For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు, ఇవి గుర్తుంచుకోండి..

|

న్యూఢిల్లీ: మీరు వేతనజీవులా? ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ కోసం ఫామ్ 16 తప్పనిసరి. చాలామంది వేతనజీవులకు ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు. అయితే మీరు ఫామ్ 16 పొందలేని సందర్భాలు ఉండవచ్చు. మీ యాజమాన్యం కంపెనీని మూసివేయడం లేదా మీరు సరైన నిష్క్రమణ ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా ఉద్యోగం మారడం వంటి అంశాలు మీకు ఫామ్ 16 లేకపోవడానికి కారణాలుగా ఉండవచ్చు. అయితే ఇలాంటి సందర్భాలలో వివిధ డాక్యుమెంట్స్ ద్వారా మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

10 నిమిషాల్లో పాన్‌కార్డు పొందవచ్చు ఇలా.. అది కూడా ఉచితంగా10 నిమిషాల్లో పాన్‌కార్డు పొందవచ్చు ఇలా.. అది కూడా ఉచితంగా

శాలరీ డిటైల్స్

శాలరీ డిటైల్స్

ఫామ్ 16 లేని శాలరైడ్ కూడా ఇలా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. మీ వేతన ఆదాయాన్ని లెక్కించడానికి మీ శాలరీ స్లిప్స్ ప్రధాన ఆధారం. కాబట్టి మీరు మీ వేతన స్లిప్స్‌ను భద్రపరుచుకోవాలి. మీ శాలరీ ఆదాయానికి సంబంధించిన బ్రేక్-అప్స్ ఉండాలి. గ్రాస్ శాలరీ, సెక్షన్ 10 కింద మినహాయింపులు, సెక్షన్ 16 కింద తగ్గింపులు.. అంటే స్టాండర్డ్ డిడక్షన్, ప్రభుత్వ ఉద్యోగులైతే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్.

మీ శాలరీ స్లిప్‌లో ఇవి ఉంటాయి. అయితే చాలా కంపెనీల్లో కొంత సమాచారం ఉండకపోవచ్చు. ఫామ్ 12బీఏని అందించాలని మీరు మీ హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ డిపార్టుమెంటును కోరవచ్చు. మీ వేతనానికి సంబంధించిన బ్రేక్-అప్స్, ఇతర వివరాలు ఉంటాయి. మీ వేతన స్లిప్స్ ద్వారా కంపెనీ మీకు చెల్లించిన అలవెన్స్‌లు, పీఎఫ్ కోసం కట్ చేయబడిన మొత్తం, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(TDS) ఉంటాయి. పన్ను మినహాయింపు ఉన్న అలవెన్స్ మొత్తాలను ఐటీఆర్‌లో పేర్కొనాలి. అలాగే ఈ సంవత్సరానికి సెక్షన్ 16(ia) కింద రూ.50వేల ప్రామాణిక తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడం మరిచిపోవద్దు.

ఫామ్ 26ఏఎస్

ఫామ్ 26ఏఎస్

ఫామ్ 26ఏఎస్‌లో మీ శాలరీ ఆదాయానికి సంబంధించిన టీడీఎస్ డిడక్షన్‌తో పాటు ఇతర ఆదాయాలపై కూడా కలిగి టీడీఎస్ కలిగి ఉండాలి. 26ఏఎస్‌లో పొందుపరిచిన మీ గణాంకాలతో టీడీఎస్‌ను క్రాస్ చెక్ చేసుకోవాలి. తేడాలు కనిపిస్తే సంబంధిత డిడక్టర్‌ను సంప్రదించాలి. అన్నింటిని సరిపోల్చుకోవాలి.

హౌస్ రెంట్... మినహాయింపు

హౌస్ రెంట్... మినహాయింపు

హౌస్ ప్రాపర్టీ నుండి ఇంటి అద్దె పొందుతుంటే కనుక దానిని పేర్కొనాలి. రుణాలు పొందితే, ఆ రుణంపై వడ్డీని చెల్లిస్తుంటే మినహాయింపు ఉంటుంది. రెండు కంటే ఎక్కువ ఇళ్లను కలిగి ఉంటే డీమ్డ్ లెట్ ఔట్ కాన్సెప్ట్‌ను చెక్ చేయాలి. అద్దె పైన ఆధాయం వస్తుంటే 30 శాతం ఫ్లాట్ డిడక్షన్ పొందవచ్చు. మున్సిపల్ పన్ను చెల్లిస్తే మినహాయింపు ఉంటుంది.

ఆదాయం ఎంత ఉందో చూసుకోవాలి

ఆదాయం ఎంత ఉందో చూసుకోవాలి

తొలుత ఆర్థిక సంవ‌త్స‌రంలో అన్ని వ‌న‌రుల నుంచి మీ ఆదాయం ఎంత ఉందో చూసుకోవాలి. జీతం లేదా పెన్ష‌న్, ఇంటి అద్దెలు, ఏదైనా స్వ‌ల్ప, దీర్ఘ‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్, ఇత‌ర వ‌న‌రుల నుంచి వ‌చ్చే ఆదాయం అంటే సేవింగ్స్ బ్యాంక్ వ‌డ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్ పైన వ‌చ్చే వ‌డ్డీ, రీఫండ్‌పై వ‌చ్చే వడ్డీలు చూసుకోవాలి. ఈక్విటీ సేల్, ఈక్విటీ ఓరియెంటెడ్ మూయువల్ ఫండ్స్ నుండి పొందిన లాభాలకు సంబంధించి మీ బ్రోకర్ నుండి సమ్మరీ స్టేట్‌మెంట్ పొందాలి. రూ.1 లక్ష వరకు మినహాయింపు ఉంది. ల్యాండ్ లేదా బిల్డింగ్ అమ్మడం ద్వారా వస్తే ఇందుకు సంబంధించిన దస్తావేజులు కలిగి ఉండాలి.

లెక్కించాలి

లెక్కించాలి

డిడక్షన్లు అన్నీ క్లెయిమ్ చేసిన తర్వాత మొత్తం పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని లెక్కించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం నుండి డిడక్షన్లను తీసివేస్తే వచ్చేదే మీరు పన్ను చెల్లించాల్సిన మొత్తం.

మీకు వర్తించే సంబంధిత పన్ను స్లాబ్ రేటు ఆధారంగా ట్యాక్స్ లయబిలిటీని లెక్కించవచ్చు. ఆదాయంపై చెల్లించిన టీడీఎస్, ట్యాక్స్ లయబిలిటీ కంటే తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు చెల్లించాలి. లేదంటే టీడీఎస్ మొత్తమే ఎక్కువగా ఉంటే మిగిలిన మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఐటీ రిటర్న్స్‌లో క్లెయిమ్ చేసుకోవాలి.

English summary

ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు, ఇవి గుర్తుంచుకోండి.. | ITR filing for FY 2019-20: How to file income tax return without Form 16

For the salaried, Form 16 is a basic document used for filing their income tax returns (ITR). Filing ITR without Form 16 seems almost impossible for most salaried individuals.
Story first published: Sunday, December 27, 2020, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X