For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ ద్వారా ICICI బ్యాంకు సేవలు, ఇలా చేయండి...

|

కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో పలు కంపెనీలు వాట్సాప్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాయి. సోనీ, శామ్‌సంగ్, పానాసోనిక్, హైయర్, గోద్రెజ్ వంటి కంపెనీలు వాట్పాస్ వంటి మాధ్యమాల ద్వారా ఆన్ కాల్ అసిస్టెన్స్ ద్వారా అందరు ఖాతాదారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కస్టమర్లకు సమస్య వస్తే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా దానిని తెలుసుకొని, పరిష్కరిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు కూడా తమ కస్టమర్లకు వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చింది.

Covid 19: ఇదీ చైనా ఆర్థిక దుస్థితి, 44 ఏళ్లలో ఇలా జరగలేదు! డ్రాగన్‌కు 2 సవాళ్లుCovid 19: ఇదీ చైనా ఆర్థిక దుస్థితి, 44 ఏళ్లలో ఇలా జరగలేదు! డ్రాగన్‌కు 2 సవాళ్లు

ఈ సేవలన్నీ పొందవచ్చు

ఈ సేవలన్నీ పొందవచ్చు

వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందే సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల ఇంటి నుండే బ్యాంకింగ్ అవసరాలు పూర్తి చేసే విధంగా ఈ సేవల్ని రూపొందించింది. వాట్సాప్ ఐసీఐసీఐ స్టాక్ సేవల్ని రిటైల్, బిజినెస్ ఖాతాదార్లు పొందవచ్చు. ఇందులో దాదాపు 500 రకాల సేవల లభిస్తాయి. సేవింగ్స్ ఖాతా నిల్వ, గత మూడు ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డు పరిమితి, తక్షణ రుణం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు బ్లాక్, ఆన్ బ్లాక్ వంటి సేవలు పొందవచ్చు.

ఇలా చేయండి...

ఇలా చేయండి...

- ఖాతాదారుడు ఐసీఐసీఐ బ్యాంకు ధృవీకరించిన వాట్సాప్ ప్రొఫైల్ నెంబర్‌ను కాంటాక్ట్ నెంబర్‌లలో సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్ 9324953001.

- తర్వాత బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి ఈ నెంబరుకు హాయ్ అని సందేశం పంపించాలి.

అందుబాటులో వివిధ సేవలు

అందుబాటులో వివిధ సేవలు

- ఆ తర్వాత బ్యాంకు సేవల వివరాలతో కూడిన జాబితా వస్తుంది.

- ఆ సేవల జాబితాలో అవసరమైన సేవకు సంబంధించిన వారు సూచించిన విధంగా పంపించాలి.

- దీని ద్వారా మీ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డు లిమిట్, కార్డ్ బ్లాక్, దగ్గరలోని ఏటీఎం.. ఇలా వివిధ సేవలు అందుబాటులో ఉంటాయి.

English summary

వాట్సాప్ ద్వారా ICICI బ్యాంకు సేవలు, ఇలా చేయండి... | ICICI launches WhatsApp banking for its customers, all you need to know

ICICI Bank announced on Wednesday it has collaborated with WhatsApp to provide a seamless banking experience to its customers. ICICI Bank launched a service that would allow the customers to manage their bank accounts through WhatsApp chat.
Story first published: Thursday, April 2, 2020, 14:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X