For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Policy: మీ పిల్లల్ని లక్షాధికారి చేయాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్ లో రోజూ రూ.150 పొదుపు చేస్తే చాలు..

|

Jeevan Tarun Policy: చాలా మంది తల్లిదండ్రులు తమ తరువాతి తరాలకు మంచి ఆర్థిక పరిస్థితులను కల్పించాలని భావిస్తుంటారు. అలాంటి వారు కొన్ని పథకాల్లో క్రమతప్పుకుండా చిన్న మెుత్తంలో పొదుపు చేయటం వల్ల తమ పిల్లలను లక్షాధికారులుగా మార్చవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లక్షలాది మంది వినియోగదారులకు అనేక రకాల పాలసీలను అందిస్తోంది.

ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైనదిగా పరిగణించబడటంతో పాటు సేఫ్ రిటర్న్స్ కూడా పాలసీదారులు పొందవచ్చు. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు ఎల్ఐసీకి సంబంధించిన జీవన్ తరుణ్ పాలసీ ఒక మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు.

జీవన్ తరుణ్ వివరాలు..

జీవన్ తరుణ్ వివరాలు..

LIC జీవన్ తరుణ్ పాలసీ అనేది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ స్కీమ్. పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ ఈ పాలసీని రూపొందించింది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టేవారికి కంపెనీ సేవింగ్ తో పాటు సేఫ్టీని కూడా అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడికి అర్హత వయస్సు..

పెట్టుబడికి అర్హత వయస్సు..

LIC జీవన్ తరుణ్ పాలసీని తీసుకోవడానికి పిల్లల వయస్సు కనీసం 90 రోజులు ఉండాలి. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ ప్లాన్ తీసుకోవటం కుదరదు. ఈ పరిస్థితిలో మీ పిల్లల వయస్సు 12 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడే జీవన్ తరుణ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఏడాది, అర్థ సంవత్సరం, క్వార్టర్లీ లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు.

డబుల్ బోనస్ ప్రయోజనం..

డబుల్ బోనస్ ప్రయోజనం..

పిల్లలకు 25 ఏళ్లు నిండినప్పుడు ఈ పాలసీ కింద పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలకి 20 ఏళ్లు వచ్చే వరకు మీరు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది సౌకర్యవంతమైన ప్లాన్. మెచ్యూరిటీ సమయంలో మీరు ఈ పథకంపై డబుల్ బోనస్ పొందుతారు. మీరు కనీసం రూ.75,000 బీమా సొమ్ముతో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇదే సమయంలో దీనికి గరిష్ఠ పరిమితి లేదు.

రోజూ రూ.150 చెల్లిస్తే.. లక్షలు..

రోజూ రూ.150 చెల్లిస్తే.. లక్షలు..

మీరు 12 సంవత్సరాల పిల్లల కోసం పాలసీని కొనుగోలు చేస్తే.. పాలసీ వ్యవధి 13 సంవత్సరాలు ఉంటుంది. కనీస హామీ మొత్తం రూ.5 లక్షలను జీవన్ తరుణ్ పాలసీ కింద రోజులుక రూ.150 చెల్లిస్తే.. మీ వార్షిక ప్రమీయం రూ.55 వేలు అవుతుంది. ఈ విధంగా ఎనిమిదేళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ.4,40,665 అవుతుంది.

దీని తర్వాత మీరు పెట్టుబడి మొత్తంపై రూ. 2,47,000 బోనస్ పొందుతారు. దీని తర్వాత మీరు లాయల్టీ బోనస్‌గా రూ. 97,000 పొందుతారు. ఈ విధంగా మీరు మెచూరిటీ సమయంలో మొత్తం రూ.8,44,500 అందుకుంటారు.

రూ.15 లక్షలు కావాలంటే..

రూ.15 లక్షలు కావాలంటే..

ఒక వ్యక్తి తన పిల్లల కోసం 90 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు నెలకు రూ. 2,800 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి పిల్లల పేరు మీద రూ. 15.66 లక్షల నిధిని సృష్టించవచ్చు. ఈ పాలసీ 25 ​​ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. అదే సమయంలో.. మీరు 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.2,800 వరకు పెట్టుబడి పెట్టాలి.

English summary

LIC Policy: మీ పిల్లల్ని లక్షాధికారి చేయాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్ లో రోజూ రూ.150 పొదుపు చేస్తే చాలు.. | know about jeevan tarun policy of lic is good saving scheme for children with daily investment of 150 rupees

jeevan tarun policy of lic is good saving scheme for children know details..
Story first published: Wednesday, July 6, 2022, 13:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X