For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ITR filing: ఐటీ రిటర్న్స్ ఈ-వెరిఫికేషన్ కోసం ఒక్కరోజే గడువు!

|

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలు చేసి, ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం సూచించింది. సాధారణ రిటర్న్స్ దాఖలు చేసిన 120 రోజుల్లే ఈ -వెరిఫై చేసుకోవాలి. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఉండటంతో ఎంతోమంది రిటర్న్స్ ఈ-వెరిఫైని పట్టించుకోలేదు. దీంతో ఆదాయపు పన్ను విభాగం ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవాలని తెలిపింది.

ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా ఈవీసీ ద్వారా ఈ-వెరిఫై చేసుకోవచ్చు. లేదంటే సీపీసీ బెంగళూరుకు అక్నాలెడ్జ్‌మెంట్‌ను పంపించాలి. లేదంటే రిటర్న్స్ సమర్పించినా అది చెల్లదు. ఐటీఆర్‌ను ధృవీకరించకుంటే అది డిఫెక్టివ్ రిటర్న్స్‌గా సూచించబడుతుంది. ధృవీకరించబడే వరకు పన్ను ఏజెన్సీ అలాంటి ఐటీఆర్‌ను అంగీకరించదు. అంటే మీరు ఆ సంవత్సరానికి పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదని భావించబడుతుంది.

ITR filing: Last chance for income taxpayers to avoid becoming non-filers

ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ట్వీట్ చేస్తూ 'AY 2020-21 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించి వెరిఫికేషన్ కోసం చివరి అవకాశాన్ని కోల్పోకండి. వెరిఫై చేయకుంటే ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి కానట్లు అవుతుంది. వెరిఫికేషన్ కోసం చివరి తేదీ 28 ఫిబ్రవరి 2022' అని పేర్కొంది.

English summary

ITR filing: ఐటీ రిటర్న్స్ ఈ-వెరిఫికేషన్ కోసం ఒక్కరోజే గడువు! | ITR filing: Last chance for income taxpayers to avoid becoming non-filers

You need to verify your Income Tax Returns to complete the return filing process. Without verification within the stipulated time, an ITR is treated as invalid.
Story first published: Sunday, February 27, 2022, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X