For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: భారత్‌కు అండగా నిన్న బంగారం, నేడు ఫారెక్స్ నిల్వలు: ఆర్థిక వ్యవస్థకు ఎలా లాభం

|

భారతదేశంలో సరిపడా విదేశీ నిల్వలు పెరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు భారీగా పడిపోనున్న ఈ పరిస్థితుల్లో పెరిగిన ఫారెక్స్ నిల్వలు... దేశంలోని అంతర్గాత, బాహ్య ఆర్థిక సమస్యల నిర్వహణ కోసం ప్రభుత్వానికి, ఆర్బీఐకి పెద్ద ఊరట. గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫారెక్స్, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశాలు.

ఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరికఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరిక

500 బిలియన్ డాలర్లకు సమీపంలో ఫారెక్స్

500 బిలియన్ డాలర్లకు సమీపంలో ఫారెక్స్

1991లో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు భారతదేశం బంగారు నిల్వలపై ఆధారపడవలసి వచ్చింది. ఇప్పుడు ఎదురైన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు పెరుగుతున్న విదేశీ నిల్వలపై ఆధారపడే పరిస్థితి. 40 ఏళ్లలో తొలిసారి జీడీపీ దారుణంగా పడిపోయింది. ఆర్థికపరిస్థితిపై ఆందోళన ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ఊరటనిస్తున్నాయి. ఇందులో ఫారెక్స్ నిలువలు పెరగడం ప్రధాన కారణాల్లో ఒకటి. త్వరలో ఇవి 500 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయి. మే నెల చివరి నాటికి (మే 29 నాటికి) 12.4 బిలియన్ డాలర్లు పెరిగి 493.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన కరెన్సీలో రూ.37.30 లక్షల కోట్లకు పైగా.

1991 నుండి 8,400 రెట్లు

1991 నుండి 8,400 రెట్లు

1991లో 5.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు ఇప్పుడు 8,400 రెట్లు పెరిగాయి. అదే సమయంలో బంగారం నిల్వలు తగ్గాయి. అంతకుముందు వారంతో పోలిస్తే మే 29 నాటికి 9.7 కోట్ల డాలర్లు తగ్గి 3,268.2 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ఇండియా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 143 కోట్ల డాలర్ల వద్ద యథాతథంగా ఉన్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు మాత్రం 3.1 కోట్ల డాలర్లు పెరిగి 416 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశీయ ఈక్విటీల్లో FPI పెట్టుబడులు పెరగడం, దిగుమతి వ్యయాలు తగ్గడం వంటి కారణాలతో దేశ విదేశీ మారక నిల్వలు పెరగడానికి దోహదపడతాయి.

పారెక్స్ మద్దతు

పారెక్స్ మద్దతు

బంగారం నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద ఆర్బీఐ పొజిషన్, విదేశీ కరెన్సీ ఆస్తులు (క్యాపిటల్ మార్కెట్లలోకి మూలధన ప్రవాహం, FDI, ఎక్స్టర్నల్ కమర్షియల్ రుణాలు) రూపాల్లో ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. వీటిని ఆర్బీఐ నిర్వహిస్తుంది. ద్రవ్య, ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్‌మెంట్ పాలసీలకు మద్దతు ఇవ్వడం వంటి పలు లక్ష్యాలకు విదేశీ మారక నిల్వలు అవసరమని ఐఎంఎఫ్ పేర్కొంది. సంక్షోభ సమయాల్లో లేదా రుణాలు తీసుకునే అవకాశం తగ్గినప్పుడు ప్రయోజనం ఉంటుంది.

ఫారెక్స్ నిల్వలు ఎందుకు పెరిగాయి?

ఫారెక్స్ నిల్వలు ఎందుకు పెరిగాయి?

ఓ వైపు మందగమనం ఉంటే మరోవైపు ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా భారత మార్కెట్లో విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారుల పెట్టుబడులు పెరగడం. గత రెండు నెలల కాలంలో వివిధ భారతీయ కంపెనీల్లో పలు విదేశీ పెట్టుబడిదారులు లేదా సంస్థలు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాయి. మార్చిలో డెట్, ఈక్విటీ నుండి రూ.60,000 కోట్ల FPIలు వెనక్కి వెళ్లాయి. అయితే ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. జూన్ మొదటి వారంలో 2.75 బిలియన్ డాలర్ల స్టాక్స్ కొనుగోలు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి రూ.97,000 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు పెద్ద మొత్తంలో పెరిగి 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటున్నాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో చమురు దిగుమతి బిల్లులు తగ్గాయి. ఇది విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది. విదేశీ చెల్లింపులు, విదేశీ ప్రయాణాలు తగ్గాయి. ఏప్రిల్ నెలలో 61 శాతం తగ్గాయి. మే, జూన్ నెలల్లో డాలర్ ఔట్ ఫ్లో మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.

రూపాయి బలోపేతానికి

రూపాయి బలోపేతానికి

కరోనా కారణంగా 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న నిల్వలు డాలర్‌తో పోలిస్తే రూపాయిని బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయి. ఫారెక్స్ రిజర్వ్స్ జీడీపీలో దాదాపు 15 శాతం ఉంటాయి. ఈ రిజర్వ్స్ మార్కెట్లలో విశ్వాసం నింపడం సహా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఫారెక్స్ నిల్వల్లో 64 శాతం విదేశీ ట్రెజరీ బిల్స్ వంటి సెక్యూరిటీస్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా సహా విదేశీ సెంట్రల్ బ్యాంకుల్లో 28 శాతం, 7.4 శాతం విదేశాల్లోని కమర్షియల్ బ్యాంకుల్లో ఉన్నాయి.

ఫారెక్స్ నిల్వలపై రాబడి

ఫారెక్స్ నిల్వలపై రాబడి

విదేశీ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లో ఉంచిన భారత ఫారెక్స్ నిల్వలపై రాబడి తక్కువగా ఉంటుంది. ఫారెక్స్ ఇన్వెస్ట్‌మెంట్ రాబడిపై స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ అమెరికా, యూరోజోన్‌లలోని నిల్వలపై ఒక శాతం లేదా అంతకంటే తక్కువ రాబడి ఉండవచ్చునని అంచనా. దేశంలో మౌలిక వసతుల సదుపాయాల కోసం ఫారెక్స్ నిల్వలు ఉపయోగించాలని కొందరి నుండి డిమాండ్ రాగా, ఆర్బీఐ దీనిని వ్యతిరేకించింది.

English summary

Covid 19: భారత్‌కు అండగా నిన్న బంగారం, నేడు ఫారెక్స్ నిల్వలు: ఆర్థిక వ్యవస్థకు ఎలా లాభం | India's forex reserves increased amid Covid-19 economic crisis

Unlike in 1991, when India had to pledge its gold reserves to stave off a major financial crisis, the country can now depend on its soaring foreign exchange reserves to tackle any crisis on the economic front.
Story first published: Tuesday, June 9, 2020, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X