రెగ్యులర్ ప్రీమియం కింద పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారుడు చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని, పాలసీ వ్యవధి పరిమితులకు లోబడి ఉంటాయి.

రెగ్యులర్ ఆదాయం..

రెగ్యులర్ ఆదాయం..

LIC న్యూ పెన్షన్ ప్లస్ క్రమబద్ధమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా కార్పస్‌ను నిర్మించడం లక్ష్యంగా నిర్వహించబడుతుంది. పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత వచ్చే మొత్తాన్ని సాధారణ ఆదాయంగా మార్చుకోవచ్చు. సాధారణ ఆదాయం కోసం.. పాలసీదారుడు యాన్యుటీ ప్లాన్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఫండ్స్ రకాలు..

ఫండ్స్ రకాలు..

పాలసీ కొనుగోలుదారు అందుబాటులో ఉన్న నాలుగు రకాల ఫండ్‌లలో ఒకదానిలో పెట్టుబడి పెట్టే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ప్రీమియం కేటాయింపు ఛార్జీకి లోబడి ఉంటుంది. LIC ఒక పాలసీ సంవత్సరంలో నిధుల కోసం నాలుగు ఉచిత స్విచ్‌లను అనుమతిస్తుంది.

అడిష్నల్ గ్యారెంటీ..

అడిష్నల్ గ్యారెంటీ..

ఈ పాలసీ కింద సాధారణ ప్రీమియంపై హామీ అదనంగా 5 శాతం నుండి 15.5 శాతం వరకు ఉంటుంది. చెల్లించాల్సిన ఒక్క ప్రీమియంపై, నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత ఇది 5 శాతం వరకు ఉంటుంది. NAV రోజువారీగా గణించబడుతుంది.

విత్ డ్రా అవకాశం..

విత్ డ్రా అవకాశం..

పిల్లల ఉన్నత విద్య వంటి కొన్ని అవసరాలక కోసం 5 ఏళ్ల తర్వాత పాలసీ పాక్షిక విత్ డ్రాకు ఎల్ఐసీ అనుమతిస్తుంది. పిల్లల వివాహం, ఇంటి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణం లేదా అనారోగ్యం వంటి ఇతర కారణాల కింద ఈ అవకాశం ఉంది. LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in నుంచి ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చు.

English summary

LIC Policy: LIC కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్.. 15 శాతం అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు.. | know details about lic new pension plus plan 867 that giving many benefits to policy holders

know details about lic new pension plus plan 867 that giving many benefits to policy holders..
Story first published: Sunday, September 11, 2022, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X