For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!

|

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌ను ఇండేన్ గ్యాస్ మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఫోన్, ఎస్సెమ్మెస్, యాప్, వెబ్ సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. నవంబర్ 1వ తేదీ నుండి డెలివరీ, ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసే విధానం మారింది. ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్ నెంబర్ కూడా మారిన విషయం తెలిసిందే. ఇండేన్ ఎస్సెమ్మెస్ ద్వారా రీఫిల్ కోసం కొత్త నెంబర్‌ను పంపించింది. వాట్సాప్ ద్వారా పంపించేందుకు కూడా నెంబర్ అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ ద్వారా ఇలా బుకింగ్

వాట్సాప్ ద్వారా ఇలా బుకింగ్

మీరు ఇండేన్ గ్యాస్ కస్టమర్ అయితే... గ్యాస్ రీఫిల్ కోసం వాట్సాప్ ద్వారా బుక్ చేయడానికి 7588888824 నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్‌ను మీ ఫోన్ కాంటాక్టులో సేవ్ చేసుకున్న తర్వాత రీఫిల్ అని సందేశం పంపించాలి. లేదా 7718955555 ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి, ఆప్షన్ ఎంచుకొని, రీఫిల్ బుకింగ్ చేయవచ్చు. ఈ రీఫిల్ సందేశాలను రిజిస్టర్డ్ మొబైల్ నుండి పంపించవలసి ఉంటుంది.

ఇటీవలే కొత్త నెంబర్

ఇటీవలే కొత్త నెంబర్

ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ నవంబర్ 1వ తేదీ నుండి మారింది. కస్టమర్ సౌలభ్యం కోసం ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం ఒక కామన్ నెంబర్‌ను ప్రారంభించింది. ఈ కామన్ బుకింగ్ నెంబర్ 7718955555. దేశానికి అంతటికీ ఇదే నెంబర్ వర్తిస్తుంది. కస్టమర్లకు 24x7 ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. కామన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్ ఫోన్ నెంబర్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం ఉంది. కస్టమర్ ఓ టెలికం సర్కిల్ నుండి మరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు ఇండేన్ రీఫిల్ బుకింగ్ ఫోన్ నెంబర్ యథాతథంగా ఉంటుంది. ఇండెన్ ఎల్పీజీ బుకింగ్ కస్టమర్ రిజిస్టర్ నెంబర్‌ను మాత్రమే ఉపయోగించి చేయాలి.

ఓటీపీ ఆధారిత సేవలు

ఓటీపీ ఆధారిత సేవలు

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఓటీపీ ఆధారిత డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. డెలివరీ అథెంటికేషన్ కోడ్(DAC)ను 100 స్మార్ట్ సిటీల్లో తొలి విడతగా అమలు చేస్తోంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ అప్ డేట్ కాకపోతే సంబంధిత డెలివరీ బాయ్ మీ ఫోన్ నెంబర్‌ను యాప్ సాయంతో అప్ డేట్ చేస్తారు. ఓటీపీ ఆధారిత సేవలను అన్ని గ్యాస్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. సిలిండర్లు పక్కదారి పట్టకుండా దీనిని తీసుకు వచ్చారు. త్వరలో దేశవ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. కమర్షియల్ సిలిండర్లకు వర్తించదు.

English summary

Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి! | Indane customers can now book LPG cylinders through WhatsApp

From November 1, the delivery and the way of booking LPG cylinders has changed. The phone number of Indane for booking in the new delivery system has also changed. Indane has sent a new number via SMS to their registered mobile number through which you can book a Gas Refill.
Story first published: Friday, November 6, 2020, 20:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X