దీపావళి, ధనతెరాస్ సందర్భంగా మనకు ఇష్టమైన వారికి బహుమతులు ఇవ్వడం పరిపాటి. కేవలం తీపిపదార్థాలు మాత్రమే కాదు. నగదు, బంగారం, వెండి రూపంలోను బహుమతులు పంచుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఈ బహుమతులు ఓ పరిమితి మించితే ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించవలసి ఉంటుంది. లేదంే ఈ బహుమానం సమస్యలు తెచ్చిపెడుతుంది. నగదు, వెండి, బంగారు ఆభరణాలు, పేయింటింగ్స్, అలంకరణ సామాగ్రి, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా ఇతర ఆర్థిక సాధనాలు ఏవైనా రూ.50వేలు మించితే ఐటీ శాఖకు వెల్లడించాలి. ఆదాయపు పన్ను చట్టం 56(2) కింద ఆర్థిక సంవత్సర కాలంలో వచ్చిన బహుమతులను ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. అప్రమత్తత లేకుంటే వీటిపై ట్యాక్స్ పడుతుంది.

ఏ బహుమతులకు పన్ను ఉంటుంది
నగదు రూపంలో స్వీకరించే బహుమతులు, వస్తు రూపంలో ఇచ్చే బహుమతులు పన్ను పరిధిలోకి వస్తాయి. ఆభరణాలు, బులియన్, శిల్పాలు, పేయింటింగ్స్ మొదలైన బహుమతులకు సంబంధించి రూ.50,000 దాటితే వాటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పన్ను విధిస్తారు. ఆస్తి వ్యాల్యూను పరిగణలోకి తీసుకోకుండా, స్థిరాస్తిని బహుమతిగా తీసుకుంటే కనుక స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ రూ.50,000 దాటితే ఆదాయపు పన్ను విధిస్తారు. అయితే స్థిరాస్తిని తగిన పరిగణనతో బదలీ చేసిన సందర్భంలో స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ రూ.50,000 మించి ఉంటే పన్ను విధిస్తారు.అలాగే సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే క్యాష్ బహుమతులు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ బహుమతి తీసుకున్నవారు ఆదాయ పన్నును చెల్లించాలి.

పన్ను పరిధిలోకి రానివి
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం బంధువుల నుండి తీసుకునే బహుమతులు పన్ను పరిధిలోకి రావు. అంటే భార్యాభర్తలు, సంతానం, తల్లి లేదా తండ్రి తరఫువాళ్లు ఇచ్చే బహుమతులు పన్నుల పరిధిలోకి రావు. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే బహుమతులకు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే పెళ్లి సందర్భంగా వచ్చే బహుమతులు, వంశపారంపర్యంగా సంక్రమించే బహుమతులు కూడా పన్ను పరిధిలోకి రావు.

నిర్దిష్ట పరిమితి దాటితే..
మన దేశంలో బహుమతులు నిర్దిష్ట పరిమితిని దాటితే పన్ను విధిస్తారు. ఇది బహుమతిని ఇచ్చే లేదా స్వీకరించే వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఎవరైనా రూ.50,000కు మించి బహుమతి స్వీకరిస్తే మొత్తం పైన పన్ను ఉంటుంది. లేదా పలుమార్లు బహుమతులు పొందితే, ఇవి రూ.50,000 దాటితే ఆ మొత్తం వ్యాల్యూను నివేదించాలి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications