For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ప్రమాదానికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలో తెలుసుకోండి..

|

LPG Gas Cylinder: ఇళ్లలో ప్రతి ఒక్కరికీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. చిన్న తప్పు కూడా భారీ ప్రమాదానికి దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో.. LPGని ఉపయోగించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదం జరిగితే ఏమి చేయాలో మనకు తెలిసి ఉండటం తప్పనిసరి. పైగా ప్రస్తుతం దేశీయ చమురు కంపెనీలు గ్యాస్ ప్రమాదాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అందిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు చాలా మందికి అవగాహన లేదు. దీనిని ఎలా పొందాలో కూడా చాలా మందికి తెలియదు. LPG గ్యాస్ సిలిండర్ పేలినా లేదా గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగినా కస్టమర్‌గా మీ హక్కులు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్..

50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్..

దేశంలోని పెట్రోలియం సంస్థలు LPGని కొనుగోలు చేసే వినియోగదారులకు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అంటే.. LPG కనెక్షన్ గ్యాస్ లీక్ లేదా LPG సిలిండర్ నుంచి పేలుడు వంటి ఘటన సంభవించినప్పుడు ఈ బీమా రూ. 50 లక్షల వరకు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనిని అందించడానికి పెట్రోలియం సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

రెండు లక్షల ఇన్సూరెన్స్ ఎందుకంటే..

రెండు లక్షల ఇన్సూరెన్స్ ఎందుకంటే..

సిలిండర్‌ను డెలివరీ చేసే ముందు, డీలర్ అది ఖచ్చితమైన పని క్రమంలో ఉందో లేదో తనిఖీ చేయాలి. కస్టమర్ ఇంటి వద్ద LPG సిలిండర్ వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించినప్పుడు వ్యక్తిగత ప్రమాద కవర్ చెల్లించటం జరుగుతుంది. ప్రమాదంలో వినియోగదారుడి ఆస్తి/ఇంటికి నష్టం జరిగినప్పుడు ఒక్కో ప్రమాదానికి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది.

క్లెయిమ్ ఎంత వస్తుంది..

క్లెయిమ్ ఎంత వస్తుంది..

అధికారిక వెబ్‌సైట్ myLPG.in ప్రమాదం తర్వాత క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలో పూర్తి వివరాలను అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ లో ఉంచిన సమాచారం ప్రకారం.. కస్టమర్ తన పేరుమీద ఉన్న గ్యాస్ కనెక్షన్ కు సంబంధించిన సిలిండర్ వల్ల ప్రమాదం లేదా కనెక్షన్ వల్ల అతని ఇంట్లో ప్రమాదం జరిగితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పొందటానికి అర్హుడు. ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తికి గరిష్ఠంగా రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో చనిపోయిన ఒక్కో వ్యక్తికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది. ఒక్కో ఘటనకు మెడికల్ ఖర్చులకు గరిష్ఠంగా రూ.30 లక్షల కవర్ లభిస్తుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్..

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్..

ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీ, బీపీసీ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ వ్యాపారాల పంపిణీదారులు ప్రమాద బీమాను కలిగి ఉండాలి. ఇందులో వ్యక్తులు, ఆస్తికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా ప్రతి కస్టమర్ పేరుమీద ఉండవు. అయితే ఈ పాలసీ ప్రతి వినియోగదారుడికి వర్తింస్తుంది. దీనికి అతను ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

పోలీసు ఫిర్యాదు తప్పనిసరి..

పోలీసు ఫిర్యాదు తప్పనిసరి..

క్లెయిమ్ పొందటానికి.. వినియోగదారులు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రమాదానికి సంబంధించిన కేసు ఎఫ్‌ఐఆర్ కాపీ, ఆసుపత్రి బిల్లులు, గాయపడిన వ్యక్తి మెడికల్ బిల్లులు, అలాగే మరణిస్తే పోస్ట్‌మార్టం రిపోర్ట్ లేదా డెత్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. కాబట్టి, గ్యాస్ సిలిండర్‌ ప్రమాదం జరిగిన తర్వాత మొదటి దశ పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత రీజియన్‌ కార్యాలయం విచారణ జరుపుతుంది. ప్రమాదంలో LPG ఉంటే, LPG పంపిణీ ఏజెన్సీ/ఏరియా కార్యాలయం దాని గురించి బీమా కంపెనీ స్థానిక కార్యాలయానికి తెలియజేస్తుంది. క్లెయిమ్ తగిన బీమా క్యారియర్‌కు సమర్పించబడుతుంది. కస్టమర్ క్లెయిమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు లేదా బీమా క్యారియర్‌ను నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేదు.

English summary

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ప్రమాదానికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలో తెలుసుకోండి.. | know about lpg cylinder insurance cover in case of blaust or accident to customers knoe claimimg process now

know about lpg cylinder insurance cover in case of blaust
Story first published: Friday, July 8, 2022, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X