For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ఫోన్ నెక్స్ట్ కొనుగోలు చేయాలంటే ఇలా చేయాల్సిందే: EMI ప్లాన్స్ ఇవే..

|

జియో ఫోన్ నెక్స్ట్ విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. వీటిని కొనుగోలు చేయాలనుకునేవారు స్టోర్‌కు వెళ్లడానికి ముందే వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనడానికి అవకాశం లేదు. జియో ఫోన్ నెక్స్ట్ కొనుగోలు కోసం రిలయన్స్ ఈఎంఐ ప్లాన్స్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో కొనుగోలుదారులు మొదట రూ.1,999 చెల్లిస్తే సరిపోతుంది.

కొనాలంటే ఇలా చేయాలి

కొనాలంటే ఇలా చేయాలి

జియో ఫోన్ నెక్స్ట్ కోసం 70182 70182కు HI అని వాట్సాప్ చేయడం ద్వారా కొనుగోలు ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా కొనుగోలుదారులు తమ లొకేషన్‌ను షేర్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తయ్యాకే స్టోర్‌కు వెళ్లి జియో ఫోన్ నెక్స్ట్‌ను కొనుగోలు చేయాలి. జయో ఫోన్ నెక్స్ట్ ఖరీదు రూ.6,499. కస్టమర్లు ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందులో తొలుత రూ.1,999 చెల్లించాలి.

రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనం. మిగిలిన మొత్తాన్ని సులభ వాయిదాల్లో చెల్లించాలి. ఫోన్ తీసుకోవడానికి ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రావాలని చెప్పే అవకాశం కూడా ఉంది. జియో ఫోన్ నెక్స్ట్‌కు సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 30,000కు పైగా రిటైల్ ఔట్ లెట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేపర్‌లెస్ డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. దీంతో భౌగోళికంగా ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉంటుంది.

EMI ప్లాన్స్

EMI ప్లాన్స్

జియో ఫోన్ నెక్స్ట్ కోసం తొలుత రూ.1999 చెల్లించాలి. ఆ తర్వాత ఈ దిగువ ఈఎంఐ ఆప్షన్‌లలో దేనిని అయినా ఎంచుకోవచ్చు.

- ఆల్వేస్ ఆన్ ప్లాన్ నెలకు రూ.300 చొప్పున 24 నెలలు. ఇందులో నెలకు 5GB డేటా, 100 నిమిషాల కాలింగ్.

- ఆల్వేస్ ఆన్ ప్లాన్ నెలకు రూ.350 చొప్పున 18 నెలలు. ఇందులో నెలకు 5GB డేటా, 100 నిమిషాల కాలింగ్.

- లార్జ్ ప్లాన్‌లో నెలకు రూ.450 చొప్పున 24 నెలలు. ఇందులో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్.

- లార్జ్ ప్లాన్‌లో నెలకు రూ.500 చొప్పున 18 నెలలు. ఇందులో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్.

- XL ప్లాన్‌లో నెలకు రూ.500 చొప్పున 24 నెలలు. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్.

- XL ప్లాన్‌లో నెలకు రూ.550 చొప్పున 18 నెలలు. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్.

- XXL ప్లాన్‌లో నెలకు రూ.550 చొప్పున 24 నెలలు. ఇందులో రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్.

- XXL ప్లాన్‌లో నెలకు రూ.600 చొప్పున 18 నెలలు. ఇందులో రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

జియో ఫోన్ నెక్స్ట్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తుంది. భారత్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వర్షన్. 5.45 అంగుళాల HDప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. యాంటీ-ఫింగర్ కోటింగ్ ఉంటుంది. కెమెరా విభాగంలో జియో ఫోన్ నెక్ట్స్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. రియర్ కెమెరాలో పోట్రాయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రీలోడెడ్ కస్టమ్ ఇండియా - అగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్ ఉంటాయి.

ఈ ఫోన్ 1.3GHz క్వాల్ కామ్ స్వాప్ డ్రాగన్ 215 క్వాడ్ - కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 512GB వరకు విస్తరించుకోగలిగిన 32GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. జియో ఫోన్ నెక్స్ట్ 3500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మైక్రో-యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ4.1, వైఫై, డ్యూయల్ సిమ్(నానో) స్లాట్స్ ఉంటాయి. జియో ఫోన్ నెక్స్ట్ ఆటోమేటిక్ సాఫ్టువేర్ అప్ గ్రేడ్స్‌ను కలిగి ఉంటుంది. రీడ్ అలోడ్,లైవ్ ట్రాన్సులేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి.

English summary

జియో ఫోన్ నెక్స్ట్ కొనుగోలు చేయాలంటే ఇలా చేయాల్సిందే: EMI ప్లాన్స్ ఇవే.. | Jio Phone Next goes on sale: EMI plans and how to get at Rs 1999

Reliance Jio has started the sale of its much-awaited affordable smartphone Jiophone Next. The made-for-India smartphone, jointly designed by Google and Jio, can be bought at Reliance Retail's JioMart Digital stores, jio.com or by sending a WhatsApp message.
Story first published: Sunday, November 7, 2021, 17:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X